వివాహము - అచ్చంగా తెలుగు
వివాహము.
ఆదూరి హైమవతి
  
"అత్తయ్యగారూ! వదిన గారి కూతురు వసు పెళ్ళిట, ఇదిగోండి శుభ లేక వచ్చింది.అనుకోకుండా కుది రిందిట. అందువల్ల ముందుగా చెప్ప లేదనీ , మొబైల్ మెసేజ్ లోని వివాహ పత్రికనే పెళ్ళిపత్రిక గా భావించి బయల్దేరమనీ మెసేజ్ ఇచ్చారు. " అంటూ తన మొబైల్ ఫోన్ లో పెళ్ళి పత్రికను పెద్దగా చేసి అత్తగారికి అందించింది అరుణ.
ఆమె దాన్ని అందుకుని "మరీ విచిత్రమే ! ఫోనన్నాచేసి చెప్పచ్చు గా! విడ్డూరం "అంది.
"కాదు అత్తయ్యగారూ! రాత్రికి మాట్లాడుతానని మెసేజ్ లో పెట్టారు చూడండి. పెళ్ళంటే మాటలా ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అది అమేరికా సంబంధంట. చూడగానే పెళ్ళి వారంలో చేసేసి తనతో తీసుకెళతానన్నాట్ట. అందుకే ఇంత హడావిడిట!" అంది అరుణ.
 "పూర్వం పెళ్ళిళ్లంటే వారం పదిరోజుల పాటు చుట్టాలూ పక్కాలతో ఇళ్ళు కళకళాలాడేవి.ఒక్కోమారు నెలపాటు బంధువులు ఉం డేవారు. ఇప్పుడేముందే అంతా రెడీమేడ్ అరేంజ్ మెంట్సేగా . ఈవెంట్ మేరే జస్." అన్నారావిడ.
  అప్పుడే ఇంట్లో కొచ్చిన నందిని "ఏంటి బామ్మా ఈవెంట్ అంటు న్నా వు! మ్యారేజ్ అంటున్నావు? ఎవరికి !బామ్మా! " అంది.

"మీ అత్త కూతురికి "అంది టూకీగా ఆవిడ .కూతురుతనతో ఒక్కమాట న్నా ముందుగా చెప్పలేదని కినుక కనపరుస్తూ.
" ఓహ్ ! వసూ కా ! భలేభలే నాకు వారంపాటు సెలవులు వెళదామా ! అమ్మా! "
"తప్పక వెళ్లాలి. నాన్నగారు రాగానే మాట్లాడి వెళదాం. పాపం అత్త హడా విడి పడుతుంటుంది."
"బామ్మా! మీ చిన్నప్పుడు పెళ్ళిళ్ళు ఎలాచేసే వారు? ఇప్పుడైతే అన్నీ కళ్యాణమంటపాలు,అన్నీ ఉన్నాయికానీ .." బామ్మకు కోపం వచ్చిందని గమనించి మాటల్లోపెట్టను అడిగింది నందిని.  
" ఔను .ఇల్లుకట్టిచూడు పెళ్ళిచేసి చూడు అని రెండూ ఎంతకష్టమో ఒక్కమాటలో చెప్పారు పెద్దలు. అసలు వివాహం అంటే ఇంటిపెద్ద ముందుగా డబ్బుకూడగట్టుకోవాలి. బంధువులందరినీ ఇళ్ళకెళ్ళి వివాహపత్రికతో  భార్య భర్తా ఇద్దరూ కలిసి పిలిచి రావాలి .దీనికే నెలపాటూ పట్టేది. ఇళ్ళకు సున్నాలూ, పసుపులు కొట్టుకోటాలూ, వడి యాలూ, అప్పడాలూ పెట్టుకోడం,ఊరగాయలు పెట్టుకోడం , బంధు వు లందరికీ బట్టలు కొనడం,పెళ్ళివారి బట్టలూ, పట్టు బట్టలు, పెళ్ళి కి ముందే ఇంటి పెద్ద లకు నడుం విరిగేది. పల్లెల్లో ఊరు ఊరంతా వచ్చి సహాయం చేసే వారులే. పెళ్ళికూతుర్నిచేయడం ఒక్కోరోజూ ఒక్కోరు , ముందుగా తల్లీ తండ్రీ చేస్తే ఆతర్వాత మేనత్తలూ ,బాబాయిలూ ఒక్కో ఇంటికీ ఒక్కో ఆచారం.  గోరింటాకులు పెట్ట డాలూ ఎన్నో, ఇప్పుడేముందీ రెడీ మేడ్ వి తెచ్చి రాత్రికి రాత్రే పెట్టే సుకుంటున్నారాయె.పూర్వం పెళ్ళంటే మాటలా"
"నిజమే బామ్మా! కాలనుగుణంగా అన్నీ మారిపోతున్నాయ్ !డబ్బుం టే అన్నీ అమరిపోతున్నాయి. కొందరు రిజిస్టర్ మ్యారేజెస్ చేసేసి విందు లివ్వట్లా!తొందరైతే ఏం చేస్తారు మరి! బామ్మ అసలు పెళ్ళి అనేమాటకు పూర్తి అర్ధం, పెళ్ళితంతూ  చెప్పవూ!"
"తప్పక చెపుతానే . వివాహం అంటే సమాజంలో అబ్బాయికీ అమ్మా యికీ ఏర్పరచే  బాంధవ్యం. దీన్ని బంధువులు స్నేహితులందరికీ తెలియజేస్తూ  అందరి సమక్షంలో చేసేఒక కార్యక్రమం. ఈ పెళ్ళితో వారిద్దరూ హక్కులు,బాధ్యతలు కలసి పంచుకుంటూ సుఖజీవనం సాగించమని అంతా దీవెనలు అందిస్తారు.ఇది  ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం అనేమాటకు నిర్వచనం వివిధ సంస్కృతు లను బట్టీ మారవచ్చు. కానీ అర్ధమొక్కటే. పెళ్ళి అనే పదానికి పెండ్లి, వివాహం, పాణిగ్రహ ణం, కన్యాదానము, కళ్యాణము, సప్తపది , పరిణ యము,ఉద్వాహము, ఉపయమనము, ఉపయమము, ఊఢి, కరగ్రహ ణము, కరగ్రహము, కరపీడనము, కల్యాణము, కాలుత్రొక్కు, చెట్టపట్టు, జంబూలమాలిక, దారకర్మము, దారక్రియ, దారగ్ర హణము, పాణిపీడ నము, పాణిబం ధము, పాణిస్వీకృతి, పాణీకరణము, పాణౌకృతి, పెండిలి,  మనువు, వివాహము, సముద్వాహము, స్వీకారము.ఇంకా తమిళంలో తిరుమ ణమ్, కల్యాణమ్, కన్నడంలో మదువె, కల్యాణ, పాణిగ్రహణ అని అనేక నామాలు ఉన్నాయి. ఇదే ఆంగ్లలో మీరు మ్యారేజ్, వెడ్డింగ్ అంటారు.
వివాహాలు అష్టవిధాలు. - బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్య ము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము అని పురాణాల్లో ఉన్నాయి  .
హిందూ వివాహం అనేది ఒక పవిత్ర కార్యం. మనదేశంలో వేరు వేరు  సామాజిక వర్గాల వివాహ పద్ధతులు వేరుగా ఉంటాయి.పెళ్ళికి పెళ్ళి వారు రాగానే ,వస తి ఉన్నవారు పెళ్ళి కొడుకు ఇంట్లోగాని, లేకపోతే విడిదిలోగాని పురోహితులు వినాయక పూజతో మొదలుపెట్టి,స్నాతకం చేయిస్తారు. కాశీయాత్ర, బాజా భజంత్రీల మధ్య వరుడు గొడుగు పట్టు కొని చేత్తో కర్ర పుచ్చుకొని కాళ్ళకు పాదుకలువేసుకొని తాను సన్యాసం స్వీకరించేందుకు కాశీయాత్రకు పోతున్నట్లు  బయలుదేరగానే ,వధు వు అన్నదమ్ముడుచ్చి 'అయ్యా, బావగారూ! మీకాశీ ప్రయాణం మానం డి. మా అక్కనిచ్చి పెళ్ళి చేస్తాము, రండి. ‘అనివెనక్కు పిల్చుకొస్తాడు. ఇది తమాషాగా ఉంటుంది.
వరపూజ లో మామగారు పెట్టిన దుస్తులు ధరించి వధూవరులు ఎదు రెదురుగా నడుస్తూ ఎదురుకోలు జరుగుతుంది.ఇది చాలాహాస్యంగా స్నేహితుల మధ్య జరుగుతుంది.
కాశీయాత్ర మానేసి  వరుడు పెళ్ళి మండపానికి వస్తుంటే కన్యాదాత ఎదురెళ్ళి  పానకం బిందెలతో, కొత్త బట్టలతో స్వాగతం పలుకుతాడు. పానకం ఇస్తారు.  ఆతర్వాత పెళ్ళి మండపానికి వస్తారు.
పెళ్ళికుమార్తెచేత  గౌరీ పూజ చేయించి సుముహూర్తానికి పెళ్ళికూతు ర్ని మేనమామలు బుట్టలో కూర్చోబెట్టి మోసుకుని తీసుకెళ్తారు.
పెళ్ళికూతురి తల్లీ తండ్రి తమకుమార్తెను వరునికి అప్పగించడాన్నే కన్యాదానం అంటారు.  మంత్రాలతో కన్యను వరునికి అప్పగిస్తారు. నిర్ణయించుకున్న ముహూర్తసమయానికి వరుడు వధువు పరస్పరం తలపై జీలకర్ర బెల్లం పెట్టించడం ఇదే అసలు వివాహమైనట్లు.
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం!!అనే మంత్రం చదువుతూ మంగళ సూత్ర ధారణ జరుపుతారు.
తర్వాత పరస్పరం తలంబ్రాలు పోసుకుంటారు.
ఆతర్వాత ఒక బిందెలో పాలూ, నీళ్ళూ పోసి ఒక బంగారు ఉంగరం  వేసి ఇద్దరినీ తీయమంటారు . తర్వాత స్థాలీపాకం , నాగవల్లి ,సద స్యం, వధూవరులకు అరుంధతీ నక్షత్రం చూపడం,అంపకాలు -అంటే పెళ్ళికూతుర్ని అత్తారింటికి పంపడం, అక్కడికెళ్ళాక వారు సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. దీన్నే మర్లుపెళ్ళి అనేవారం. దాంతో బంధువులంతా వెళ్ళిపోతారు.ఇదమ్మా మొత్తంపెళ్ళితంతు. “ అంటూ ఊపిరి పీల్చుకుంటున్న బామ్మతో  
“ బామ్మా !అబ్బా పెళ్ళంతా చూసినట్లే ఉంది. ఇహ నేను పెళ్ళికి రాన క్కర్లేదేమోకదా ! అసలు బామ్మా  'మేరేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ ' అని హేమ పెళ్ళి అలాకుదిరి ఉంటుంది.అందుకే ముందుగా చెప్ప ను కుదిరి ఉండదు .ఏమంటావ్ బామ్మా!"
"మహా తెలివైన దానివే నందూ! నాకోపం చల్లార్చను ఎన్నిమాటలు చెప్పించావే !" అంటూ నందిని బుగ్గలు పుణికింది బామ్మ ప్రేమగా.

                                ***********

No comments:

Post a Comment

Pages