శతావతారాలు - అచ్చంగా తెలుగు
శతావతారాలు
కసవరాజు కృష్ణమోహన్ 

ఈ దిక్కుమాలిన నగారాల్లో సిగ్నల్ ఎక్కడైనా వస్తుంది అంటే చచ్చేంత బయం వేస్తుంది...వీళ్ళ దుంపలు తెగ ఎ సెంటర్ లో చూసినా..రెడ్ లైట్ పడితే చాలు ..చక్కర పాకం మీద ఈగలు వాలినట్టు వాలిపోతారు ఒకడేమో స్ప్రింగ్ చేత్తో తిప్పుతూ..ఇంకోడు గొడుగు పట్టుకొని ! అదే ఏ ఆగష్టు అయితే జండాలు పట్టుకొని ..ఒకళ్ళు ..వాళ్ళ చాదస్తం కాకపోతే కార్ లో వెళ్ళే వాళ్ళు ఆగిన ఆ మూడు నిమిషాల్లో ఎన్ని పెన్నులు కొనుక్కొని వేల్తారు...వీళ్ళు సరే ఓ రకం..వీళ్ళతో పాటు మన ముష్టి వారు కుడా అద్దాలు చరిచి మరి అడుగుతారు..
వాళ్ళు అడిగేప్పుడు పెట్టె దీనమైన మొహం తాలుకు భావాలూ చూస్తే పది పదిహేను మంది కమల హసన్లు కలిసి నటించి నట్టుగా వుంటుంది..ఒక్క సారి సిగ్నల్ మారిందో ..తు అనుకోని వెళ్ళిపోతారు మన దగ్గరనుంచి.. అది పరిస్థితి .పొరపాటున జాలి పడి ఏ రూపాయో ఇస్తే ...తిరిగి మోహన కొట్టే మహానుభావులు కుడా లేకుండా పోలేదు..
ఇటు వంటి వారిని చూసి జాలి పడాలో..మన మీద మనమే జాలి పడాలో అర్ధం కాని పరిస్థితి. ..ఆ మధ్య ఒక సిగ్నల్ దగ్గర దువ్వెన కొన్న .. ఇంటికొచ్చి దువ్వుదామని చూస్తే దూరి చావదె....బలవంతం గా అటు ఇటు  తిప్పేసరికి ఉన్న నాలుగు పీచులు ఊడి చచ్చాయి.. ఆ రెండు పీచులు వుంటే నే కాస్త రెండో సారి కాఫీ అయినా ఇస్తోంది మా ఆవిడ... అవి కాస్త ఊడాయి...సెల్ ఫోన్ పెట్టుకునే స్టాండ్ అని ఒకటి అంట గాట్టాడు దాని దుంప తెగ సెల్ ఫోన్ నిలిస్తే గా చొక్కా లో చీమ దూరితే నాట్యం చేసినట్టు ఆడి చస్తోంది..
విష్ణువు ఇంతకుముందు ఎన్ని అవతారాలు ఎత్తినా మనం చూడలేదు...వీళ్ళలోనే విష్ణువు ని కనుక చూసుకుంటే దశావతారాలు కాదు శతావతారాలు చూడొచ్చు..
కృష్ణ కసవరాజు

No comments:

Post a Comment

Pages