శ్రీ రామ కర్ణామృతం - 42 - అచ్చంగా తెలుగు

శ్రీ రామ కర్ణామృతం - 42

Share This
 శ్రీరామకర్ణామృతం -  సిద్ధకవి
  డా.బల్లూరి ఉమాదేవి
  
చతుర్థాశ్వాసము.

1.శ్లో: శ్రీ రామం జనకాత్మజా కుచతటీ శ్రీగంధ సంగోల్లస
       ద్వక్షోవీధి ముదార మాశ్రిత ముని ప్రా దుర్భవ త్కల్పకమ్
       బ్రహ్మేశాన ముఖామరస్తుత మజం బ్రహ్మాండ భాండాధిపం 
       వందే కోసల కన్యకాసుత మహం వారాశి గర్వాపహమ్.                                             

భావము: సీత యొక్క స్తన ప్రదేశమందలి గంధపు బురదచే ప్రకాశించుచున్న వక్షస్థలము కలిగినట్టియు దాతయైనట్టియు  నాశ్రితులైన మునులకు ప్రత్యక్షమైన కల్పవృక్షమైనట్టియు బ్రహ్మ శివుడు మొదలగు దేవతలచే స్తోత్రము చేయబడినట్టియు బుట్టువు లేనట్టి యు బ్రహ్మాండము లో కధిపతియైనట్టియు కౌసల్యకు కుమారుడైనట్టియు సముద్రగర్భంలో మును హరించినట్టియు రాముని నమస్కరించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
శా :శ్రీసీతాకుచ కుంభ చేర్చితే లసచ్ఛ్రీ చందనాల లంకృతన్
కౌసల్యాత్మజు మౌని కల్పకము శ్రీకంఠాబ్జ భూముఖ్య గో
దాస స్తోత్రు సముద్ర గర్వహననున్ బ్రహ్మాండ భాండాధిపున్
రాసూనున్ సువితీర్ణు జన్మరహితున్ రామప్రభున్ గొల్చెదన్.

2శ్లో:సాకేతే మణినిర్మితే ప్రవిలసత్సౌధాయుతానాం శతే
    అంతర్గేహమతీత భాను నిలయే చంచత్పతాకోజ్జ్వలే
     హర్మ్యే భర్మమయే ఘనాఘనరవైర్ఘంటాశతైరావృతే
    డోలాకల్పవిహారిణం రఘుపతిం సీతా సమేతం భజే.

భావము: అయోధ్య యందు రత్నములచేత నిర్మింపబడి ప్రకాశించుచున్న మేడల యందు గృహమధ్యమందు ప్రకాశించుచున్న జండా చేత ప్రకాశించుచున్నది కనుక సూర్యకిరణం ప్రసారం లేనట్టి యు బంగారు వికారములై గణగణ ధ్వనిచేయుచున్న బహు గంటలచే ఆవరింపబడి నట్టియుమేడలయందుయ్యెల శయ్యయందు  విహరించుచున్నట్టి సీతతో కూడిన రాముని సేవించుచున్నాను
తెలుగు అనువాదపద్యము:
మ.  తత ప్రత్యగ్ర మణీ శతాయుతలసత్సౌధ ప్రతానోప శో
       భిత సాకేతమునన్ పతాక యుతమై పెంపొందు నంతర్గృహ
        స్థిత చామీకర ఘంటికా రవయుత శ్రీ డోలికా శయ్యపై
        క్షితిపుత్రీయుత కేళి జెన్నలరు నా శ్రీరాము సేవించెదన్.

3.శ్లో:సాకేతే సౌధ బద్ధ ధ్వజ శతమహితే రాజమార్గే విశాలే
     ఘంటారావైరు పేతే కనక కుథయతే గంధనాగే వసంతమ్ 
      దివ్యాకల్పోజ్జ్వలాంగం రథగజ తురగైరావృతం సుప్రసన్నం
రామం శ్వేతాతపత్రావృతముఖ కమలం చింతయామ్యంతరంగే.

భావము: అయోధ్య యందు మేడల యందు కట్టబడిన పెక్కుజండాలచే ప్రకాశించుచున్న విశాలమైన రాజ మార్గమందు గంటల ధ్వనులతో కూడినట్టి బంగారపు టాస్తరణముతో కూడిన మదపుటేనుగు నందు  ఉన్నట్టియు ప్రశస్తములైన అలంకారము ప్రకాశించుచున్న దేహము కలిగినట్టియు రథములచేత ఏనుగుల చేత గుర్రములచేత నావరించబడినట్టియు మిక్కిలి నిర్మలుడైనట్టియు తెల్లగొడుగుచే నావరింపబడిన మొగము గలిగినట్టియు రాముని చిత్తమందు తలచుచున్నాను
తెలుగు అనువాదపద్యము:
మ.సరసంబై శతకోటి కేథనల సత్సౌధాళి సాకేత సే
     త్పురి ఘంటాపథమార్గమందున మణీభూ‌షాంచితుండై యలం
కరణేభేంద్రము నెక్కి నైజచతురంగంబుల్ ప్రవేష్టింప వి
స్ఫురితచ్ఛత్ర సముజ్జ్వలుండయిన రాముం గొల్తు నాత్మస్థితున్.

4.శ్లో: సాకేతే మణికోటిభిస్సుఖచితే దివ్యాంబరాలంకృతే
        హేమస్తంభ సహస్ర కోటి ఘటితే తారాపథాత్యున్నతే
        రమ్యస్వర్ణమయే విచిత్ర భవనే దివ్యంతరిక్షే ముందా
        రామం స్మేరముఖాంబుజం రఘుపతిం సీతా సమేతం భజే.

భావము: అయోధ్య యందు బహు రత్నములచే స్థాపింపబడినట్టి ప్రశస్తమైన బట్టల చేత అలంకరింపబడిన ట్టి అనేకములైన బంగారు స్తంభములచే కూర్చబడినట్టి నక్షత్ర మార్గము కంటే పొడవైనట్టి సుందరమైన బంగారు వికారమైన చిత్రమైన గృహమందు భూమి యందు అంతరిక్ష మందు సంతోషముతో కూడినట్టి నవ్వుతున్న ముఖపద్మము కలిగినట్టే సీత తో కూడిన రాముని సేవించుచున్నాను
తెలుగు అనువాదపద్యము:
మీ. ప్రకటా యోధ్యను నూత్న రత్నమయమైరమ్యంబునై తారకా
నికరాత్యున్నతమై సువర్ణ మణి సందీప్తాయుత స్తంభవ
త్సుకరంబై విమలాంబరోజ్జవలితమౌ చోద్యాలయావాసుడై సకళత్రుండు దరస్మితాస్యుడగు నా క్ష్మా జేశు సేవించెదన్.

5.శ్లో:సాకేతే మణితోరణాంచిత లసద్వీథీశత ప్రాంగణే
        సానందం భరతాదిభిః సహచరై రత్యంత మోదాకరైః
         క్రీడంతం మణికందుకైః కరగతైరన్యోన్య మత్యుజ్జ్వలైః
         పౌరస్త్రీ నయనోత్సవైః ప్రతిదినం పూజ్యం భజే రాఘవం.

భావము: అయోధ్య యందు మణి కచితములైన బహిర్ద్వా రముల చేత నొప్పుచున్న ప్రకాశించుచున్న బహు వీధులు గల ముంగిటి యందు నత్యంత సంతోషమునకు స్థాన భూతులైన భరతుడు మొదలగు స్నేహితులతో కూడా ఒకదానిచేనొకటి ప్రకాశించుచున్న రత్నపు బంతులచే నాడుచున్నట్టి పట్టణ మందలి స్త్రీల నేత్రములతో కూడినట్టి పూజించినట్టి రాముని ప్రతి దినమందును సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
మ. తత సాకేత పురంబు నందు మణి సంతాన స్ఫురత్తో  రణాంచిత వీథీశతచత్వరంబున మనీ శ్రేష్ఠోజ్జ్వలత్కందుక
స్థిత హస్తుండై సోదరాది యుతుడై స్త్రీలోల నేత్రోత్పలా 
ర్చితుడై నిత్యము క్రీడలన్ మెలగు నా శ్రీరామ్ సేవించెదన్

6శ్లో:సాకేతే కనకాద్రి శృంగార ఘటితే కల్పద్రుమైరావృతే
    వైఢూర్యాది మణీంద్ర కాంతి ఘటితే దేవేంద్ర నీలోజ్జ్వలే
     కుర్వంతం మణినాయకౌణి గృహే మాణిక్య నీకే భజే
     పుత్రౌ మన్మథ సుందరౌ కుశలవౌ సంసేవ్య పాదా విమౌ

భావము: అయోధ్య యందు మేరు శిఖరముచే కూర్చబడిన ట్టియు కల్పవృక్షముల చేత ఆవరించబడినట్టి యు వైడూర్యములు మొదలగు మణి శ్రేష్టములచే గూర్చబడినట్టియు నింద్రనీలములచే ప్రకాశించుచున్నట్టి యు రత్న గృహమునందు మణివికారమైన సింహాసనము నందు మన్మథుని వలె సుందరులై ఇతరులకు సేవించదగిన పాదములు కలిగినట్టి కుమారులైన కుశలవులను రత్న ఖచితములై న పదకములు గలవారిని గా చేయుచున్న రాముని సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
మ. ప్రకటా యోధ్యను మేరు శృంగ నిభమై భవ్యమరా నోకహ 
ప్రకర ప్రావృతమై మణి స్థగిత మై రంజిల్లు పద్మంబునం దకలంకంబగు రత్న పీఠి సుమ శస్త్ర కారు లైనట్టి పు
త్రక యుగ్మార్చిత పాద పద్ముడగు శ్రీరామాధిపుం గొల్చెదన్.

7శ్లో:సాకేతే జననీ కరార్చితలసత్ కస్తూరికా సుందరే
      ఫాలే మౌక్తిక జాలకం శశినిభం స్వర్ణాంకితం వృత్తులు
      చూడాలంబ మనోజ్ఞ హారకలితం బిభ్రాణ మత్యుజ్జ్వలం
        రామం కోసల పుత్రికా వరసుతం సీతా సమేతం భజే.

భావము: అయోధ్య యందు తల్లి చేతిలో నుంచబడిన కస్తూరి బొట్టుచే సుందరమైన నుదుటి యందు చంద్రునితో సమానమైనట్టి బంగారు చే నలంకరింపబడినలంకరింపబడినలంకరింపబడినలంకరింపబడినట్టి గుండ్రనైనట్టి శిఖయందు వ్రేలుచున్న మనోహరమైన హారముచే ప్రకాశించుచున్నట్టి కౌసల్యాదేవి వర కుమారుడైనట్టి  సీతతో కూడిన రాముని సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
మ.
. నుదుటన్ కస్తూరి బొట్టు తల్లి యునుసన్ముక్తా లలామంబు ప
ర్వ ది నేందూ జ్వల మై సువర్ణమయ మై రంజిల్ల సాకేత స
త్సదనుడై రమణీయ హార ధృతుడై స్వామి.స్వస్థానుడై భక్తిలో 
కదయాళుండగు కౌసలేయు గొలుతున్ లక్ష్మీపురం రామప్రభున్.

8శ్లో:సాకేతే సరయూజలే తి విమలే ప్రోత్ఫుల్ల పద్మాంకితే
     దివ్యస్త్రీ శతకోటి నృత్య రుచిరే స్వర్గాపగా సుందరే
     పశ్యంతీషు సురాంగనాసు శపథం క్రీడంత ముర్వీసుతాం
    బాహుభ్యాం విమలోదకేన రుచిరం సీతా సమేతం భజే.

భావము: అయోధ్యయందు మిక్కిలి నిర్మలమైనట్టి  వికసించిన పద్మ ములచే అలంకరింపబడినట్టి బహు దేవతా స్త్రీల యొక్క నాట్యము చేత సుందరమైనట్టి గంగవలె సుందరమైనట్టి సరయూ నది యొక్క నీటి యందు దేవతాస్త్రీలు చూచుచుండగా పంతము వేసికొని చేతులతో నిర్మలోదకము చే సీతతో క్రీడించుచున్నట్టి రాముని సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
మ. అమలంబై వికచాబ్జమై దివిజ కన్యా లీలార్హమై
యమర ద్వీప వతీ సమాన సరయూహాద్రిన్ సుర స్త్రీ సమూ
హములుం గాంచ సభార్యుడై కరములందంభో విహారంబు చి
త్తము రంజిల్లగ చేయు రాఘవు నయోధ్యా నాథు సేవించెదన్.

9.శ్లో:కదా సురతరుస్థలే కనక మంటపే పుష్పకే
వరాసన ముపేయుషం  వసుదళా రవిందోజ్వలే         
కరేణ హృదయ స్పృశా కలిత ముద్ర చిన్ముద్రికా
 మమ స్ఫురతు వాసనా మనసి బద్ధ వీరాసనా.

భావము: కల్పవృక్ష ప్రదేశమందు బంగారు మంటపము గల అష్టదళ పద్మముచే శోభించ పుష్పక మందు శ్రేష్టమైన పీఠమును పొందినట్టియు గుండెకు తగులుచున్న హస్తము చేత ధరింప బడిన జ్ఞానముద్ర కలిగినట్టియు కట్టబడిన వీరాసనము కలిగినట్టియు రామరూఈపసంస్కారం నాకెప్పుడు స్ఫురించును.
తెలుగు అనువాదపద్యము:
మ: ఒక కాలంబున కల్పశాఖి కడ చెన్నొ ప్పారు సౌవర్ణ ర
త్నకసన్మందిర మధ్య హేమ దళ పద్మ భ్రాజితంబైన పు
ష్పక మధ్యంబున రత్న పీఠ నిజ వక్షన్యస్త హస్తుండు తా రక చిన్ముద్ర కరాంబుజండు విబుధారాధ్యుండు వీరాసనుం

డకలంకుండగు రామచంద్రుడు మదీయాత్మ స్థలన్  భాసిలున్.
10.శ్లో: నదీరమణ బంధనం మతి మతా ముదారం ధనం                            
జగద్వి హతరంధనం సకల కామ నిష్యందనమ్
విలిప్త  హరిచందనం వినుత యాత సంక్రందనం 
భజామి రఘునందనం పవన నందన స్యందనమ్.

భావము: సముద్రుని బంధించినట్టియు  యోగ్యులకు గొప్పధనమైనట్టియు జగత్తుల యొక్క కొట్టబడిన తాపము కలిగినట్టియు ఎల్ల కోరికలను ప్రవహించునట్టియు పూసి కొనబడిన గంధము కలిగినట్టియు స్తోత్రము చేయుచున్న
ఇంద్రుడు కలిగినట్టి యు ఆంజనేయుడు వాహనముగా కలిగినట్టి రాముని సేవించుచున్నాను.

తెలుగు అనువాదపద్యము:
ఉ. చందనచర్చితుండు రఘుసత్తము డంబుధి బంధనుడు సం
క్రందన వందితుండు శ్రిత రాజియుదార ధనుండు సంతతా నందుండు గంధవాహ ప్రియనందన వాహనుడిష్టదాయి పౌ
రందర నీలవర్ణుడగు రాము పదాబ్జంము లా శ్రయించెదన్.
***

No comments:

Post a Comment

Pages