కిసుక్కున నవ్వండి! - అచ్చంగా తెలుగు
కిసుక్కున నవ్వండి!
(పాత్రలు మనవే( కావచ్చు), అందుకే పేర్లు పెట్టలేదోచ్)
ప్రతాప వెంకట సుబ్బారాయుడు


"నువ్వు మహిళామణివే కాదణ్ను..కానీ నన్ను మగ పురుగు అండం ఏం బాగాలేదు రాజీ"
*****
పబ్లిసిటీ కోరుకునే భార్య-
వంట భర్త చేత చేయించి, అథితులకు తను ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డిస్తుంది
*****
బార్లో-(మందు తాగడం ఆరోగ్యానికి హానికరం-సినిమాల్లోనే కాదు ఇహ ముందు ప్రింట్ మీడియాలోనూ ఇలా పెట్టాల్సొస్తుందేమో)
"పదేళ్ల క్రితం మా ప్రేమను పెద్దలు కాదన్నప్పుడు, వారిని ఒప్పించి మేము పెళ్లి చేసుకొన్నందుకూ నా విషయంలో పెద్ద తేడా ఏం లేదురా"
"ఎందుకలా?"
"అప్పుడు భగ్న ప్రేమికుడిగా తాగాను, ఇప్పుడు ఓడిన సంసారిగా తాగుతున్నాను"
*****
"ఫేస్ బుక్లో కుర్రాడి ప్రొఫైల్ పిక్ బాలేదని సంబంధం వద్దనుకోవడం భావ్యం కాదేమోనమ్మా"
*****
"మీ పెళ్లిరోజుకి ఇన్ని వందల మందిని ఇన్వైట్ చేశావేమిటే?"
"పొరబాట్నవిషయం ఫేస్ బుక్ లో పెట్టాను"
***** 

No comments:

Post a Comment

Pages