ఈదారి మనసైనది - 16 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది - 16
అంగులూరి అంజనీదేవి

(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది. జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత.)   
పదిరోజులుగడిచాక....
పల్స్ పోగ్రాంకి రావలసిందిగా ఎయిమ్స్ (AIIMS)నుంచి ఆహ్వానం వచ్చింది.
ఈ ప్రోగ్రాం కోసం ప్రతి విద్యార్థి ఎప్పడెప్పడాఅని ఎదురు చూస్తున్నారు.
దీక్షిత మాత్రం ఈ పోగ్రాం పట్ల ఎలాంటి కలలు లేని దానిలా ఉంది.
దీక్షిత ప్రోగ్రాంకి రాదన్న విషయం తెలిసి లోలోన సంబర పడింది మన్విత, అనురాగ్ కి తన మనసు తెలుపుకోవాలన్నా అతని మనసు గెలుచుకోవాలన్నా ఇదో మంచి అవకాశంలా భావించింది. ఇది అసూయకాదు. ఆశ. మన్విత కూడా అందరమ్మాయిల్లాగా తన ప్రేమకోసం ఆరాటపడ్తుంది.. ఆ ఆరాటంలో కలిగిన చిన్న ఫీలింగే ఈ ఆనందం.
ఆ టూర్ లో దీక్షిత లేకుంటే.. అనురాగ్ కి దగ్గరగా తిరగొచ్చు మాట్లాడొచ్చు. మనుసులో వున్నది చెప్పకోవచ్చు. ఇది ఆమె ఆశ.
ఇంత కన్నా ఏం కావాలి?
ఇప్పడు ... ప్రపంచం రంగురంగులుఇంద్రదనుస్సులాఉంది మన్వితకి.
అనురాగ్ వెళ్లి...పోగ్రాం గురించి చెప్పి దీక్షితను రమ్మని చెప్పాడు. ఆమె ఒప్పకోకపోయో సరికి - నిరాశగా ఫీలయ్యాడు.
ఎలాగైనా పల్స్ ప్రోగ్రాంకి దీక్షితనుతీసికెళ్లాలని ఆమె ఫ్రెండ్స్ ద్వారా చెప్పించాడు.
ఫైనాన్స్ ప్రాబ్లమ్ వల్ల ఆమె రాలేనంటుందని ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాడు.
ఆ డబ్బులు అతనే ప్రొవైడ్ చెయ్యాలనుకున్నాడు.
ఆమెకు అయ్యే ఖర్చులు వాళ్ల ఫ్రెండ్స్ తో  పంపించాడు.
ఫ్రెండ్సేయిస్తున్నట్లుగాయిచ్చి పంపించాడు
దీక్షిత ఒప్పకుంది. పల్స్ కెల్లే విషయాన్ని వెంటనే పేరెంట్స్ కి  తెలియజేసింది. "ఫ్రెండ్ దగ్గర తీసుకున్న డబ్బుని మామయ్యని అడిగి తర్వాత పంపుతా" అని పేరెంట్స్అన్నారు.
అనురాగ్ తక్షణమే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి  లెటర్ తీసుకొని స్టేషన్ కెళ్ళి  రెండు బోగీలను రిజర్వ్ చేయించాడు.
మరుసటి రోజు తొమ్మిది గంటలకి... మెడికో విద్యార్థులంతా కాజీపేట్లోఎ.పి. ఎక్స్ప్రెస్ ట్రైను ఎక్కి బయలుదేరారు.
ట్రైన్ లో అబ్బాయిలు ఒక వైపు, అమ్మాయిలు ఒక వైపు కూర్చున్నారు. కిటికీ వైపు సీట్లో అనురాగ్ కూర్చున్నాడు. అతనికి ఎదురుగా దీక్షిత కూర్చుంది. దీక్షిత పక్కన సౌమ్య,సౌమ్యకి ఎదురుగా దినేష్ సౌమ్య పక్కన, సీటుకి చివరగా మన్విత, మన్వితకి ఎదురుగా ఆకాశ్ కూర్చున్నాడు.
ఎవరి సీట్లలో వాళ్లు కూర్చున్నాక... అమ్మాయిలు, అబ్బాయిలు కలసిటైంపాస్కిఅంతాక్షరిఅడుకున్నారు.
అంతాక్షరి అయ్యాక ఎవరికి నచ్చిన పాటలు వాళ్లు పాడాలను కున్నారు. అనుకున్న వెంటనే పాడటం మొదలు పెట్టారు.
అద్భుతంగా పాడుతున్నారు.
అనురాగ్ వంతురాగానేగుండెలనిండా గాలి పీల్చుకొని దీక్షిత వైపుచూస్తూ.
" ఎదుట నిలిచింది చూడు.... జలతారువెన్నెలేమో
ఎదను తడిపింది నేడు.... చినుకంటిచిన్నదేమో
మైమరచిపోయామాయలో ... ప్రాణమంత మీటుతుంటే, వానవీణలా ...
ఎదుట నిలిచింది చూడూ....
నిజంలాంటి ఈ స్వప్పం ఎలా పట్టి ఆపాలి...కలే అయితే, ఆ నిజం...
ఎలా తట్టుకోవాలి....
అవునో. కాదో.. అడగకంది నా మౌనం.
చెలివో...శిలవోతెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందేజన్మఖైదులా...
ఎదుట నిలిచింది చూడు ... " అంటూ అనురాగ్ పాడుతుంటే అతని గొంతులోని మాధుర్యానికి మైమరిచిపోయారు.
మన్విత తలదించుకొని పాటలో లీనమై వింటోంది. అతను పాటలు బాగా పాడతాడని మన్వితకి తెలుసు.
తర్వాత దీక్షిత వంతురాగానే తనకు పాటలురావని గొంతు సవరించికుంటూచెబుదామని అనుకొంది. కానీ అప్పటికే ర్యాగింగ్ టైంలో పాడిన అనుభవం వుండడం వల్ల, పాటలు పాడడం వల్ల వచ్చే ఆనందాన్ని రుచి చూసింది కాబట్టి పాడటానికి సిద్ధమైంది. అప్పటికే అనురాగ్ పాడిన పాట ఆమె నరనరంలోజీర్ణించుకు పోయింది.
దీక్షిత నెమ్మదిగా తన చేతి వేళ్ల వైపు చూసుకుంటూ .
"వెంట పడుతుంది చూడు.... కనపడని మంట ఏదో
బదులు అడిగింది నేడు.... వినపడని విన్నపమేదో
మది మునిగి పోయే మత్తులో....
మధురమెనయూతనేదో... బయట పడదిలా " ... అని పాడుతుంటే అంతా షాకై విన్నారు. ఆ పాటపాడిన సింగరే వచ్చి వాళ్ల ముందు కూర్చునిపాడుతున్నట్లు ఫీలయ్యారు. అంత బాగా పాడింది దీక్షిత... అది గమనిస్తున్న మన్విత - అనురాగ్ పాడిన పాటని దీక్షిత కంటిన్యూ చేయడం వల్ల వాళ్ల ఆలోచనలు కూడా కలిసిపోయాయని ఒక్కక్షణం ఫీలయింది.
"సూపర్స్ .. ఎలా పాడగలిగావు .. ఇలా ? వింటుంటే ప్రతి పదం హృదయాన్ని పిండుతున్నట్లే వుంది. నీ మనసుల్లో బయట పెట్టలేని బాధేమైనావుందా?" అంది వెంటనే సౌమ్య దీక్షిత చేతిని తన చేతిలోకి తీసుకుంటూ..
“ఛ . ఛ. అలాంటిదేం లేదు. " అంటూ అనురాగ్ వైపు చూసింది దీక్షిత
అనురాగ్ వెంటనే మన్విత వైపు చూస్తూ పాడమన్నాడు
తడబడింది మన్విత,
ఇప్పడు తనేం పాడాలి ?
తనకి పాటలు రావు.
అంటే ? పూర్తిగా రావని కాదు.
స్కూల్లో చదువుతున్నప్పుడొకసారిఫ్రెండ్స్తోబాల్కానీలోకూర్చుని పాటలు పాడుతుంటే తన తల్లి లోపలకి పిలిచి ఆ చెంపా, ఈ చెంపా వాయించి పెట్టింది. మళ్లీ పాడావంటేచంపేస్తానంది.
అప్పడప్పుడు బుక్స్ సర్దుకుంటూనో, పౌడర్పూసుకుంటూనో "హమ్' చేస్తేచాలు.
“వెదవరాగాలు ఆపి పనిచూడు. ఎవరెనావింటే పిచ్చను కుంటారు. పెళ్ళీడుకొచ్చింది పెళ్లి చెయ్యమంటారు పిల్లనెలా పెంచాలో నేర్చుకోఅని నా ముఖం విూద తిడతారు. తల నేల కేసుకొనితిరగాలంటే నా వల్లకాదు". అనేది
తల్లి అలా అన్నప్పుడు తల గోడకేసి కొట్టు కోవాలనిపించేది.
ఆ బాధలో వెళ్లి తల్లితో ఎదురుతిరిగి ఎలాగెలావాలో చెప్పమని నానమ్మను అడిగేది. అప్పడు నానమ్మ ....
" నాకేం తెలుసు మనవరాలా? నేను బాల్యంలో వున్నప్పడు మా పెద్ద వాళ్లు చిన్న పిల్లవినీకేంతెలియదుమాట్లాడకు" అనే వాళ్లు యవ్వనంలోకి వచ్చాక "మంచీ– చెడుతెలియదు నోరుమూసుకొనికూర్చోఅనేవాళ్లుఇప్పడిక వృద్దాప్యంలోకి వచ్చాక "ముసలి దానివి, ఇప్పటి సంగతులు నీకేం తెలుసని మాట్లాడతావ్ ! మాట్లాడకుండా కూర్చో " అంటున్నారు నా పిల్లలు. పట్టిబుద్దెరిగాక మాట్లాడే అవకాశమే రాని నా దగ్గర నీకు చెప్పేంతటిమాటలేముంటాయి. చెప్పు?" అనేది పాపం నానమ్మ. మరి తను ?
" ఏం మన్వితా ! ఆలోచిస్తున్నావ్ ? ఏం పాడాలి అని సెలక్ట్ చేసుకుంటున్నావా?" అన్నాడు నవ్వుతూ దినేష్,
"నాకు పాటలు రావు. ప్లీజ్ ! నన్ను వదిలెయ్"అన్నట్లుగా రిక్వెస్ట్ చేస్తున్నట్లచూసిందిమన్విత,
అది గమనించి దినేష్ మన్వితను ఇబ్బంది పెట్టదలచుకోలేదు.
జీవిత ప్రయాణంలాగే ట్రైన్ ప్రయాణంలో కూడా అందరూ కలసిప్రయాణించాల్సిందే...
పాటల పోగ్రాంఅయిపోగానీ ... సంజనథమ్షరాడ్స్ ఆడుకొందామని అడిగింది.
థమ్షరాడ్స్ – అంటే మూగసైగలతో ఆడే ఆట ఆ ఆటనెంతో ఉత్సాహంగా ప్రారంభించారు. అది అయ్యాక ....
సినిమాలో జోక్స్ చెప్పకున్నారు.
ఆ తర్వాత ....
ఆమ్ రెజిలింగ్ ఆడారు. ఈ ఆట ఎదురుగా ఎవరుంటే వాళ్లతో ఆడారు. అదెవరెవరంటే? దీక్షిత - అనురాగ్, సౌమ్య - దినేష్, మన్విత– ఆకాశ్
తనది అనురాగ్ ఎదురు సీటు కానందుకు జీవితంలో ఎప్పడూకానంతగాఫీలయిందిమన్విత. తన బ్రతుకంతాఫీలవుతూ బ్రతకడమేఅయినందుకులోలోన కుమిలి పోయింది.
ఒక్క మన్విత తప్ప మిగతా అందరు ట్రైన్జర్నీహ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు.
రాంగుండం రాగానే ధర్మల్ పవర్ స్టేషన్ని, గోదావరి నది ప్రవహించటాన్ని తిలకిస్తూ ట్రైన్ లో టిఫిన్ తిని సిరిపూర్ కాగజ్ నగర్ చేరుకున్నారు.
టైం పన్నెండు అయింది.
మహారాష్ట్రలో టైన్ జర్నీ చెయ్యడం ఒక ప్రత్యేకమైన అనుభూతి అనే చెప్పవచ్చు.
చంద్రాపూర్, నాగాపూర్ దాటిన తర్వాత ట్రైన్ కొండల క్రిందనుండివెళ్తుండడంతో ట్రైన్లో చీకటి అలుముకొని లైట్స్ ఆన్ అయ్యాయి.
అబ్బాయిలంతా ఒక్క సారి కేకలతో ఉత్సాహవంతమైన అరువులతో ఎంజాయ్ చేసుకుంటూ సమయం తెలియకుండా ప్రయాణాన్ని సాగిస్తున్నారు.
రాత్రి తొమ్మిది, పది మధ్య డిన్నర్ ముగించుకొని, ఎవరి బెర్త్ మీద వాళ్లు నిద్రపోయారు.
(సశేషం)

No comments:

Post a Comment

Pages