పడిలేచిన విజేతల లక్షణాలు - అచ్చంగా తెలుగు

పడిలేచిన విజేతల లక్షణాలు

Share This

                             పడిలేచిన విజేతల లక్షణాలు
బి.వి. సత్యనగేష్

మనిషి తన జీవితంలో విజేతనై తృప్తిగావుంటూ అందరి మెప్పు పొందాలనిలేదాకనీసం   తను నమ్ముకున్న దేవుడు మెప్పునైనా పొందాలని తాపత్రయ పడుతూ వుంటాడు. విజేతనవ్వాలనుకునేసగటు మనిషికి విజయం వల్ల లాభం ఏంటి,అని  ప్రశ్నించుకుంటే... ఆ సగటు మనిషి కోరుకునే నాలుగు కోరికలు విజయం వల్ల దొరుకుతాయి.సగటు మనిషి కోరుకునే ఆ నాలుగూ ... ఇవే ! 1) డబ్బు, 2) తృప్తి, 3) గుర్తింపు, 4) ఆరోగ్యం..
            విజేత కావడం అంత సులభంకాదు. ఆ ప్రయత్నంలో పరాజయం పొందే అవకాశం కూడా వుంది. పరాజయం పొందినపుడు ఆ ప్రయత్నం అనబడే విజయమార్గం నుంచి వెనుదిరిగిన వారు విజేతలైనట్లు దాఖలాలు చరిత్రలో లేవు. దాదాపుగా విజేతలందరూ పరాజయాన్ని రుచి చూసినవారే! ఎక్కడో కోటికొక్కడు అత్యంత శ్రద్ద, కఠోర పరిశ్రమ వల్ల మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని  సాధించినంత మాత్రాన విజేతలనే వారు పరాజయాన్ని రుచిచూడరని అనుకోవడం పొరపాటు. ఒకటి లేదా పలుమార్లు పరాజయం పొందినప్పటికీ ఆ తర్వాత ప్రయత్నంలో విజయాన్ని పొందిన వారే అత్యధిక శాతం మంది వుంటారనిచరిత్ర చెప్తుంది. ఆ విధంగా విజయాలను  చేజిక్కుంచుకున్న విజేతల మనస్తత్వం గురించితెలుసుకొని తీరాల్సిందే..
            పరాజయం అనేది విజయానికి ప్రత్యర్ధిలాంటిదనిపిస్తుంది. సగటు మనిషి కానీ వాస్తవంలోకి వెళ్తే....విజయం పొందడానికి అవసరమైన శక్తిసామర్థ్యాలు మనిషికి లేనపుడు పరాజయంఅనుభవం రూపంలో తొంగిచూస్తుంది. కనుక పరాజయంపై మన అభిప్రాయాన్ని మార్చుకోవాలి.ఎలాగైనాసరే పరాజయాన్ని తప్పించుకోవాలను కోవడం అవివేకం. విజయానికి కావలసిన శక్తి సామర్థ్యాలు తక్కువగా వున్నాయనే విషయాన్ని అర్ధం చేసుకోవాలి. సానుకూల ధోరణితో శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ తదుపరి ప్రయత్నాలు చెయ్యాలి.నెగ్గాలి అనే భావనతో ఆడాలి కాని ఓడిపోకూడదనే భావనతో ఆడితే ప్రతిభ చాలా పేలవంగా వుంటుందని ఎప్పుడో చెప్పారుఅనుభవజ్ఞులు. ఒకవేళ పరాజయం పొందితేదానినొక పాఠంగా తీసుకొని నేర్చుకోవాలి.పరాజయంపై మీ భావజాలాన్ని సానుకూలంగామార్చుకోవాలి. పరాజయాల వల్ల మనిషి ఎన్నోపాఠాలు నేర్చుకుంటాడనడంలో సందేహం లేదు.
          ఒక వ్యక్తి ఎలాంటి వాడో అంచనావేయాలన్నా, ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని, వారిలోని విజేతలక్షణాల స్థాయిని తెలియచేసేది.... ఆ వ్యక్తి కష్టసమయాల్లో వున్నప్పుడు ప్రవర్తించే తీరు, ప్రదర్శించే ఆత్మవిశ్వాసం, తట్టుకొని నిలబడే  మనోనిబ్బరం మొదలైన వాటిపై ఆధారపడి వుంది.కష్టాలను తట్టుకుని అధిగమించిన వారే జీవితంలో విజేతలుగా, గొప్ప వ్యక్తులుగా గౌరవాన్నిఅందుకోగలిగేరు. వెరసి వ్యక్తి విజయం అనేది కష్టాలను, ఆ కష్ట సమయంలో ఆ వ్యక్తి వ్యవహరించే పద్ధతిలోనే వుందనేది సుస్పష్టం.కష్టసమయాల్లో  నిరాశ, నిస్పృహ, అవమానాలు, నిర్లక్ష్యాలు, భయాలు,నిర్ణయాధికారం కోల్పోవడం, అసహనంమొదలైనవెన్నో ఎదురవుతుంటాయి.అది కష్ట నమయం , క్లిష్ట సమయం , ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చే సమయం,దశ. మరి ఆ దశను దాటడం ఎలా ? కష్టాలను అధిగమించడం ఎలా?
            ఈ సమయంలో వ్యక్తి ఆలోచనా విధానం, ఆశావాదం, సంయమనం, పట్టుదల, చెయ్యాల్సిన కృషి ప్రవర్తించే తీరు, ఆ సమయంలో తనను తాను భుజం తట్టుకొని స్ఫూర్తి పొందే తీరు అనే అంశాలు ఎంతో ముఖ్యమైనవి. వివరాల్లోకి వెళదాం.
            ప్రపంచంలో కష్ట, క్లిష్ట సమయాల్లోంచి బయటపడి నిలదొక్కుకుని అద్భుత విజయాలు సాధించిన ప్రముఖులు వేల సంఖ్యలో వున్నారు. వారు సాధించినవి అసమాన్యమైన అద్భుతాలు, అటువంటి వ్యక్తులు, వారి లక్షణాల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అటువంటి వ్యక్తుల గురించి ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా గుర్తుకొచ్చే ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు థామస్ అల్వా ఎడిసన్, అబ్రహం లింకన్, వీరి పేర్లను ప్రస్తావించ కుండా వుండలేం. సమకాలీన ప్రపంచంలో కూడా వింతోమంది వున్నారు. .
          కష్టాలు పాఠాలు నేర్పుతాయి. నష్టాలు అనుభవాలు నేర్పుతాయి. కష్టనష్టాలకు సాను కూలంగా స్పందిస్తే కృషి, పట్టుదల పెరుగుతాయి. వాటి నుంచి స్పూర్తి కలిగితే మనిషిని కార్యాచరణ లోకి దింపుతుంది. కార్యాచరణ ఆశయాలను నెరవేరుస్తుంది. ఆశయాలు నెరవేర్చుకున్నవారు విజేతలౌతారు. విజేతలకున్న వనరులే వరాలుగా మారుతాయి. కొత్త వరాలతో మరింత పెద్దస్థాయికి ఎదగాలనే తపనతో వుంటారు. అందుకే కష్టనష్టాలనే వాటిని మనిషి అర్ధం చేసుకునే తీరుపైనే వుంటుంది. కష్టనష్టాలు, పరాజయాలనబడే పదునైన మెట్లపై ఎన్నో పాఠాలు, అనుభవాలు పొంది, నిరాశ చెందకుండా నిరంతర సాధనతో ప్రయత్నాలను ముమ్మరం చేసి అత్యంత ప్రముఖ వ్యక్తుల్లా మారినవారెందరో వున్నారు.
          ప్రపంచమంతా ఎదురుచూస్తున్న సమయంలో మొట్టమొదటి రాకెట్ ప్రయోగంలో పరాజయం పొందిన భారతరత్న అబ్దుల్ కలాం జీవిత చరిత్ర అందరికీ తెలిసిందే. గత తరంలో ఎన్నో పరాజయాలు, కష్టనష్టాలు తట్టుకొని ప్రపంచ ఖ్యాతిని సాధించుకున్న మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, గణిత శాస్త్రజ్ఞుడు రామానుజం, వైద్యపరిశోధనారంగంలో విశిష్టమైన ఖ్యాతిని సాధించిన ఎల్లాప్రగడ సుబ్బారావు భారతదేశ, ఎలక్ట్రానిక్ రంగంలో విశిష్టమైన ఖ్యాతిని సాధించిన ఎ.ఎస్.రావు చెప్పుకోదగ్గ గొప్ప మహానుభావులు. ఈ విధంగా ఇంకా ఎంతో మంది వున్నారు.
            ఈ తరంలో కూడా కష్టనష్టాలను ఎదుర్కొని " మనోనిబ్బరంతో విజేతలైన వారు కొన్ని వేల సంఖ్యలో వున్నారు. ఉద్యోగ, వరీక్షల్లో, వ్యాపారాల్లో, క్రీడారంగంలో ఎన్నో వేల మంది ఆయా రంగాల్లో ఆటుపోట్లను తట్టుకొని, పరాజయాల్ని రూచిచూసిన తర్వాత కూడా విజేతలయ్యేరు.
          కష్టనష్టాలు, పరాజయాలు ఎదురైనప్పటికీవిజయాల్ని సాధించే వారి మానసిక లక్షణాల గురించి తెలుసుకుందాం.
·         కష్టపడి పనిచేస్తున్నప్పటకీ ఆ పనిని కష్టం అని అనుకోకుండా ఇష్టంగా భావిస్తారు. కష్టపడుతున్నామనే భావనతో కాకుండా - పోటీతత్వంతో అంతిమ లక్ష్యంవై పే చూస్తుంటారు.
·         కష్టాలు ఎదురైనప్పటికీ తమను తాము ప్రేరేపించుకుని స్పూర్తితో ముందడుగు వేసే లక్షణంతో వుంటారు.
·         విజేతకు ఉపయోగపడే మంచి అలవాట్లను అలవరచుకుంటారు. ఈ మంచి అలవాట్ల వలన కొన్ని కష్టనష్టాలను ముందుగానే దూరంచేయవచ్చుననే భావనతో వుంటారు.
·         ఓడిపోవడానికి ఇష్టపడరు, ఓటమిని ఒక - పాఠంగా తీసుకొని శక్తి సామర్థ్యాలను అంచనా
·         వేసుకుంటూ వుంటారు. తమ ఓటమికి - పోటీదారుల శక్తి సామర్ధ్యాలే కారణమని నమ్మనపుడు వారి కంటే ఒక మెట్టు పైన వుండాలని, ఓటమిని పొందకూడదనే స్పృహతో వుంటారు.
·         కష్టనష్టాలు, పరాజయాలు ఎదురైనప్పుడు ఆత్మ విమర్శ చేసుకుంటారు. వారిని వారు, నమర్ధించుకోరు. ఎవరైనా విమర్శిస్తే అందులోని సారాంశాన్ని సానుకూలంగాతీసుకొని ప్రగతివైపు ప్రయాణిస్తారు.
గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకునే  ప్రయత్నంలోనే వుంటారుకాని, గతంలోనిలోపాలను తలచుకొని కృంగిపోరు.
ఎవ్పటికప్పుడు వారి సామర్థ్యాలను, అవకాశాలను మెరుగు పరుచుకుంటారు. బలహీనతల్ని, భయాలను ఎదుర్కొని వాటి  నుండి బయటపడే ప్రయత్నాలు చేస్తూవుంటారు. శక్తి సామర్ధ్యాలకు, లక్ష్యంకు మధ్యనున్న దూరం పెరిగిన కొద్దీ విజయానికి దూరమౌతామనేది సందేహంలేని విషయం. కనుక నిర్దేశించుకున్నలక్ష్యాన్ని చేరడానికి కావలసిన శక్తి సామర్ధ్యాలపై  అంచనా వేసుకుంటూ, పరాజయాల్నిపాఠాలుగా తీసుకుని ముందుకెళ్తూ వుంటారు.
·          “అవకాశం అనేది ఒకే ఒకసారి తలుపుతుడుతుందిఅనేది పాతకాలం నానుడి.అవకాశాలనేవి తలుపు తడుతూనే వుంటాయి, మనం తలుపులు తీసి అవకాశాలనుఅవసరాలుగా గుర్తించి. ఆలింగనం చేసుకొనిసద్వినియోగ పరచుకోవాలి. అనేది నేటి తరం నానుడి.
·         బలహీనతలనేవి మనిషి పతనానికిదారితీస్తాయి. కనుక విజేతలవ్వాలనుకునేవారు పరాజయాలు, కష్టనష్టాలొచ్చినప్పుడు బలహీనతలకు ఏ మాత్రం లొంగకుండావుంటారు.
·         భయం అనేది ఒక ప్రతికూల భావనే అయినప్పటికీ మరొక కోణంలో ఆలోచిస్తే . భయం అనేది బలమైన కోరిక లేనప్పుడు పుట్టే భావన అని అనుకోవచ్చు. ఒక పాట పాడాలనే  బలమైన కోరిక వున్న వ్యక్తిలో భయం అనే భావన వుండదు. అలాగే పబ్లిక్ స్పీకింగ్, చదువు,వ్యాపారం లాంటి ఉదాహరణలలో కూడా ఈ నిర్వచనం ఇమిడిపోగలదు. కనుక భయంనుండి బయటపడాలంటే బలమైన కోరికనువృద్ధి చేసుకోవాలి, కష్టనష్టాలకు, పరాజయాలకుభయపడుతున్నావంటే నీకు బలమైన కోరికలేదంతే! అన్న విధంగా వుండాలి విజేతలమానసిక దృక్పథం.
·         పరాజయం పొందినప్పటికీ తట్టుకొని నిలబడే  మనో నిబ్బరం కావాలంటే లక్ష్య సాధనవిషయంలో నిరంతర పరిశీలన, పరిశోధనజరుగుతూనే వుండాలి. మనకు తెలియకుండానే రాత్రి పగలు మనం శ్వాస తీసుకుంటూనేవున్నట్లు లక్ష్యం వైపు సాధన చేస్తూవుంటే తపన పెరుగుతూ వుంటుంది. తపన అనే బలమైన కోరిక వున్నప్పుడు కష్టనష్టాలు, పరాజయాలు కనుమరుగైపోతాయి.

          చివరిగా... మనిషి అనుకున్న లక్ష్యాలను చేరాలంటే కృషి, పట్టుదలతో సాధన చెయ్యడమే  కాదు... ఆ క్రమంలో ఎదురైన కష్టనష్టాలను, పరాజయాలను సంబాళించుకుంటూ ఓపిక, సహనంతో లక్ష్యం చేరేంత వరకు ప్రయత్నించడంవిజేతల లక్షణం అని చరిత్ర చెప్తుంది.  కనుకపైసమాచారాన్ని ఆచరణలో పెడుతూ ముందుకెల్దాము.ఆలశ్యమెందుకు ? పదండి ముందుకు.

***

No comments:

Post a Comment

Pages