జీవితం - అచ్చంగా తెలుగు
 జీవితం.........!
-   పరిమి నిర్మల


జీవితం.........!

సత్యమనిపిస్తూనే
అసత్యమని తోస్తుంది.
క్షణికమని రుజువిస్తూ
అంతమేదని అంటుంది.
మోహమని ప్రవచిస్తూ
మాయలో ముంచేస్తుంది.
క్షణకాలపు వ్యవధిలో
రాత తిరగేస్తుంది
కల నిజమయ్యేంతలో
కధని మార్చేస్తుంది
చేదు అనుభవంలో
మంచి వెతికిస్తుంది.
ఎంత తెలుసనుకున్నా
కొంత వెలితిగానే ఉంటుంది.
జీవితం.....
మలుపులెన్నో చూపి
కొత్త గమ్యం చేరుస్తుంది.
జీవితం.......
అంతుచిక్కని ఒక ప్రశ్నలా ఉంటుంది.
బదులు తెలిసేలోగా ప్రశ్న మారిపోతుంది.
జీవితం.....
గతించినదంతా బాగు అనిపిస్తుంది.
రాబోవుదానికై వ్యధను కలిగిస్తుంది
తృప్తిగల వానికి ఆనందమై గడుస్తుంది
తృప్తి లేనివారికి..........
కొరతగా ముగుస్తుంది.
అవ్యక్తమౌ ఒక భావమే జీవితం !
అడుగడుగునా కాలం నేర్పే 
అనుభవమే...... ఈ జీవితం !! 

***

No comments:

Post a Comment

Pages