ప్రకృతి గుర్తించిన అమ్మ గొప్పతనం - అచ్చంగా తెలుగు

ప్రకృతి గుర్తించిన అమ్మ గొప్పతనం

Share This
ప్రకృతి గుర్తించిన అమ్మ గొప్పతనం
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

సహనం అమ్మను చూసి సిగ్గు పడుతోంది,
ఓపిక అమ్మను చూసి ఉస్సూరంటోంది,
నమ్మకం అమ్మను చూసి నిట్టుర్చుతోంది,
వినయం అమ్మను చూసి వెన్ను వంచుతోంది,
తెలివి అమ్మను చూసి తెల్లబోతోంది,
ప్రేమ అమ్మను చూసి పిచ్చిదవుతోంది,
విశాలత్వం అమ్మను చూసి వెలవెలపోతోంది,
కరుణ అమ్మను చూసి కరిగిపోతోంది.
ఐనా,ఆమె కడుపున పుట్టినవాళ్ళు  మాత్రం, 
ఆమె విలువను గుర్తించలేకపోతున్నారు.
అమ్మ ప్రేమను కీర్తించలేక పోతున్నారు.
ప్రకృతిలోని సద్గుణాలన్నీ అమ్మకి వినయంతో నమస్కరిస్తున్నా,
పిల్లలు మాత్రం తమలోని వికృతాలను  సంస్కరించుకోలేకున్నారు.
పరమాత్ముడు సైతం అమ్మకు విలువనిస్తూఉన్నా,
పాపాత్ములు మాత్రం అమ్మకు శిలువవేస్తున్నారు.
   

No comments:

Post a Comment

Pages