సకలానర్ధ కారణం‌ ప్రేమ - అచ్చంగా తెలుగు

సకలానర్ధ కారణం‌ ప్రేమ

Share This
శీర్షికసకలానర్ధ కారణం ప్రేమ
 వాసుదేవమూర్తి శ్రీపతి


నీ హసనామృతాన్ని గ్రోలిన పాపమేమో
నా మనసు అమరమైపోయింది
విసుగు చెందకుండా నీ
ఙ్ఞాపకాలని నాపై ఎక్కుపెడుతూ
నన్ను వ్యసనపరుడిగా మార్చేసింది.

ఏ అమరప్రేమికుడి సమాధిపైనో
పూసిన పూలని నీకు కానుక చేశానేమో
ఆ దోషం నిన్ను చేరే మార్గాన్ని
మృత్యువు చేరే మార్గాన్ని
కూడా మూసేసి
నిరంతంరం నన్ను
విరహ విషాద వీధులలో
దిశాగమ్యం లేని
బాటసారిగా మార్చేసింది.

నా ప్రేమలో లోపమో
ప్రేమించిన విధానంలో లోపమో
అసలు ప్రేమించడమే లోపమో
మన ప్రేమపై నీకున్న అవగాహన లోపమో

సకలానర్ధకారణం ప్రేమ
అని నేను అనుకునేలా చేసింది.


***         

No comments:

Post a Comment

Pages