అప్సరస - అచ్చంగా తెలుగు
అప్సరస..
సుజాత తిమ్మన
(చిత్రం: ఉదయ్ కుమార్ మార్లపూడి గారి సౌజన్యంతో)


అప్సరసల అందమంతా అలవోకగ అందినదేమో ..
నక్షత్రాల తళుకులన్నీ మేని వొంపులలో మెరుస్తున్నవి ..!

భువిపై మోపిన లేత తమలపకులను పోలిన పాదాలు 
మువ్వల మంజీరాల సొగసులతో మురుస్తున్నవి...!

పున్నమి రాతిరి వెన్నెల తాగిన జలపాతం ..
సరాగాల సరసమాడు రాయంచలపై చినుకులు విసురుతున్నది ..!

పాల నురుగుల కోక గట్టిన పడుచు చిన్నది..
పచ్చికలోన విరిసిన రంగురంగుల పూలతో పోటిపడుతున్నది..!

తన తోడు గోరువంక ఏదని వేదనతో రామచిలుక ..
ప్రేమబాష్యం తెలిసిన పడతి తాననుకొని పలకరిస్తున్నది..!

ఎదభావనలు పొంగ విచ్చిన నెలవంక చిరునగవు ..
అరమూసిన రెప్పల అదురులతో పోటీ పడుతున్నది...!

ఏ చిత్రకారుని మదిని గిలిగింతలు పెట్టిన చిత్రమో ..
కుంచెకొసలతో  ప్రాణం పోసుకొని రూపు దిద్దుకున్నది ..!
*************** 


1 comment:

  1. chitram adbhutamgaa undi ..uday kumar gaariki hrudaya purvaka dhanyavadalu ..Padminigaaru dhanyavadalandi..

    ReplyDelete

Pages