కిసుక్కున నవ్వండి! - అచ్చంగా తెలుగు
కిసుక్కున నవ్వండి!
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు
(పాత్రలు మనవే( కావచ్చు), అందుకే పేర్లు పెట్టలేదోచ్)


"మీ ఇంట్లోని మగాళ్లందరూ అలా ఆడాళ్ల డ్రస్ వేసుకుని అలా వింతగా ప్రవర్తిస్తున్నారేంటి "
"వాళ్లు గబర్దస్త్ ప్రోగ్రాం కి కనెక్ట్ అయి, అడిక్టయిపోయారు పిన్నీ"
*****
"నీకు హఠాత్తుగా మంచి ఇంక్రిమెంట్ రావడానికి కారణం"
"ఇంతకాలం ఆఫీసులో గొడ్డులా పనిచేసినందుకు రికగ్నయిజేషన్ రాలేదు కాని మొన్న జరిగిన మన ఆఫీస్ స్టాఫ్ ఫ్యామిలీస్ గెట్ టు గెదర్ లో నాలుగు జోక్స్ చెప్పి బాస్ వైఫ్ ని నవ్వించాను. అంతే"
*****
నిర్మాతతో, ఓ సినీజీవి-
"నీది లో బడ్జెట్ అయితే మంచి కథతో, మంచి తారాగణంతో, మంచి సినిమా తీసే దర్శకపిచ్చోన్ని పరిచయం చేస్తా, అదే హై బడ్జెట్ అయితే కథక్కర్లా, పెద్ద స్టార్లుండి, పెద్ద డైరెట్టరుంటే సాలు, టీ వీల, పేపరోళ్ల అడ్వర్టైజ్మెంట్ల అడావిడితో ఓపెనింగ్స్ అదిరిపోతాయి, తర్వాత జనాలు బూతులు తిట్టుకుంటారు. నీకేటి కావాలేటి?
*****
"నీ అందానికి ఫిదా అయిపోయి పెళ్లి చేసుకున్నా అని చెప్పడం పొరబాటైంది. ఆ అందాన్ని కాపాడ్డానికి నా జీతం మొత్తం బ్యూటి పార్లర్లకీ, ఫేస్ క్రీములకీ కర్చయిపోతోంది"
*****
"ఇచిత్రం ఏటంటే, మగాడు రాత్రింబగళ్లు కష్టపడి ఇజయం సాదిస్తే, దానెనకాతల ఆడదుందనడం"
*****

1 comment:

Pages