అన్నమయ్య సూక్తి చంద్రిక(91-115) - అచ్చంగా తెలుగు

అన్నమయ్య సూక్తి చంద్రిక(91-115)

Share This
అన్నమయ్య సూక్తి చంద్రిక(91-115)
 (అన్నమయ్య  కీర్తనలలోని  సూక్తులకు    ఆంగ్ల లిప్యంతరీకరణము, ఆంగ్లానువాదము, వివరణములు )
  -డా. తాడేపల్లి పతంజలి

91
దొడ్డవాడేమి సేసినా దోస మందు నేది(04-89)
English transliteration
Doḍḍavāḍēmi sēsinā dōsa mandu nēdi(04-89)
వివరణం
గొప్పవాడు ఏమి చేసినా తప్పు లేదు. 
ఆంగ్లానువాదము
There are no mistakes in great persons  deeds
92
పాయమెుకటి చాపలములు మానదు(04-95)
English transliteration
Pāyameukaṭi cāpalamulu mānadu(04-95)
వివరణం
ఈ వయస్సు ఎప్పుడూ తన చాంచల్య గుణాన్ని విడిచిపెట్టదు. 
ఆంగ్లానువాదము
Always this age does not abandon its chaotic character.(Fickleness)
93
ఆసవొకటి యెంతయినాదనియదు(04-95)
English transliteration
Āsavokaṭi yentayinādaniyadu(04-95)
వివరణం
ఆశకు తృప్తి లేదు 
ఆంగ్లానువాదము
Always the hope is not satisfied.
94
యీసొకటి శాంతమెరగని దిదె(04-95)
English transliteration
Yīsokaṭi śāntameragani dide(04-95)
వివరణం
ఈర్ష్య ( ఓర్వలేనితనము) అను నా దుర్గుణానికి శాంతము తెలియదు. 
ఆంగ్లానువాదము
My  Jealousy  is not known the tranquility.
95
వాసి యెుకటి తనవంతులు మానదు(04-95)
English transliteration
Vāsi yeukaṭi tanavantulu mānadu(04-95)
వివరణం
ఓ వేంకటేశ్వర !    పేరు తెచ్చుకోవాలి అను కోరిక  ఇతరులతో  పోలికలు పెట్టుకోవటం  మానదు.
ఆంగ్లానువాదము
The desire to get a name does not leave the resemblance of others.
96
ఆకాశముపొడవు ఆకాశమే యెరుగు
ఆకడ జలధిలోతు   ఆ జలధే యెరుగు
శ్రీకాంతుడ నీ ఘనము చేరి నీవే యెరుగుదు(04-121)
English transliteration
Ākāśamupoḍavu ākāśamē yerugu
ākaḍa jaladhilōtu ā jaladhē yerugu
śrīkāntuḍa nī ghanamu cēri nīvē yerugudu(04-121)
వివరణం
ఆకాశముపొడవును  ఆకాశమే తెలుసుకొంటుంది. సముద్రపు లోతును సముద్రమే తెలుసుకొంటుంది.ఓ వేంకటేశ్వర ! 
నీగొప్పతనం నీకే తెలుసు. నేను చెప్పుటకు చాలను
ఆంగ్లానువాదము
Sky knows the sky long.
The ocean depth is understood by the sea. 
O Venkateswara!
You know your greatness. 
who am I to say ? 
97
నదులయిసుకలెల్ల నదులే యెరుగును(04-121)
English transliteration
Nadulayisukalella nadulē yerugunu(04-121)
వివరణం
ఓ వేంకటేశ్వర ! నదులలోని ఇసుకల సంగతి నదులకే తెలుసు. 
ఆంగ్లానువాదము
O Venkateswarara! The rivers knew the sandstone things in the rivers
98
అన్నిటి పై నున్నట్లు హరిపై నుండదు మతి
కన్నుల బ్రహ్లాదువలె కనుగొను టరుదా(04-124)
English transliteration
Anniṭi pai nunnaṭlu haripai nuṇḍadu mati
kannula brahlāduvale kanugonu ṭarudā
వివరణం
  హరిపై ఉన్న బుద్ధిని , ఇతర వస్తువులపై  ఉన్న బుద్ధిని పోల్చకూడదు. ప్రహ్లాదుడు ఈ విషయంలో మనకు ఆదర్శం. అతనికి హరిని  కన్నుల్లో  పెట్టుకొనే   బుద్ధి  ( ఏకాగ్ర భక్తి)  ఉంది. ఇతరవస్తువులపై  లేదు. ( haripai unna bhakti goppadani saaraaMSaM)  
ఆంగ్లానువాదము
Do not compare the Hari's understanding and other objects. Prahlada is a model in this regard. 
 His  mind or attention is concentrated only upon  Hari .not on others.(The devotion of Hari is great)
99
భోగించకేల పోవుబుట్టిన జన్మఫలము(04-135)
English transliteration
Bhōgitakēla pōvubaṭṭina janmaphalamu(04-135)
వివరణం
 janma phalitaanni anubhaviMchaka tappadu. 
ఆంగ్లానువాదము
It is es-sen'tially to experience the outcome of the birth.
100
కోపము విడిచితేనె పాపము దానే పోవు(04-196)

English transliteration
Kōpamu viḍicitēne pāpamu dānē pōvu(04-196)
వివరణం
కోపాన్ని విడిచిపెడితే పాపము తనంతట తానే నశిస్తుంది. 
ఆంగ్లానువాదము
If you leave anger, sin will automatically deteriorate.
101
కాంతల పొందొల్లకుంటే ఘనదుఃఖమే లేదు(04-196)
English transliteration
Kāntala pondollakuṇṭē ghanaduḥkhamē lēdu(04-196)
వివరణంకాంతాసంగమాన్ని విడిచిపెడితే దుఃఖమనేది రానేరాదు.
ఆంగ్లానువాదము
If you leave the lover woman's union,, the sadness does not come.
102
కోటివిద్యలునుగూటికొఱకె(04-339)
English transliteration
Kōṭividyalunugūṭikoṟake(04-339)
వివరణం
విద్యలు ఎన్ని నేర్చినా కూటి కొరకు మాత్రమే
ఆంగ్లానువాదము
What kind of education is for the sake of food only
103
ఘనమైన గృహములు గట్టుకొనుటెల్లాను
తనువు మోచేయంతటికే కా(04-344)
English transliteration
Ghanamaina gr̥hamulu gaṭṭukonuṭellānu
tanuvu mōcēyantaṭikē kā(04-344)
వివరణం
గొప్పగా కట్టుకొన్న ఇల్లు ఈ శరీరం ఉన్నంతవరకే
ఆంగ్లానువాదము
Greatly built house exists as long as you live.
104
నీవే కాచుట గాక నేరుపు నా యందేది
చేవల వేపమాను చేదు మానీనా(04-345)
English transliteration
Nīvē kācuṭa gāka nērupu nā yandēdi
cēvala vēpamānu cēdu mānīnā(04-345)
వివరణం
ఓ వేంకటేశ్వరా ! నువ్వే నన్ను రక్షించాలి. నాకు శక్తి లేదు.   నాపుట్టుకతో  వచ్చిన నా దుర్గుణాలు  నా నుండి పోవు.  వేప చెట్టుకు చేసు పొమ్మంటే పోతుందా? 
ఆంగ్లానువాదము
O Venkateswara! You have to protect me. I do not have the power. My bad symptoms are not  gone from me. Will the neem tree be smoothed?
105
ఆస యెచ్చోట నుండు నక్కడ దైన్యము నుండు(04-351)
English transliteration
Āsa yeccōṭa nuṇḍu nakkaḍa dain'yamu nuṇḍu(04-351)
వివరణం
ఓ వేంకటేశ్వరా ! ఆశ ఎక్కడ ఉంటుందో, అక్కడే నిశ్చయముగా దైన్యము (దీనత్వము, దరిద్రత్వము)ఉంటుంది.
ఆంగ్లానువాదము
O Venkateswara! Where there is hope, there is absolutely Lowness( meanness, poverty, humility)
106
ఒకరి బుద్ధులు వేరొకరి పనికి రావు(04-390) 
English transliteration
Okari bud'dhulu vērokari paniki rāvu(04-390)
వివరణం. 
ఒకరి బుద్ధులు వేరొకరికి పనికి రావు
ఆంగ్లానువాదము
One's discernment does not work for someone else
107
ఆస విడిచినఁగాని యధిక సుఖము లేదు(04-408) 
English transliteration
Āsa viḍicinagāni yadhika sukhamu lēdu(04-408)
వివరణం. 
ఆశను వదిలితే ఎక్కువ సుఖము లభిస్తుంది 
ఆంగ్లానువాదము
If you leave curiosity, you will get more happiness
108
జననంబులు మరణంబులు జమునుదయాస్త మయంబులు(04-433) 
English transliteration
Jananambulu maraṇambulu jamunudayāsta mayambulu(04-433)
వివరణం. 
మానవుల యొక్క పుట్టుకలు మరణాలు - యముని యొక్క ఉదయాస్తమయాలతో పోల్చదగినవి.
ఆంగ్లానువాదము
The births of the mortals of humans are comparable to the mornings& evenings of Yama(the deity presiding over the world of departed spirits, who is Judge of the departed souls, and who also presides over the Southern point or quarter),.
109
తనియు బసురమైన ధరణి గసవు మేసి
తనియదు నామనసు ధనకాంక్షల(04-447) 
English transliteration
Taniyu basuramaina dharaṇi gasavu mēsi
taniyadu nāmanasu dhanakāṅkṣala 04-447) 
వివరణం. 
పశువు గడ్డిని మేసి తృప్తి పడుతుంది. కాని మనిషినైన నాకు ధనకాంక్షలతో ఎప్పటికి తృప్తిలేదు.
ఆంగ్లానువాదము
The cattle satisfied with the gross. But 
I am never satisfied with the money I had. 
110
అలమట గడించు నమృతముకంటే
కలపాటి తనకు గంజే సుఖము(04-455) 
English transliteration
Alamaṭa gaḍin̄cu namr̥tamukaṇṭē
kalapāṭi tanaku gan̄jē sukhamu (04-455) 
వివరణం. 
విపరీతంగా శ్రమపడి సంపాదించే అమృతము కంటె - తనకు ఉన్న గంజి మేలు.
ఆంగ్లానువాదము
It is better to have a good Gruel( rice-water) .than AMRUTA (nectar) which is very hard to earn
111
వెతలబొరలే ఘన విభవముకంటే
అతి పేదరిక మది సుఖము
English transliteration
Vetalaboralē ghana vibhavamukaṇṭē
ati pēdarika madi sukhamu (04-455) 
వివరణం. 
ఐశ్వర్య బాధల కంటె కటిక దరిద్రము మేలు 
ఆంగ్లానువాదము
"High-poverty" is better than painful wealth
112
పలుబాములఁబడు పగలిటికంటే
తెలిసి నిద్రించు రాతిరి సుఖము
English transliteration
Palubāmulabaḍu pagaliṭikaṇṭē
telisi nidrin̄cu rātiri sukhamu(04-455) 
వివరణం. 
తెలియని కష్టముల నిలయమైన పగటికంటె, సుఖముతో నిద్రించే రాత్రి గొప్పది. 
ఆంగ్లానువాదము
The night was great. It is better than the day filled with hard ship
113
తఱచు మాటలాడితే తప్పులెన్నైనాదొరలు
English transliteration
Taṟacu māṭalāḍitē tappulennainādoralu(04-516) 
వివరణం. 
అధికంగా మాట్లాడితే ఎన్నో తప్పులు వస్తాయి. 
ఆంగ్లానువాదము
If you talk too much, there are many mistakes.
114
పఱచై తిరిగితేను పాప మంటును
English transliteration
Paṟacai tirigitēnu pāpa maṇṭunu(04-516) 
వివరణం. 
దుష్టుడై తిరిగితే పాపము అంటుకొంటుంది 
ఆంగ్లానువాదము
When sinful turns, sin comes
115
యెఱిగియును దీపనుచు నిట్టి నీ మన్ననల
చెఱబెట్టినది యేటి జీవమిది నాకు(06-10)
English transliteration
Yeṟigiyunu dīpanucu niṭṭi nī mannanala
ceṟabeṭṭinadi yēṭi jīvamidi nāku(06-10)
వివరణం. 
ఓ వేంకటేశ్వరా ! ఈ ప్రపంచం శాశ్వతం కాదని నాకు తెలుసు. అయినా నాకు ఈలోకమంటే నాకు ఎంత ఇష్టమో ! నా సుఖాలు నన్ను వాటి ఆధీనంలో . ఉంచుకొన్నాయి. ఏమి జీవితమయ్యా నాది.!
ఆంగ్లానువాదము
O Venkateswara! I know this world is not eternal.
But I like this world!
 My comforts hold me in their possession. 
What life is mine!

 ****

No comments:

Post a Comment

Pages