ఆవకాయ కవిత - అచ్చంగా తెలుగు
ఆవకాయ కవిత 
జె.ఎల్. నరసింహం
హాస్యావధాని, హైదరాబాద్ 


విస్తరించి నట్టి విపులఖ్యాతి గలదావకాయ
విస్తరాకునకు పునిస్త్రీ శోభనిచ్చుఆవకాయ
రుద్రఫాలనేత్రమై రాజిల్లేఆవకాయ
ముద్ద పప్పు మిత్రమై వర్దిల్లే ఆవకాయ
వేసవిలో పుట్టి  చవులూరించే ఆవకాయ
కవులెందరినో కదలించినదావకాయ
అర్థరాత్రి  బంధువులనుకోకుండా వస్తే 
ఇల్లాలిని ఆదుకొనే ఆత్మబంధువావకాయ.

                       .........


No comments:

Post a Comment

Pages