శివమ్మ కధ -11 - అచ్చంగా తెలుగు
 శివం -35
శివమ్మ కధ -11
రాజ కార్తీక్ 


(శివమ్మ నేను అన్నం తినకపోవటం చూసి 'ఇది భక్తుల ముద్దా',  అని 'ఇది పార్వతి ముద్దా' అని అన్నం పెడుతుంది ....అది చూసి అందరు ఆనందపడుతూ  ఉంటారు)
శివమ్మ మాతృ వాత్సల్య,o నాకు ఎంతో కమనీయంగా ఉంది. 
శివమ్మ "శివయ్య ఇదిగిదిగో , ఇది, ఇది భేదం లేని  శ్రీహరి ముద్దా" అంటూ నోటికి అందించింది.
నోరి తెరిచి  నేను  తిన్నాను. ఎంతైనా  శ్రీహరి నేను ఒకటే కదా ..ఎన్ని చెప్పినా ..మాకు భేదమే లేదు ...
ఆమె పెట్టిన ముద్ద తిన్న నేను పైకి చూసాను. 
శ్రీహరి నావైపు ఆనందంగా చూసాడు , కనులు మూసుకున్నాడు.
శ్రీహరి "అబ్బ ...ఏమి ఈ శివమ్మ భక్తీ వెల్లువ ..భగవంతుడికీ కూడా ఏదో ఒక మైమరుపు" అన్నాడు.
పార్వతి మాత "సోదరా , తమరి ముద్ద ఎలా ఉంది "అని అడిగింది.
శ్రీహరి "శివమ్మ, మరొక్కమారు నా  ముద్దా అని పెట్టవూ "అని కోరుకున్నాడు.
దేవలోకవాసులు అందరు 'ఆహా, ఏమి ఈ భక్తీ మహిమ ...చూసే వారికీ కనుల పండుగగా  ఉంది ..ఆ  మహాదేవుని లీలల అంతరార్ధం  ఎవరికీ తెల్సు ఆయనికి తప్ప ?' అనుకున్నారు.
శివమ్మ "ఇదిగిదిగో కన్నయ్య బ్రహ్మ దేవుని ముద్దా ."అంది.
బ్రహ్మ దేవుడు సైతం ఆ రుచిని అనుభూతి పొందాడు.
విష్ణు దేవుడు "ఆహా, ఏమి ఈ మాతృ వాత్సల్యం ..ఈ అనుభూతిని పొందడానికైనా మనిషి వలె అవతారములు ఎత్తాలి " అనుకున్నాడు.
బ్రహ్మ దేవుడు "మీకు మహాదేవునకు కనీసం ఆ అవకాశం ఉంది ..మరి నా పరిసిత్తి"అనడిగాడు.
సరస్వతి మాత  "మీ త్రిమూర్తులు అంత ఒకటే కదా "అంది.
నా భక్తులకు,  నాకోసం ఘోర తపస్సు చేస్తున్న వారికీ కూడా ఈ ఘట్టం కనపడేలా అనుగ్రహించాను.
లయమయిన  వారి మనసుతో  మళ్ళీ  ఈ భక్తి  వెల్లువ  సన్నివేశం చూసేలా చేశాను.
వారి భావుకత ఏమని చెప్పేది ..అనుభవించే  మనసు కి మాత్రమే తెలుస్తుంది  ఆ భక్తీ ఉన్మాదం.
ఆ తపస్సు చేస్తున్న యోగులందరి వెంట కనుల వెంట కన్నీరు ధారలు కట్టి ప్రవహించ సాగింది.
నంది , భ్రుంగి  , నాగరాజు "అనుభవించే మనసు, భావుకత  ఉండాలి కానీ మహాదేవుడు కన్నా  మత్తు ఏముంటుంది ..ఆనందం ఎమి ఉంటుంది ." అన్నారు.
శివమ్మ "శివయ్య నువ్వు  ఎక్కడ ఉంటే  అదే  కదా కైలాసం..ఇప్పుడు నువ్వు అడుగు పెట్టిన ఈ ప్రదేశం, అంటే నీ తల్లి ఇల్లు కూడా కైలసమే కదా  " అంది.
పార్వతి మాత "ప్రతి ఒక్క మహాదేవుడి భక్తుడి మనసు కూడా కైలసమే "అంది.
అసలు  ఏమి జరగబోతుంది అని తెల్సుకోవటానికి అందరిలో ఉత్సుకత  నెలకొంది.
శ్రీహరి "ఈ మహాదేవుడు అనుభూతులను పంచుతున్నాడు కానీ ..ఏమి అర్ధం  కాకుండా చేసాడు  ..ఈ హాలాహాల భక్షక  స్వామే  ఇలా  చేస్తే ఎలా " అనుకున్నాడు.
శివమ్మ అలా తన ముద్దలు పెడుతునే  ఉంది.
నేను "అమ్మ ఆగమ్మ ..కాస్త  తిననీ, వెంటనే పెడితే ఎలా "అనేసరికి నాకు  పొలమారింది.
మా అమ్మమంచి నీరు తేవటం మరిచింది. అందుకే మా అమ్మ నంది వైపు చూసింది.
నంది హుటాహుటిన  పరిగెత్తుకొని వెళ్లి మంచి నీరు తెచ్చాడు.
భ్రుంగి "తల పైన గంగని పెట్టుకొని ఈ స్వామి జగన్నాటకం చూడాలి "అని పరిహసించాడు.
దగ్గర నుండి నంది ఇదంతా చూస్తున్నాడు.
నేను "ఒక్క నిమిషం ఉండు అమ్మ పెట్టింది తినని .." అన్నాను. 
ఇంకా తింటూ ఉండగా  శివమ్మ "శివయ్య, ఇది ముద్ద కాదయ్యా,  మీ  అమ్మ పెట్టే  ముద్దు "అని మాతృ వాత్సల్యం తో ముద్దుగా  అంది నాతో. ఇలా ఏదో ఒకటి చెప్పి, నాకు నాకు తినిపిస్తూనే  ఉంది.
ఇక నాకు చాలు అమ్మ, అని అన్నా ..చాలు బాబోయ్ అన్నా  తల్లి ప్రేమ ఊరుకోదుగా. 
ఇక అందరి ముద్దలు అయ్యాయి. ఇంకా కొంత అన్నం మిగిలి ఉంది.
మా అమ్మ నేను ఇక తినను అని తెలిసి ,
"ఇది భ్రుంగి  ముద్దా "అంది తిన్నా , భ్రుంగి లో అంతులేని ఆనందం.
"ఇది నాగస్వామి ముద్దా"అంది తిన్నా  ..నాగరాజు  పారవశ్యంలో మునిగిపోయాడు.
పక్కనే  నుంచున్న నంది , ఎందుకో ఓరగా  చూస్తున్నాడు.
శివమ్మ "ఇదీ ఆఖరి ముద్ద,  ఇక అయిపొయింది ...ఇంకా కొంత ఉన్నా ఇదే  ఆఖరి ముద్దా" అంది.   నేను "నా వల్ల  కాదు పొమ్మా, ' అన్నాను.
నంది ""మహాదేవుడికి నేను కూడా రెండు ముద్దలు పెడితే  బాగుండు అని చూస్తున్నాడు ..కానీ తన ముద్దా అని ఇంకా శివమ్మ తల్లి పెట్టలేదు అని" లోలోపల బాధపడుతున్నాడు.
శివమ్మ "శివయ్య ఇది ఈ ఆఖరు ముద్ద, నువ్వు కాదు అనటానికి లేదు. ఇది నీకు అత్యంత ఇష్టుడు ఐన నంది ముద్దా ' అంది.
నేను "నంది ముద్దా, ఐతే ఖచ్చితంగా తింటా అంటూ  "పిల్లవాడి వలీ 
ఇక చుడండి నంది కంట కన్నీరు ..ఏమిటో ఈ నంది ..నంది కదా, శివమయం  అంతే ,నంది తత్వమేయ్ శివం.   
నేను బ్రేవు బ్రేవు అని తేన్చాను. ఇక నా వల్ల  కాదు ..యుగాల తరబడి ఆకలి తీరిపోయింది.
అందరు .."మహదేవుడికి  మహానైవేద్యం" అని జయధ్వానాలు చేసారు. 
నంది మాత్రం ఒక చిన్న కోరిక తీర్చవా శివయ్య  అన్నట్లు  చూస్తున్నాడు.
(సశేషం)

No comments:

Post a Comment

Pages