ఆలోచించి చూడు! - అచ్చంగా తెలుగు
ఆలోచించి చూడు!
   పారనంది శాంతకుమారి.నీవు పొందుతున్న విజయాల  వెనుక 
ప్రకటింపబడని ఎన్ని ప్రార్ధనలున్నాయో,
నీవు తెలుసుకోలేని ఎన్నెన్ని దీవెనలున్నాయో, 
ఆలోచించి చూడు, అర్ధమౌతుంది.

నీవు ఆనందంగా వేస్తున్న అడుగులవెనుక
అదృశ్యంగా వెంబడిస్తూన్నఎన్ని ఆర్ధ్రతలు ఉన్నాయో,
అంతులేని ఎన్నెన్ని ఆవేదనలు ఉన్నాయో,
పొంతనకుదరని ఎన్ని ప్రేమ ఆవేశాలున్నాయో అవలోకించి చూడు,
లేకుంటే నీ జీవితం వ్యర్ధం అవుతుంది.

నీ సుఖాల వెనుక 
ఎన్ని ఇష్టాల సమాధులున్నాయో,
మరెన్నికష్టాల పునాదులు ఉన్నాయో,
తెలియనివ్వని ఎన్నెన్ని త్యాగాల ఫలాలు ఉన్నాయో విశ్లేషించి చూడు,
లేకుంటే నీది వట్టి స్వార్ధం అవుతుంది.

ఎక్కి వచ్చిన మెట్లను ఏవగించుకోవటం తోనే 
నీ పతనం ఆరంభమౌతుంది,
వేలునిచ్చి నడిపించిన చేతులను విదిలించుకోవటంతోనే 
నీ పయనం దుర్గమమౌతుంది.

 ***

No comments:

Post a Comment

Pages