బూడిద గుమ్మడి ఉపయోగాలు - అచ్చంగా తెలుగు
బూడిద గుమ్మడి ఉపయోగాలు
  అంబడిపూడి శ్యామసుందర రావు 

బూడిద గుమ్మడి కుకుర్బిటేసి కుటుంబానికి చెందినది,దీని శాస్త్రీయ నామము "బెనిన్ కాసా హిస్పీడ " ఆయుర్వేదములో ఔషధీయ గుణాలు కలిగిన మొక్కగా గుర్తించబడింది. దీనీని వాక్స్ గార్డ్, వింటర్ మిలన్, గ్రీన్ పంప్కిన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. బూడిద గుమ్మడి, అనగా గుమ్మడిలో ఒక రకం. ఇది ఎక్కువగా కొత్త ఇళ్లకు ముందు ఉట్టిలో వేలాడ గట్టతారు. పాత ఇళ్లకు కూడ దిష్టి తగలకుండా ఇంటి ముందు వేలాడ గడతారు. బూడిద గుమ్మడి ని వడియాలు పెట్టడానికి, కొన్ని రకాల తీపి పదార్తాలు చేయ డానికి వాడతారు.  కాయే కాకుండా దీని విత్తనాలు విత్తనాలనుండి తీసిన నూనె కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది భారతదేశము అంతటా ఈ కాయ పండుతుంది దీనిలోని పోషకాల విషయానికి వస్తే 100గ్రాములు 12k. cal  శక్తిని ఇస్తుంది. క్రొవ్వు పదార్ధాలు 0.2g ,సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు,కొలెస్ట్రాల్ అస్సలు ఉండవు. సోడియమ్ 111mg ,పొటాషియమ్ 6mg ,పిండిపదార్ధాలు 3g ,పీచు 2.9g ,మెగ్నీషియం 10mg ,క్యాల్షియం 19mg ,ఇనుము 0. 4 mg మరియు విటమిన్ ఎ,సి,డి ఉంటాయి.       ప్రస్తుతము ఆ బూడిద గుమ్మడి ముఖ్యమైన ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. 
1. యాసిడ్ రిఫ్లక్స్ ను నయముచేయటంలో బాగా ఉపయోగిస్తుంది. దీనిలోని టెర్పినిస్,ఫ్లవనాయిడ్ సి ,గ్లైకోసైడ్స్,మరియు స్టిరాల్స్ లో గల యాంటీ ఆక్సిడెంట్స్ గ్యాశ్రీక్ మ్యూకోజల్ డేమేజ్ ను అరికడతాయి. 
2. దీనికి గల మూత్ర స్రావక సంబంధమైన లక్షణాల వల్ల మరియు దీనికి గల క్షార స్వభావము వల్ల బ్లాడర్ ప్యూరీఫైయర్ గా ఉపయోగపడుతుంది. 
3. ఇది లైంగిక శక్తిని పెంచే ఆఫ్రోడిసియక్ అనే ధర్మాన్ని కలిగి ఉంటుంది మరియు ఎపెటైజర్ (ఆకలిని పెంచేది) గా పని చేస్తుంది. .      
4. రక్తస్రావానికి సంబంధించిన వ్యాధులను నయముచేయటానికి వాడే మందుల తయారీలో ఇది ముఖ్యమైన దినుసు.మధుమేహ రోగులకు మంచిది 
5 నాడి  కణాలను స్థిరీకరించటం ద్వారా మానసిక రుగ్మతలను ఎదుర్కోవటములో ప్రధాన పాత్ర వహిస్తుంది 
6.దీనికి గల యాంటీ హిస్టమైన్ చర్యల వల్ల రోగులపై బ్రాంకో డైలేటర్ ప్రభావాన్ని చూపుతుంది. 
7.ఇది యాంటీ డయోరియల్ ఏజెంట్ గా పనిచేసి మలబద్దకాన్ని నివారిస్తుంది. 
8. బూడిద  గుమ్మడి గుజ్జు లో విటమిన్ బి మరియు సి అధికముగా ఉండటం వలన బద్దెపురుగుల (టేప్ వార్మ్) ల నుండి ఉపశమనాన్ని  కలిగిస్తుంది. 
9. మార్ఫిన్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి మానే టప్పుడు కలిగే విత్ డ్రాయల్ లక్షణాలనుండి రిలీఫ్ కలుగజేస్తుంది. 
10. కాలిన  గాయాలపైన బూడిద గుమ్మడి గుజ్జును అప్ప్లై చేస్తే గాయాలు త్వరగా తగ్గుతాయి. 
11. కుశ్మండ ఆవీలెహ్,కుశ్మండ ఖండ,కుశ్మండ రసాయనము వంటి  ముఖ్యమైన ఆయుర్వేద మందులను ఈ బూడిద గుమ్మడికాయలనుండి తయారు చేస్తారు 
12. ఉత్తరభారతములో దీనినుండి "పేటా" అని తీపి పదార్ధాన్ని తయారుచేస్తారు దక్షిణాదిన బూడిద గుమ్మడి కాయతో అనేక రకాల వంటకాలు చేస్తారు. ఈ కాయ దృష్టి దోషాలను నివారించటానికి కొత్త ఇల్లు కట్టు కున్నప్పుడు తప్పనిసరిగా ఇంటి ముందు వ్రేలాడే దీస్తారు. ఈ కాయను మన దేశములోనే కాకుండా సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. 
***

No comments:

Post a Comment

Pages