ఈ దారి మనసైనది -7 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది -7
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com

angulurianjanidevi.com
(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పుడు కలిసి చదువుకుంటారు. మన్విత నానమ్మ వైఖరి చాలా కటువుగా ఉంటుంది. ఇక చదవండి. )
"ఎదిగిన పిల్ల ఇంటికి రాకుంటే ఏమిపట్టనట్టుకూర్చుంటారేంమీ కూతుళ్లను కూడా అప్పట్లో ఇలాగే వదిలేశారా?" అంటూ నానమ్మను కేకలేస్తుంది.
నానమ్మను చూస్తుంటే ఎద్దు పుండు గుర్తోస్తూ - తల్లి మాటలు కాకి ముక్కులా అన్పిస్తాయి ఎంత బిజీగా వున్నా మాటల్లో పొడిచే పని తం కరక్ట్ గా  చేస్తుంది.
"మమ్మీ ! ఈ అమ్మాయి నా క్లాస్మేట్ పేరు మన్వితఅని వెంటనే మన్విత వైపు చూస్తూ.
'మన్వితా !మా మమ్మీ. వాగ్దేవి కాలేజీలో బోటనీ లెక్చరర్"అన్నాడు అనురాగ్.
క్రీం కలర్ గద్వాల్ చీరలో మల్లెపూవు సున్నితత్వంపారిజాత సౌరభం కలగలిపినట్లున్న ఆమెను చూడగానే....
నమస్తే! ఆంటీ ! " అంది మన్విత ఆమె ముఖంలోకి అలాగే చూస్తూ .... మన్వితను చిరునవ్వుతో చూస్తూ.
మోచేతికిగడ్డానికి వున్న దెబ్బల్ని చూడగానే ఆమె నవ్వు మాయమై ...
"అయ్యో! ఈ దెబ్బలేంటిఏం జరిగింది? " అంటూమన్వితచేతిని తన చేతిలోకి తీసుకొంది.
అప్పటికప్పుడే ఆ గాయాన్నిక్లీన్ చేసి ప్లాస్టర్ వేసింది ప్రియభాందవి.
అనురాగ్మన్వితప్రెషప్ అయ్యాక...
వాళ్లిద్దరూ తినటానికి వేడివేడిగా ఉప్మా పెసరట్టుపెట్టిపాలు ఇచ్చింది.
ప్రియభాందవి ఆప్యాయతకి మన్విత కరిగిపోతూ మాటలు కరువైన మూగశ్రోతలా ఆ ఇంటి వాతావరణాన్ని మనసులో రికార్డ్ చేసుకుంటోంది. పాలు తాగాక....
"రా !మన్వితా ! నా గది చూద్దువుగానిఅన్నాడుఅనురాగ్రీసెంట్ గా తండ్రి తనకి కొనిచ్చిన వీడియోగేమ్ చూపించాలన్న ఉ ద్దేశంతో....
"నేను వెళ్ళాలిఅని నోటి వరకు వచ్చినా అనురాగ్ గది చూసి వెళ్ళాలన్న కుతూహలంతోప్రియభాందవి కూడా చూడమనటంతో అతనిగదిలోకి వెళ్ళింది.
 ఆ గది సింపుల్ గా,ప్రశాంతంగా ఉంది.
చదువుకునే పుస్తకాలతో పాటువీడియోగేమ్స్బెడ్ కి దగ్గర్లోరెండు టెడ్డీబేర్ బొమ్మలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
సెల్ఫ్ లో  రకరకాల పెన్నులుపెన్సిళ్లుకంపాస్ బాక్సులుస్నాక్స్ బాక్స్లుస్కూల్ బ్యాగ్లుస్కూల్ డ్రస్లువాటి పక్కన బెల్ట్స్,బాడ్డీలు ఉన్నాయి.
మన్వితకళ్నపెద్దవి చేసి ఆ రూంలో ప్రతి వస్తువును కుతూహలంగా చూసింది.
ఎందుకో తెలియదుకానిఅనురాగ్నిఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లు ఇన్ని రోజులు అనురాగ్ అనే అబ్బాయి తనకి తెలియనట్లు . తెలిశాక ఇదో అద్భుత ప్రపంచం అన్నట్లు . ఈ ప్రపంచాన్ని ఇన్ని రోజులు మిస్ అయినట్లు ఫీలయింది. ఆ ఫీలింగ్ లో .....
రంగురంగులఇంద్రధనస్సును దగ్గరగా వెళ్లిచూసినట్లు ఆమె కళ్లు మెరుస్తున్నాయి. ఇంకా బాల్యం తాలుకు తియ్యదనాన్ని వదిలి పెట్టలేని స్థితి ఆమెది. ఇప్పడిప్పడే వస్తున్న యవ్వనం ఆమె శరీరంలో కన్పిస్తున్నా.... మనసు మాత్రం యింకా బాల్యాన్ని వీడలేదు. అందుకే ప్రతిది అందంగాఆహ్లాదంగా అన్పిస్తోంది. ఒక్క తన ఇల్లు తప్ప
“ బై అనురాగ్ ! వెళ్లాస్తా ఆంటీ !అంది మన్విత.
"అప్పడప్పడువస్తుండుమన్వితా!” అంది ప్రియధాందవి.
అప్పడప్పడు కాదు. ఎప్పడురావాలనిపించేలావుందా ఇల్లు. వాళ్ల అభిమానం.
కారులోంచి దిగుతున్న కూతుర్ని చూసి ముఖం చిట్టించిచూసింది కృష్ణవేణి.
మన్వితను దింపి కారెల్లి పోయింది.
మన్విత లోపలికి రాకముందే...
“ఎవరిదే ఆ కారు?” అంది కృష్ణవేణిఆ గొంతులో ఏ మాత్రం మృదుత్వం లేదు. ఒక డబ్బాలో రాళ్ళేసి కొట్టినట్టే వుంది.
అంత వరకు వున్న ప్రసన్నత మాయమైస్వర్గంలోంచి నరకంలోకి వచ్చినట్లనిపించిందిమన్వితకి.
“నా ఫ్రెండ్ అనురాగ్ ది”. అంది మన్విత.
ఫ్రెండ్ అన్నపదం కృష్ణవేణి మనసుని అంకుశమై పొడిచినట్లు....
మన్విత చెంప చెళ్ళుమంది.
"కార్లుండేఫ్రెండెందుకే నీకుశక్తికి తగ్గ మాటలుస్థాయికి తగ్గ స్నేహాలేనానీవిఒళ్లు చీరేస్తాను యింకెప్పుడెనా కార్లో వస్తేఅంది.
గడ్డం దగ్గర నొప్పనిపిస్తే తల్లి ముఖంలోకి చూస్తూనే చేత్తో మెల్లగా తడుముకుంది.
ఈ ప్లాస్టరేంటని గానిఈ దెబ్బ లేంటనిగాని అడగని తల్లిలో ఇంతకన్నా ఎక్కువగా ఆశించినా ఫలితం వుండదని . ఏడ్చినా వేస్ట్ అనితల విదిలించి బ్యాగ్ ని విసురుగా బెడ్ పైకి విసిరేసిరెండు చేతుల్ని గడ్డం క్రింది పెట్టుకొని సైలెంట్గా కూర్చుంది.
మాట్లాడవేం?" అంటూ గద్దిస్తున్న తల్లి వైపు నెమ్మదిగా చూస్తు.
ఏం మాట్లాడాలినీ మాటల్లో ఏముందని మాట్లాడాలినేను అనురాగ్తో వాళ్ల ఇంటికి వెళ్లినప్పడు వాళ్ల మమ్మీ నీలాగ మాట్లాడలేదు. టిఫిన్ పెట్టిపాలు ఇచ్చింది. దెబ్బ తగిలిందని చూసి ప్లాస్టర్ వేసింది. మరి నువ్వుఅలాంటిదేంచెయ్యలేదు. అవమానించి నట్లు మాట్లాడుతున్నావు.అంది మన్విత .
వాళ్లిద్దరి మాటల్లో తల దూర్చితే తనకే గతి పడుందో ముందే తెలిసిన దానిలా ఒక్క పక్కకి వుంది వర్ధనమ్మ
ఆ ముసల్లి కూడా నీలాగే ఇంట్లో వాళ్లని ఈసడించిబయట వాళ్లని ఆకాశానికి ఎత్తేస్తుంది . ఎక్కడికి పోతాయి బుద్దులు.అంటూ అక్కడ నుండి వెళ్లి పోయింది.
... తండ్రిని చూడగానే ప్రాణం లేచివచ్చినట్లైందిమన్వితకి అయన దగ్గరకి వెళ్లి కూర్చుంది.
ఉదయం స్కూల్లో తను పడిపోయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏం జరిగిందో తండ్రితో చెప్పింది. అనురాగ్ వాళ్ల మమ్మీ బాటనీ లెక్చరర్ అని కూడా చెప్పింది.
...మౌనంగా వినికూతురివైపు జాలిగా చూశాడు విశ్వనాధ్
కొద్ది రోజులు గడిచాక....
"ప్రియా ఆంటీ చాలా మంచిది నాన్నా! అప్పడప్పడు నన్ను రమ్మని చెప్పింది.వెళ్తే మమ్మీ తిడుతుందని భయం. వాళ్లింటికెళ్లి అనురాగ్తో కలిసి చదువుకుంటాను నాన్నా ! మమ్మీనితిట్టోద్దని చెప్పండి! ప్లీజ్ ! " అంది మన్విత,
మన్వితను అర్థం చేసుకున్నాడు విశ్వనాధ్.
తనెప్పడోప్రాద్దునస్కూల్ కి వెళ్తేరాత్రికి వస్తాడు. పిల్లలు ఎదుగుతున్న కొద్ది ప్రపంచం తెలియాలి. జ్ఞానం విస్తరించాలి. అప్ప డప్పడుప్రియభాందవి మేడమ్ లాంటి వాళ్ల నీడ సోకితే తన బిడ్డ బాగుపడుందన్న నమ్మకం కలిగి .....
సరేనమ్మా !విూ మమ్మీతో నిన్నేమి అనొద్దని చెబుతాను. నువ్వు మాత్రం వాళ్లింటికి వెళ్లి త్వరగా వచ్చెయ్యాలి. ఆడపిల్లవు కదా! ఎవరిళ్లలోనైనా ఎక్కువసేపు వుండకూడదు."అన్నాడువిశ్వనాద్,
ప్రతి దానికి ఆడ పిల్లవు కదా! అంటారెందుకుఆడపిల్లలు అబ్బాయిలతో ఆడకూడదు. ఎవరిళ్లలోనైనా ఎక్కువసేపు వుండ కూడదు. మరిలాచేసేవాళ్లంతాచెడిపోయినటైతే. చెడిపోని వాళ్లు ఎంత మంది ఆడపిల్లతిరిగినా చెడిపోదు. తిరక్కపోయినా చెడిపోదు అని వీళ్లకి ఎవరు చెబుతారు?
ఆ రోజు నుండి మన్వితఅప్పడప్పడు అనురాగ్ వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడ కొద్దిసేపుకంబైన్డ్ స్టడీ చేసి ఇంటికి వస్తుంది.
తండ్రి చెప్పినప్పటినుండి తల్లి ఏవిూ అనటం లేదు కాని తను అనురాగ్ వాళ్లయింటికి వెళ్లటం తల్లికి ఏమాత్రం ఇష్టం లేదని మన్వితకు తెలుసు.
ప్రియబాంధవి అనురాగ్తో పాటు మన్వితను కూడా కూర్చోబెట్టి చదివిస్తుంది.
చదివించేముందు....
ఎలా చదవాలోఎప్పడుచదవాలోఎందుకు చదవాలోచెప్తుంది.ముఖ్యంగా చదువంటే కష్టం కాదని,ఇష్టమని చెప్తుంది.
క్లాసు పుస్తకాలు చదవటం అయ్యాక....
ఎంతో ఉత్సాహంగా ....
చందమామ కధలు గురించి ... మర్యాదరామన్న నీతులు గురించి... అయోధ్యరామయ్య కష్టాల గురించి .. తెనాలి రామలింగడి కథలు ... అబ్దుల్ కలాం జీవితం... ఇలా తనకి తెలిసిన వాటి గురించి వాళ్లతో చెప్పి అప్పటినుండే వాళ్లలో ఉన్నత ఆశయాలను నూరి పోసింది.
వాళ్ళిద్దరూ పోటీలు పడి చదువుతుంటే ప్రియభాంధవికి సంతోషంగా వుంటుంది.
హోంవర్క్ లాగే పుస్తకాలు చదవటానికి కూడా కొంత టైం ను కేటాయించివాళ్ళు మంచి మార్కులు తెచ్చుకున్నప్పడు మంచి పుస్తకాలను బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించి,చదువుపట్ల వాళ్లకి ఆసక్తినిపెంచింది.
వాళ్లిద్దరు పోటీలు పడి చదువుతుంటే ప్రియభాందవికి సంతోషంగా వుంటుంది.
టెన్స్ క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకున్నారు.
ఇంటర్ చదవటానికి ఇద్దర్ని ఒకే కాలేజిలో చేర్పించారు.
(సశేషం)

No comments:

Post a Comment

Pages