కొత్త బాట - అచ్చంగా తెలుగు
కొత్త బాట
పెమ్మరాజు అశ్విని 
      
రాత్రి పది  అవుతోంది శనివారం నాడు విశాఖపట్నం బీచ్ లో నెమ్మది గా జనం పల్చబడుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారో ఒక పది మంది కుర్రాళ్ళ గ్యాంగ్ వాళ్ళ లేటెస్ట్ మోటార్ బైక్ ల మీద వచ్చి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు ఒకడు స్టాండ్ వేసి దాన్ని రోడ్ కేసి రాస్తున్నాడు ఇంకొకడు ముందర చక్రం గాలిలోకి లేపి  వీలింగ్ చేసున్నాడు మిగతావాళ్లు పక్కన నిలబడి "మామ కేక ఇంకోసారి అంటూ ఈలలు చప్పట్లు ,కొడుతున్నారు " అక్కడున్న జనం వీళ్ళని చూసి కొంత మంది నవ్వుతున్నారు,కొందరు తిడుతున్నారు ,మరికిందరు వారికేమౌతుందో అని భయపడుతున్నారు,కానీ ఎవ్వరు  వెళ్లి వాళ్ళని ఆపే  ప్రయత్నం చెయ్యట్లేదు, అదే రోడ్ మీద అనుకోకుండా వచ్చిన ఏసీపీ కరుణాకర్ మాత్రం అది చూసి కోపం తో ఊగిపోయాడు,గబగబా తన కార్  దిగి ఆ పిల్లల దగ్గరికి వచ్చి ఆపబోయాడు ,తాను యూనిఫామ్ లో లేకపోవడం తో వాళ్ళు తనని కామన్ పబ్లిక్ అనుకోని " అంకుల్ మీకెందుకు మీ పని చూస్కోండి అంటూ చాలా గీరగా సమాధానం ఇచ్చాడు  " అయినా సరే వస్తున్న కోపాన్నీ దిగిమింగుతూ "అలా కాదు లైఫ్ రిస్క్ ఆటలు ఆడకూడదు ,వద్దు రా అర్ధం చేస్కోండి " అని చెప్తుంటే "ఒరేయ్ అంకుల్ కి పని లేన్నట్టు వుంది ఆగి మరి క్లాస్ పీకుతున్నాడు " సరే ఇది వినిపించుకునే బాపతు కాదు అని సైలెంట్ గా వాళ్ళ బండి నెంబర్ గమినించుకున్నాడు .
                        ఇంటికి వెళ్ళాడు గాని ఆ పిల్లలికి ఏమౌవుతుందో అని దిగులు పడుతూనే  వున్నాడు ,తానొక ఏసీపీ వృత్తి రీత్యా ఏంటో మంది నేరగాళ్ళను చూసాడు ,దొంగలు ,మోసాలు చూస్తూనే ఉంటాడు కానీ ఇవాళ ఈ పిల్లల ఆకతాయి తనం తో ప్రాణం మీదకు తీర్చుకుంటారేమో నన్న ఊహ కూడా తాను భరించలేకపోతున్నాడు . అసలు తప్పేవేరిది 
అంటూ ఆలోచిస్తున్నాడు ,సరే ఈ పిల్లలతో పాటు తల్లితండ్రులకి ఉపాధ్యాయులకు కూడా అర్ధమయ్యే లాగ వివరించాలి ఒక పద్దతి ఆలోచించాడు కరుణాకర్ . కొంచెం కష్టమైన తప్పదు చేయాల్సిందే అనుకున్నాడు . మర్నాడు పొద్దున్నే ఊరిలో వున్న హై స్కూల్స్ కాలేజీ ల  కి ఒక సర్కులర్ పంపించాడు , ముందుగా ఆ కళాశాల ల ప్రధాన అధ్యాపకులందర్నీ తన ఆఫీస్ లో సమావేశ పరిచాడు. 
                      రోజు రోజు కి సిటీ లో జరుగుతున్న   ఆక్సిడెంట్స్ అందులో ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు అనే విషయం మీద తాను తయారు చేసిన ఒక వీడియో చూపించి ఇది పిల్లలకి చూపించి  వారిలో మార్పు తెచ్చే దిశ గా తానూ చేయదలచుకున్న పనిని వివరించాడు . ఒక ఏసీపీ తమ కళాశాల విద్యార్థుల పట్ల ఇంత శ్రద్ధ వహించడం వారికి ఎంతో ఆనందం కలిగించింది ,అయితే సిటీ లో దాదాపు గా 400 కళాశాలలు వున్నాయి ఇన్నిటిని ఎలా ఒకేసారి విసిట్ చేయాలి అనేది చిక్కు ప్రశ్న  అయింది ,అయితే కాలేజీ ప్రధాన ధ్యాపకులు వీడియో కాన్ఫరెన్స్ అయితే ఇది సులువని ఆ రోజు దాదాపుగా అందరు విద్యార్థులు కళాశాల కు వచ్చేలాగా షరతు విధిస్తామని ,అలా రాని విద్యార్ధులకి పరీక్షా హాల్ టికెట్స్ ఇవ్వమని స్ట్రిక్ట్ గా చెప్తామని తమ వంతు ముందడుగు వేశారు. 
                   సంకల్పం మంచిదైతే అన్ని అనుకూలంగా సాగుతాయి అనుకున్నాడు ఏసీపీ కరుణాకర్ ,ఒక చిన్న ఎగువ మధ్య తరగతి కుటుంబం లో పుట్టి ఇంటర్మీడియట్ వరకు చక్కగా చదువుతు ఇంజనీరింగ్ లో ఫ్రెండ్స్ తో పాటు వీలింగ్ లో అలాగే అతి వేగం వల్ల డ్రింక్ అండ్ డ్రైవ్ వల్ల చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రుల దుస్థితి ,అలాగే మంచాన పడ్డ విద్యార్థుల దుస్థితి అన్ని తనకి తెలిసిన ఒక మీడియా అతని సాయం తో మనసుకి అతుక్కునే లాగ వీడియో చేయించాడు. 
                  కళాశాల యాజమాన్య ల తో మాట్లాడి ఒక తేదీ నిర్ణయించాడు ,దానితో పాటు వీలైనంత మంది పిల్లల తల్లితండ్రుల ఫోన్ నంబర్స్ సేకరించి తనకి ఇవ్వమని వారిని అభ్యర్ధించాడు ,
వారు నిర్ణయించిన రోజు కళాశాల యాజమాన్యాల ఆజ్ఞ మేరకు భయమో భక్తో గాని మొత్తానికి దాదాపు గా 100 శాతం పిల్లలు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు . ముందుగా తానూ తయారు చేసిన 20 నిమిషాల నిడివి గల వీడియో ని ప్రదర్శించాడు ,ఆఖరు న తాను ఇలా మాట్లాడాడు "నేను మొన్న కొందరు మన విశాఖ యువత ను వీలింగ్ చేయకుండా అడ్డం పడితే అంకుల్ కి పనిలేదురా అని ఎగతాళి చేశారు ,మీ వయసు కి అలా అనిపించడం సహజమే అయితే కొన్ని క్షణాల ఆనందం కోసం ,కొన్ని నిమిషాల హీరోయిజం కోసమో, మీ అభిమాన హీరో చేసినట్టుగా ఫైట్ లు స్టంట్ లు చేయడం సరదా నే కానీ ఇందాక మనం వీడియో లో చూసినట్టు గా అలాంటి సరదాలు ఎందరో పిల్లల్ని శవాలు గా లేదా శాశ్వత వికలాంగులుగా మిగులుస్తోంది . కని పెంచి మనం కోరిన దానికంటే ఎక్కువగా అన్ని సమకూర్చే తల్లితండ్రుల శ్రమ కి మనం వారికిచ్చే బహుమానం ఈ కడుపుకోతే నా ,ఒక్కసారి ఆలోచించండి మీ పేరెంట్స్ మీ మీద ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతుంటారు ఒక్కోసారి వారి కనీస అవసరాలు త్యాగం చేసి మీకు ఫీజు లు ఖరీదైన బట్టలు గాడ్జెట్స్ అమరుస్తారు ,అలాంటి వారికి మీరు ఇచ్చే బహుమానం ఇలాంటి దుస్థితి లో మిమల్ని చూడడమేనా "
                          " ఇక మీదట డ్రింక్ అండ్ డ్రైవ్ గాని వీలింగ్ గాని లేక అతి వేగం తో నడుపుతూ ఏ ఒక్క విద్యార్థి మా పోలీస్ లకు గాని,మా సీసీటీవీ గాని పట్టుబడితే వారిని ,వారిని పేరెంట్స్ అరెస్ట్ చేయడానికి వెనకాడ బోము ,ఇందుకు అవసరమైతే ఏ స్థాయి వారిని అనుమతులైన తీసుకుంటాం,ఒక బాధ్యత గల పోలీస్ వ్యవస్థ విశాఖ లో యువత ని కాపాడేందుకు వుంది ని మా విశాఖ పోలీస్ యంత్రాఙ్గమ్ చూపిస్తుంది  "అని ముగించారు . ఏసీపీ కరుణాకర్ చేప్పట్టిన ఈ కార్యక్రమం తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిపొయింది,కళాశాల పిల్లల తల్లితండ్రులకి ఈ వీడియో షేర్ చేయడం జరిగింది ,ప్రతి ఇంట్లో ను పిల్లలకి తమ పేరెంట్స్ నుంచి గట్టి హెచ్చరికలు అందాయి ,ఇంతేగాక కళాశాల లో కూడా సాధ్యమైనంత వరకు పిల్లలకి అవగాహన పెంచే కార్యక్రమాలు పెరిగాయి , దీని పర్యవసానంగా విశాఖ లో రోడ్ ఐసీసిడెంట్స్ లు అందులో ప్రాణాలు కోల్పోవడం వంటి దురదృష్టకర సంఘటనలు క్రమేపి తగ్గుముఖం పట్టసాగాయి ,ఈ కార్యక్రమం వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి  రాష్ట్రము మొత్తం ఇది అమలు పరచాలని ఆజ్ఞలు జారీ చేసారు. అలా ఏసీపీ కరుణాకర్ వేసిన కొత్త బాట పూల బాట గా మారింది . 


***


1 comment:

  1. The writer has taken us to Utopia. పోలీసు ఆఫీసరు గారు మఫ్టీలో ఉన్నప్పటికీ, ఆ పిల్లలు మీకెందుకు అంకుల్, మీరు వెళిపోండి అనగానే నోరు మూసుకుని వెళిపోవడం పధ్ధతిగా లేదు. ఫోను వాడచ్చని గాని, మఫ్టీలో ఉన్నా చర్య తీసుకోవచ్చని గాని తెలియని ఆయనేం పోలీసాఫీసరో ఏమిటో!

    ReplyDelete

Pages