పార్కు
పారనంది శాంతకుమారి
ఇక్కడ అల్లకల్లోలాలన్నీ ఆదమరిచిఉంటాయి,
ప్రకంపనలన్నీ ప్రశాంతతను పొందిఉంటాయి,
అశాంతులన్నీ అణిగిఉంటాయి,
మోహాలన్నీ మిన్నకుంటాయి,
సంకల్పాలు సడి చేయవు,భావాలన్నీ బజ్జుంటాయి.
పిల్ల గాలి,తెలియని జాలి మనని అల్లుకుంటాయి.
పచ్చదనం,హాయితనం మనని ఆహ్వానిస్తాయి.
కన్నులు ముతపడుతూ ఉంటాయి,
మనసు మౌనంతో చెలిమిచేస్తూ ఉంటుంది.
తనువు తేలికౌతుంది,ఏకాంతం ఏలికౌతుంది.
ఈ క్షణంతో జీవితం జతపడుతుంది.
ఇక్కడ అందరి ఆలోచనలు మౌనాన్ని ఆశ్రయిస్తాయి.
అందరి ఆవేదనలు మత్తుకు లోనవుతాయి. 
శోకానికి శలవిప్పించి,
ఎదను మరో లోకానికి తీసుకెళ్తుంది పార్కు.
***
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment