చావు - అచ్చంగా తెలుగు
చావు
భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.చావు...అదినీవు ఎన్నటికైనా చేరాల్సిన రేవు,
దాని బారినుండి నీవసలు తప్పించుకోలేవు.
దానికి నీ ఆర్తితోను,నీ కీర్తితోను పనిలేదు,
నీ ఆర్తనాదాలతోను,నీమంగళవాద్యాలతోను పనిలేదు.
నీ తీరిన నీ ఆయువే దానికి ఆయుధం,
వీడిన నీ ఋణమే దానికిఆరాధ్యం.
నీ తనువునుండి,నీ తపనలనుండి,
నీ ఆశలనుండి,నీ బాసలనుండి 
నిన్ను విముక్తుడినిచేయటం,
ధీరుడవైన నిన్ను భీరువుగా మార్చటం,
సందడిగాఉంటున్ననీలో అలజడిని సృష్టించటం,
ఇంకా అనుభవిద్దామనుకుంటున్ననీ ఆరాటానికి హద్దులు విధించటం,
శాశ్వతమనుకున్న నీ జీవితానికి శలవునుప్రకటించటం,
ఇవే దాని కర్తవ్యాలు.
ఎన్నటికైనా నువ్వు స్వాగతించాల్సిన సత్యం అదే,
నీ జీవితంలోని ఆఖరి అధ్యాయం అదే.
***

No comments:

Post a Comment

Pages