అద్దం - అచ్చంగా తెలుగు
  అద్దం
 -ప్రతాప వెంకట సుబ్బారాయుడు         

అద్దం అబద్ధం చెప్పదు
ఉన్నది ఉన్నట్టుగా
వాస్తవాన్ని కళ్లకు కడుతుంది
ఒక్క కుడిఎడమలను తారుమారు చేసి
చూపడం తప్ప..ఇంకే లోపమూ లేదు
అప్సరసల అందాలకి పొంగిపోదు
కురూపిలను ప్రతిబింబిస్తూ కుంగిపోదు
తనకెదురుగా ఉన్నవాళ్లని చూపిస్తుంది తప్ప
వాళ్లెళ్లాక ఇతరులతో ఎకసెక్కాలాడదు
అన్నీ స్పష్టమే..అంతా స్వచ్ఛమే
మనుషులకు
అద్దంలాంటి మనసులుంటే..దాపరికాలుండవు
కానీ అలా ఉంటే సమాజంలో మనగలగడం కష్టం
అన్న నిర్ణయానికి వచ్చేశాం
లేచిందగ్గర్నుంచీ మనసుకు పరదాలేసుకుని
సంచరిస్తాం..వ్యక్తి భజనలు చేస్తాం
అవసరానికి గోడ మీద పిల్లులమవుతాం
ఏ ఎండకాగొడుగుపడతాం
జీవం లేకపోయినా..మనకన్నా అద్దమే గొప్పది కదూ!
 ***

No comments:

Post a Comment

Pages