కిసుక్కున నవ్వండి! - అచ్చంగా తెలుగు
 కిసుక్కున నవ్వండి!
(పాత్రలు మనవే( కావచ్చు), అందుకే పేర్లు పెట్టలేదోచ్)
ప్రతాప వెంకట సుబ్బారాయుడు"రోగం తగ్గిపోయింది కదా..ఇహ రోగిని డిస్చార్జ్ చేద్దామా డాక్టర్.."
"ఆ బెడ్ కు రిలీవర్(ఇంకో పేషంట్) వచ్చాక..అలాగే చేద్దాం"
*****
"నీ వైవాహిక జీవితం సపలం కావడానికి కారణం"
"రచయితను కదా..పెళ్లవంగానే మా ఆవిడ మీద అష్టోత్తర శతనామావళి రాసి అంకితమిచ్చాను. ఆవిడ పుట్టిన రోజుకు, వైవాహిక దినోత్సవానికి అది చదివి బహుమతులిస్తూంటా"
*****
"నేను వంట పని, ఇంటి పని చేస్తున్నప్పుడు సెల్ తో తీసి, యూ ట్యూబ్ లో పెట్టి, అందరికీ వాట్సప్ లో లింక్ పంపడం ఏం బాగాలేదు రుక్కూ.."
*****
"మీ ఫామిలీ ఎంత టెక్నాలజి ఇష్టులైతే మాత్రం మీ పిల్లలకి సెల్ కుమార్, వాట్సప్ రాణి అని పేర్లు పెట్టడమేమిటి?"
*****
"మా ఇంట్లో దొంగతనం చేసి, మమ్మల్ని పిల్లర్ కి కట్టేసి, మాతో సెల్ఫీ తీసుకుని వెళ్లిపోయాడ్రా దొంగ"
*****

1 comment:

Pages