ఏ ధ్యానమూ చేయనివారు - అచ్చంగా తెలుగు
ఏ ధ్యానమూ చేయనివారు......
భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు

ఏ ధ్యానమూ చేయనివారెంత దరిద్రులో,
ఏ పూజలూ చేయనివారెంత పాపాత్ములో, 
ఏ పండుగలూ జరుపుకోనివారెంత పిచ్చివారో ,
ఏ నోములూ నోచుకోనివారెంత నిష్ప్రయోజకులో,
ఏ వ్రతాలూ ఆచరించనివారెంత వెర్రివారో,
బొట్టునుకూడదన్న వారెంత బుద్ధిహినులో, 
మతం మార్చుకొనే వారెంత మందమతులో,
దైవాన్ని మార్చుకొనే వారెంత దాగాకోరులో. 
ఈ దేశమిచ్చిన దేహానికి పరమతపు రంగులెందుకు?
నీ పూర్వీకులిచ్చిన సాంప్రదాయాలకు, 
పరదేశస్తుల హంగులెందుకు?
మార్చుకోవలసింది మతాన్నికాదు, నీ అభిమతాన్ని.
వదులుకోవలసినది నీ కట్టుబాట్లను, కట్టూబొట్టుని కాదు,
నీ అజ్ఞానాన్ని.
మార్చుకోవలసింది మార్గాన్ని కాదు, నీ మనుగడని.
నీ దేశాన్ని కీర్తించు, నీ మతాన్ని ప్రేమించు,
నీ సాంప్రదాయాన్ని గౌరవించు, నీ కట్టుబాట్లను పాటించు.

 ***

No comments:

Post a Comment

Pages