ప్చ్ - అచ్చంగా తెలుగు
ప్చ్
                                              - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

అనుభూతులు..ఆనందాలు..
బాధలు..భయాలు..
పున్నమీ..అమావాస్య..
ప్రకృతిలోని అన్నింటికీ సమానమే!

చెట్లు మోడులవుతాయి
చెఱువులు ఎండిపోతాయి
ప్రకృతి వైపరిత్యానికి మూగజీవాలు
అల్లల్లాడిపోతాయి
బాధని మౌనంగా భరిస్తాయి.

అన్నీ తెలిసి 
విచక్షణను కలిగిన మనిషి
తనకు కలిగిన కష్టానికి
జరిగిన నష్టానికి
పరిహార పూజలు..
జాతకాలు..జపాలు
చేతులకు..కాళ్లకు..మెడకు..మొలకు..
రకరకాల తాళ్లధారణ
ప్చ్ 
***

No comments:

Post a Comment

Pages