శివం -32 - అచ్చంగా తెలుగు
శివం -32
శివమ్మ కధ -8
రాజ కార్తీక్ 

(శివమ్మ భక్తికి శివయ్య కరిగి ఆమె ఇంటికి కొడుకు లాగా వస్తాడు ,సాధారణమైన మనిషి లాగా  ఆమెతో ఉంటాడు. నంది శివయ్య తనకి పాయసం ఇవ్వలేదు అని అలుగుతాడు ,నంది అలిగాడని మహాదేవుడు పాయసం కోసం పిలుస్తాడు ,నంది మహాదేవుడి దగ్గరకు వెళ్లి శివయ్య తాగిన పాత్ర తీసుకొని నించున్నాడు )
నేను నందిని అందరి కన్నా ఎక్కువగా చూసుకుంటాను ..ఎందుకటే నన్ను నంది అందరి కన్నా ఎక్కువగా చూస్తాడు ..శివమ్మ భక్తికే కాదు నందికి కూడా నేను బానిసను ..
నంది మహాదేవుడి దగ్గరకు వెళ్లి శివయ్య తాగిన పాత్ర తీసుకొని నించున్నాడు .
శివమ్మ, నాగరాజు అందరూ ఎదురు  చూస్తున్నారు.
నేను "నంది ,నాకు తెల్సు.  అమ్మ పాయసం కోసం నేనంత పరితపించానంటే అందులో ఎంత ఆనందం ఉందో అనీ కదా నీ  ఉద్దేశం.‌ నీకు పెట్టకుండా తింటానా ,నా కోసం అన్ని వదిలేసావ్ ...నీ కన్న ఆప్తులు ఎవరు?  "అన్నాను.
నంది మొహం లో వికాసం ...భక్తీ ..
నంది "శివయ్య, ఏమి చేసిన నా ఉద్దేశం తమరి మీద భక్తి మాత్రమే,తమరు నన్ను ..
ఎలా చూస్తారో నాకు తెలిదా ...తమరికి చెప్పేంత వాడినా నేను "‌అన్నాడు.

నాగరాజు పరిస్తితి కూడా అంతే.
నాగరజు మాత్రం శివమ్మ వైపు చూసి ఒక పాత్ర ఇవ్వమన్నాడు సైగ చేస్తూ.
శివమ్మ తెస్తా ఉండు అన్న సైగతో లోపలకిి వెళ్ళింది.
ఆ పాత్ర పట్టుకొని నంది "ప్రభు అందరికి అన్ని ప్రసాదించే మీరు ఈ దీనుడు కోరుకున్నది  ప్రసాదించండి ..మీ పట్ల ప్రేమ తో అనుకోకుండా కోరిన ఈ కోరిక తీర్చండి" అన్నాడు.
నేను "ఎందుకు తీర్చను ? రాక్షసులకు అడిగినంతనే వరాలిచ్చే నేను, నా భక్తులు అడిగితే చెయ్యనా?...." అన్నాను ప్రసన్నంగా చూస్తూ.
విష్ణు దేవుడు "తెల్సు మహాదేవా..వారి తపస్సు కి ఇచ్చే గౌరవం అది. భోలా శంకరుడు అని ఊరికే అంటారా తమర్ని "అన్నాడు.
నేను నా జటను తీసి, 'నంది నీకోసమే అమ్మ చేసిన పాయసం, తీసుకో ' అన్నాను.
అంతే, ఆ జటలో నుండి  గంగ వలె పాయసం ధారగా వస్తోంది ..ఆ పాయసం సరిగ్గా నంది పాత్ర లో  పడుతోంది.
తీవ్రమైన భక్తీ ఆవేశంలో నంది ఆనంద భాష్పాలతో, కాళ్ళకు అడ్డుకుంటున్నాడు. 
నాగరాజు ఎమన్నా తక్కువ తిన్నాడా... మిక్కిలి ఆనందంగా శివమ్మ తెచ్చే పాత్ర కోసం చూస్తున్నాడు.
నంది ఆ పాయసం తాగుతున్నాడు ...అబ్బ  ఎంతో ఆనందంగా ఉంది నాకు.
ఏంటో ...నంది కనులలో సంతోషం చూస్తే నాకూ ఆనందం.
ఇంతల్లో శివమ్మ వచ్చింది ఆ పాత్ర తీసుకొని . అంతే, ఆమె  ఆ సంఘటన చూసి పరవశురాలు అయ్యింది.
ఆమే కాదు, అందరూ అంతే...
విష్ణు దేవుడు "నంది పని బాగుంది మనకేమో కొంచం మాత్రమే పాయసం ,కానీ నందికి మాత్రం తగినంత ..తాగినంత .."అన్నాడు.
బ్రహ్మ మరియు పార్వతి మాత "నిజంగా నంది ఎంత అదృష్టవంతుడో ,శివమ్మ భక్తీ మాధుర్యతను, శివయ్య ఆప్యాయతను పొందాడు .." అన్నాడు.
నాగరాజు కల్పించుకొని "ప్రభు నాకు కూడా ప్రభు ..మీరు ఇలా పక్షపాతంగా ఉన్నది నందికి మాత్రమే ఇస్తారా?  నాకు కూడా ఇవ్వండి ప్రభు ..నన్ను అనుగ్రహించండి, " అన్నాడు.
నవ్వుతూ మరొక జట తీసాను. అంతే అందులో వచ్చిన పాయసం తాగి నాగరాజు సంతుష్టుడయ్యాడు.   
శివయ్య కి ఒక వాణి వినపడుతుంది "ప్రభు నేను గంగను. తమరి మాత చేసిన పాయసం ఎంతో అద్భుతం .."అంది గంగమ్మ.
నేను నవ్వసాగాను.
గంగ "తమరి భక్తురాలి భక్తి నాలో చేరి ఈ పాయస రూపంలో నన్ను ఎంతో ఆనందింప చేసింది ..భక్తి వల్ల ఎవరైనా పునీతులు అవుతారు అని నిరూపించింది. "అంది.
పార్వతి మాత "సోదరా, విష్ణు దేవా !మనం అక్కడికి వెళ్దాం ..ఈ మహాదేవుల వారు మనకి జరిగేది తెలియకుండా చేసాడు.."అంది.
పార్వతి మాత భృంగి కోసం వెదికింది ..
విష్ణు మరియు బ్రహ్మ దేవుడు "జరిగేది తెలియకున్నా ..ఆమె కోరిక మాకు తెల్సు .మనం వెళ్ళినప్పుడు ఇంతకన్నా మహత్తర ఆనందం పొందుతాం .."అన్నారు.
ఇంతలో శివమ్మ ఇంట్లో  భృంగి  ప్రతక్ష్యమయ్యాడు. అంతే, భృంగి వెంటనే పాయసం కోసం అలిగాడు. మహాదేవుడు తన మరొక జటతో అతని అలక తీర్చాడు.
జటాజూటం నుండి పాయసం తృప్తిగా అందరికి ఇచ్చాను. 
నేను "రామ్మ  నా దగ్గరకు, ఎందుకు దూరంగా ఉంటావ్ "అన్నాను శివమ్మతో.
శివమ్మ "శివయ్య నీకోసం భోజనం సిద్దం చేశా ...ఆకలి  అన్నావుగా ,రా వచ్చి కూర్చో శివయ్య అన్నం పెడతా " అంది.
నాకు కూడా అలక వచ్చింది ""అలా ఐతే నేను తినను " అన్నాను.
(సశేషం)

No comments:

Post a Comment

Pages