శ్రీధరమాధురి - 46
(మాట్లాడడం గురించి పూజ్య గురుదేవుల అమృత వాక్కులు)
చెప్పిన బాటలోనే నడవండి. అంటే, మీరు చెప్పింది ఆచరించి చూపండి.
మాట్లాడే ముందే ఆ దారిలో మీరు నడవడం అంటే, మీరు చెప్పేవి అంతకు ముందే మీరు
ఆచరించినట్లు అర్ధం.
అతను – గురూజీ, నేను ఎల్లప్పుడు చెప్పిన బాటలోనే నడుస్తాను.
నేను – చాలా సంతోషం. నా విషయంలో నేను మాట్లాడే ముందే ఆచరించి,
తర్వాత చెప్తాను.
అతను అర్ధం కానట్లు చూస్తున్నాడు, నేను నవ్వసాగాను.
నాకు అర్ధం కాని
విషయాలు, గ్రహించలేని విషయాల గురించి నేను మాట్లాడను –ఉదాహరణకు రాజకీయాలు.
కొంతమంది మేధావులు తెలిసీతెలియకుండా మాట్లాడతారు. జ్ఞాని వారిని
చూసి నవ్వుతారు.
నీతుల, విలువల గురించి అధికంగా
మాట్లాడేవారు మననుంచి ఏదో దాస్తారని నేను ఎలప్పుడూ గమనించాను. దేని గురించైనా
అతిగా ఒకరు మాట్లాడుతున్నారంటే, మన కంటికి కనిపించే దాని కన్నా, అందులో ఇంకేదో
ఉందని అర్ధం. అందుకే అటువంటి దివ్యమైన ఆత్మలను జాగ్రత్తగా గమనించండి.
బాధ్యతల గురించి అధికంగా
మాట్లాడే వారు, కేవలం మాటలతో సరిపెడతారు. అవన్నీ నటనలే. నిజంగా బాధ్యతాయుతమైన వ్యక్తి,
ఏ మాత్రం అట్టహాసాలు లేకుండా ఏం చెయ్యాలో,
దాన్ని ప్రేమగా చేస్తాడు. బాధ్యతల గురించి అతను మాట్లాడాడు.
బాగా తెలిసిన వారు కూడా దైవం గురించి
మాట్లాడేటప్పుడు , మీరు జాగ్రత్తగా గమనిస్తే, వారికున్న జ్ఞానం యొక్క స్థాయిని మనం
తెలుసుకోవచ్చు.
మీరు చాలా మంచివారే కావచ్చు, కాని ఇతరుల గురించి
ఎన్నడూ చెడ్డగా మాట్లాడకండి.
“గతంలో నేను చెప్పింది విననందువల్లే ఈ రోజున మీరిలా
బాధపడుతున్నారు”...
ఇలా మాట్లాడకండి. ముందే గుండెలో ఏర్పడిన గాయానికి ఉప్పు
రాయకండి. ఇబ్బందుల్లో ఉన్నవారి పట్ల సహానుభుతిని కలిగి ఉండండి, వారు నిరాశ నుంచి
బయట పడేందుకు వారికి సాయం చెయ్యండి.
అతనివద్ద డబ్బు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు,
అతను దానధర్మాల గురించి ఎక్కువగా మాట్లాడేవాడు.
దైవం అతని మాటలని నమ్మి, అతనికి టన్నుల కొద్దీ విరివిగా డబ్బును ఇచ్చారు.
ఈ రోజున అతడు లక్ష్యాలు, సామర్ధ్యం, జాయింట్
వెంచర్లు, మల్టీ నేషనల్ వెంచర్ల గురించి మాట్లాడుతున్నాడు.
నేను దైవంతో ఇలా అన్నాను – ‘దైవమా, ఇప్పుడు ఏం
చేస్తారు?’
దైవం నన్ను చూసి కన్ను గీటారు, నేను నవ్వాను.
దైవం యొక్క మార్గాలు గుహ్యమైనవి.
మీరు ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు మీ మాటలని ఆచి,
తూచి మాట్లాడాలి. మీ క్రింద పనిచేసేవారు మీ అభిప్రాయాలు విని, ప్రభావితం కావచ్చు. ఒక నిజమైన నాయకుడిగా అప్పుడు మీపైన, ఈ ప్రపంచాన్ని సమిష్టిగా ఉంచే బాధ్యత ఉంటుంది.
***
No comments:
Post a Comment