బహుముఖ ప్రజ్ఞాశాలి -ఆర్టిస్ట్ శోభ - అచ్చంగా తెలుగు

బహుముఖ ప్రజ్ఞాశాలి -ఆర్టిస్ట్ శోభ

Share This
బహుముఖ ప్రజ్ఞాశాలి -ఆర్టిస్ట్ శోభ 
భావరాజు పద్మిని 


 అసలు కళాహృదయం అంటూ ఉంటే, అది కేవలం ఒక్క కళకే పరిమితం కాదు, అనేక కళలుగా పల్లవిస్తుంది. అటువంటి  బహుముఖ ప్రజ్ఞను సంపాదించుకున్న అరుదైన కళాకారిణి మొక్కపాటి శోభ గారు. బెంగుళూరులో ఉండే ఆవిడ ప్రముఖ వైణీకురాలు, గాయని. కేవలం సంగీతమే కాకుండా సాహిత్యం, చిత్రలేఖనం పట్ల కూడా ఆమెకు తగని మక్కువ. త్వరలోనే ఆమె సంగీతంలో పి.హెచ్.డి చెయ్యనున్నారు. వైవిధ్యానికి పెద్దపీట వేసే శోభ గారి కొన్ని చిత్రాలు, ఆవిడ స్వపరిచయంతో సహా ఈ నెల ప్రత్యేకించి మీకోసం.

నమస్కారం. నా పేరు శోభ.  లలిత కళల పట్ల మక్కువ నా చిన్నతనం నుండే ఏర్పడింది. మా అమ్మా, బాబాయిల ప్రోత్సాహంతో వాటర్ కలర్స్ వేసేదాన్ని. మా తల్లిదండ్రుల కోరిక మేరకు సంగీతంపై ఎక్కువ దృష్టి సారించి, తద్వారా లలిత కళలకు కొంతకాలం దూరమయ్యాను. తర్వాత ఫాబ్రిక్ పెయింట్స్ పై మళ్ళీ మక్కువ ఏర్పడింది. మా బాబాయి, స్నేహితుల ప్రభావంతో నాకు ఆ కళల పట్ల విపరీతమైన మక్కువ ఏర్పడింది.
నాకంటూ ప్రత్యేకంగా ఏ గురువూ లేరు. నా స్నేహితురాలు లక్ష్మీ ప్రసన్న ప్రోత్సాహంతో కుంచె పట్టి, తొలి పెయింటింగ్ వేసా. చాలా బ్రేక్స్ తో అప్పుడప్పుడూ వేస్తూ వచ్చాను. లలిత కళలే కాక, హస్తకళలన్నా నాకు ఎంతో ప్రీతి. పెయింటింగ్స్ కోసం కేవలం కాన్వాస్ నే కాక, పాట్, గ్లాస్ వంటి ఇతర మాధ్యమాలను కూడా వాడుతూ ఉంటాను. మొదట నా తల్లిదండ్రులు, వివాహం తర్వాత నా భర్త ప్రోత్సాహంతో నా ఉత్సాహాన్ని కొనసాగిస్తున్నాను.

ఈ తరం పిల్లలు కేవలం చదువులే కాక, కంప్యూటర్ కే వారు పరిమితమై పోకుండా, ఇలాంటి కళల పట్ల కూడా ఉత్సాహం చూపించాలని కోరుకుంటున్నాను. 

శోభ గారి బొమ్మల కొలువు :




2 comments:

  1. Excellent....We feel very happy to note that such indepth talent is hidden in you. We wish you to cross many and many more milestones in this direction. GOD BLESS YOU AMMA...

    ReplyDelete

Pages