తేనెలాంటి కవిత్వం
అఖిలాశ
ఆ కవయిత్రి సున్నితమైన కవిత్వాన్ని హృదయంతరాళలో నింపి, ఆనందపు లోకంలో విహరించేలా చేస్తారు. ఆమె కేవలం కవయిత్రి మాత్రమే కాదు, కళాఖండాలను తన కాన్వాస్ పై చిత్రీకరించి, నయనాలను అబ్బురపరుస్తారు. వినసొంపైన సంగీతాన్ని తన వీణతో పలికించి మన చెవులకు తేనెను అద్దుతారు. చదివింది ఇంజనీరింగ్, కాని సర్వకళలు తన మది గర్భంలో దాచుకున్న కవయిత్రి ఆమె. భావ కవిత్వాన్ని పండించడంలో తనకు తానే సాటి, ఆమే మన గాయత్రి కనుపర్తి గారు..!!
ఇట్లు.....నీ... అనే కవితా సంపుటిలో వారు రాసిన కవితలతో పాటు అందమైన చిత్రాలు మన మనసును సాహిత్య వనంలో విహరించేలా చేస్తాయి. మొదటి కవితలో ఒక అమ్మాయి తనను ఋతువులతో పోల్చుకుంటూ, 'నేను నిన్ను అర్చించుకోనా?' అని ప్రియ సఖుని అడిగిన తీరు ఉపయోగించిన పద బంధాలు కొత్తగా ఉన్నాయి.
నీవెవరివో కదా...?? కవితలో నీవు ఎవరు నా హృదయాన్ని గిలిగింతలు పెడుతున్నావు అరమోడ్పు కన్నుల మాటున దాగిన కలల రవానివా లేకా నవ్వుల వర్ణాలతో గీసుకున్న ఉహల రూపనివా..??అంటూ సఖుడిని అడిగిన తీరు మన మనసులను సమ్మోహన భరితం చేస్తుంది.
“పువ్వుల పై ఉన్న నవ్వుల సంతకాలే నా ఆనవాళ్ళు
నా శ్వాసలో పరిమళాలను అడ్డుకున్న గాలులే నా ఆనవాళ్ళు
నువ్వు నడిచే దారిలో పువ్వుల గుసగుసలే నా అడుగుల ఆనవాళ్ళు “
ఈ మూడు వాఖ్యలు చాలు కదా వారి కవిత్వ శక్తి ఎంతటిదో చెప్పడానికి. సఖుడిని తోటమాలితో పోల్చి తానెవరో వివరంగా చెప్పిన తీరు కవితాన్ని ఆశాంతం చదివించేలా చేస్తుంది.
అనుకోని అతిధి, ప్రణయ వీణ, అంతర్ముఖి, అక్షర సావాసం, వెన్నెల పుష్పం పాణిగ్రహణం, ఎదురుచూపులు ఇలా కవితలన్నీ భావుకత మధుత్వంలో మనల్ని తడిపేస్తాయి.కవియిత్రి గాయత్రి కనుపర్తి గారు మరిన్ని కవితా సంపుటాలు మన తెలుగు సాహిత్యానికి అందివ్వాలని కోరుతూ..!!
మీ
అఖిలాశ,బెంగుళూరు,7259511956
No comments:
Post a Comment