నీకు నేనున్నా - 10 - అచ్చంగా తెలుగు
నీకు నేనున్నా - 10
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com
angulurianjanidevi.com
(జరిగిన కధ: చదువుకునేందుకు హైదరాబాద్ ప్రయాణం అవుతుంటాడు మనోహర్. అతని అక్క కూతురు పద్మ మావయ్యను ఏడిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని, పెద్దల యోచన. పట్నంలో తాను చూసిన ఇంటి ఓనర్ కూతురు మధురిమ మనోహర్ మనసులో ఏదో తియ్యని అలజడిని రేపుతుంది. మధురిమ అక్క చనిపోవడంతో, ఆమె చంటిబిడ్డను పెంచుతూ ఉంటుంది మధురిమ తల్లి. ఒక రోజు బాబును ఆడిస్తున్న మనోహర్ గదికి, బాబును తీసుకోవడానికి వెళ్ళిన మధురిమను చూసి, ఆమె తనకు దక్కలేదన్న అక్కసుతో వారిద్దరికీ సంబంధం ఉందని పుకార్లు పుట్టిస్తాడు హరి. దాంతో పెళ్లి కాన్సిల్ అయిన మధురిమ అనేక అవమానాల పాలు అవుతుంది. గది ఖాళీ చేస్తానన్న మనోహర్ ను వారిస్తుంది మధురిమ తల్లి. మనోహర్, మధురిమ ఇరువురికీ ఒకరిపై ఒకరికి ప్రేమ భావన ఎక్కువౌతూ ఉంటుంది. మధురిమకు పెళ్ళైపోయిందని అబద్ధమాడి, అతని అక్క కూతురైన పద్మతో అతని వివాహం జరిపిస్తుంది అతని తల్లి. అనుకోకుండా మళ్ళీ కలిసిన మనోహర్, మధురిమ పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తుంటారు. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి మళ్ళి వస్తానని చెప్పి వెళ్లి, అనుకోకుండా మనోహర్ కి ఆక్సిడెంట్ అయి కోమాలో ఉండిపోతాడు. దానితో అనాధలైన మధురిమ, బాబులను తనతో తీసుకు వెళ్లి ఆశ్రయమిచ్చి, మధురిమకు ఉద్యోగం ఇప్పిస్తాడు దామోదర్ రెడ్డి. మధురిమతో లేడీస్ హాస్టల్ పెట్టిస్తారు చరణ్, విక్రం . హాస్టల్ లో చేరే ఆడపిల్లల విభిన్న మనస్తత్వాలతో కొత్త సవాళ్ళను ఎదుర్కుంటుంది మధురిమ .)
కాలేజీ వాతావరణం అంతా కొత్త కొత్తగా వుంది అమ్మాయిలకి, పి.జి. కాలేజీలల్లో ర్యాగింగ్ బాగా జరుగుతోంది. ఫ్రెషర్స్ పార్టీ అయ్యేవరకు ఈ ర్యాగింగ్ జరుగుతూనే ఉంటుంది. ర్యాగింగ్ని ఎవరూ తప్పించుకోలేరు.
వర్ష డ్రస్సింగ్, హెయిర్స్టయిల్, అందం చూసి, వాళ్ల సీనియర్స్కి వర్షంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఎక్కువయ్యింది.
“సెల్యూట్” చెయ్యమన్నారు వర్షను సీనియర్స్ . వర్ష చెయ్యనంది పైగా పొగరుగా సమాధానం చెప్పింది.వర్ష ఎప్పుడైనా అంతే దేనికీ భయపడదు. ఎవర్నీ లెక్కచెయ్యదు. తిక్కరేగింది వాళ్ల సీనియర్స్కి, ఫలితంగా వర్ష చుట్టూ చేరారు సీనియర్స్అమ్మాయిలంతా చుట్టూ చేరడంతో ఊపిరి ఆడలేదు వర్ష కి.
" వర్షచేత కాలేజీ స్టెప్సన్నీ వరసగా లెక్కపెట్టించారు. ఒక పెద్ద బుక్ చేతికిచ్చి, అందులో పేజీలన్నీ కౌంట్ చేస్తూ నెంబర్స్ నోట్ చేసి చూపమన్నారు. సర్ నేమ్స్ తో సహా క్లాస్మేట్స్ బయోడేటా రాసుకురమ్మన్నారు. ఒక చాక్ పీస్ తో మీద పైకి, క్రిందకి గీతలు గీయమన్నారు. ఆ గీతాలు పైకిపోతే నవ్వాలి. క్రిందకి వెళ్తే ఏడ్చాలి అన్నారు. ఇది మరీ కష్టంగా అన్పించింది వర్షకి. నవ్వీ, ఏడ్చి బుగ్గలు నొప్పులొచ్చాయి. స్టెప్స్ అన్ని లెక్కపెట్టి కాళ్ల నొప్పలొచ్చాయి.
“ఓకె, ఇప్పటికి నిన్ను వదిలేస్తున్నాం. రేపటి నుండి మేం కన్పించి నపుడు గుడ్మాణింగ్ చెప్పాలి. ప్రతి ఒక్కసీనియర్కి ఇండివిడ్యువల్గా చెప్పాలి. వూరికే చెప్పటం కాదు. ఒక చెయ్యికట్టుకొని, ఒక చెయ్యిలేపి మరీ చెప్పాలి. ఎక్కడ కన్పించినా మేడం అని పిలవాలి. కాలేజీ లెక్చరర్స్ ముందు మాత్రం మమ్మల్ని మేడం అని పిలవద్దు. గుర్తుంచుకో అంది వాళ్లలో ఒక సీనియర్.
"ఓ.కె." అంది వర్ష. అంతటితో వర్షను వదిలేసారు సీనియర్స్.
అక్కడ నుండి కోపంగా నడుచుకుంటూ వస్తున్న వర్షను అబ్బాయిలు పిలిచారు. ఆ అబ్బాయిలు కూడా వర్ష సీనియర్సే. అసలే కోపంగా వున్న వర్ష వాళ్లలా పిలవగానే గుడ్లరిమి చూసూ నిలబడింది.
“ఏంటా చూపు? సీనియర్లకి గుడ్మాణింగ్ చెప్పాలని తెలియదా? అంటూ ఒక స్టెప్ మీద కూర్చుని వున్న సీనియర్ లేవబోయాడు.
“కూర్చో ఎందుకు లేస్తావ్ ఇప్పడే కొత్తగా వచ్చింది కదా! నెమ్మదిగా నేర్పుకుందాం" అంటూ ఆ అబ్బాయిని కూర్చోబెట్టి, వాళ్లు కూడా అక్కడే కూర్చున్నారు. వర్ష నిలబడింది.
నీ స్కూలు ప్రైమరీ నుండి ఇప్పటివరకు సెల్స్ ఇంట్రడక్షన్ చెప్పు. తెలుగులో చెప్పు” అన్నారు సీనియర్లు.
“నా స్కూల్ ….” అంటూ చెప్పటం మొదలుపెట్టింది వర్ష.
స్కూలేంటి మళ్ళీ ఇంగ్లీష్లో చెబుతున్నావ్ మేం చెప్పమంది తెలుగులో. ఎంత ఇంగ్లీష్ మీడియం చదివితే మాత్రం తెలుగు రాదా? మీ ఇంట్లోవాళ్లు నీకు తెలుగు నేర్పలేదా? నువ్వండేది ఆంధ్రప్రదేశ్లో కాదా?" అన్నారు అందరు వాళ్ళలా అనగానే అనుమానంగా ఫీలయింది. ఈసారి ఇంగ్లీష్ దొర్లకుండా చెప్పింది వర్ష.
"ఈ డ్రస్సేంటమ్మా! ఇంత టైటిఫిట్గా వుంది. పైకి కన్పించవు గాని నీలో చాలా టెక్సిక్ వుంది" అన్నాడో సీనియర్.
“టెక్నిక్కా... ." అంది వర్ష అర్థం కానట్లు ముఖం పెట్టి
“అవును. టెక్సిక్కే ఈ టైటిఫిట్ డ్రస్ తో మమ్మల్ని రెచ్చగొట్టి మేం కార్చే సొంగంతా చూసి ఆనందించడమే టెక్నీక్. ఇది వెధవ ఎవరైనా వున్నార్రా మనలో... .” అంటూ అందరివైపు చూశాడు సీనియర్.
వర్ష మాట్లాడలేదు. చూస్తూ నిలబడింది.
వీడొక చెత్తగాడ్రా! ర్యాగింగ్ చెయ్యమంటే గీతోపదేశం చేస్తున్నాడు. మాటలతో రేపు మారిపోయి హాఫ్ శారీ కట్టుకొచ్చిందనుకో . నాలాంటివాళ్ల గతేంటి? అంటూ గొణిగాడు ఇంకో సీనియర్.
వెళ్లమ్మా! వెళ్లు చూడలేక చచ్చిపోతున్నాం" అన్నాడు వారిలో వెనగ్గా కూర్చుని వున్న ఒక సీనియర్.
నీకిదేం పోయేకాలంరా! సినిమాల్లో అయితే టికెట్ కొని మరీ చూస్తావ్ ఇపుడింత ఫ్రీగా చూడమని దగ్గరకొస్తే వెళ్లమంటావ్? అన్నాడు ముందు గొణిగిన సీనియర్.
“సినిమాలో అయితే చూస్తాం కాని, మరీ ఇంత ప్రాక్టికల్గా నా వల్ల కాదురా!" అన్నాడా సీనియర్
వాళ్లలా అంటుంటే అవమాన భారంతో క్రుంగిపోయింది వర్ష వాళ్ల మాటలు అంత బలంగా తాకాయి. క్లాసుకెళ్లకుండా హాస్టల్ కెల్లింది.
కాలేజీల కెళ్లిన అమ్మాయిలు సాయంత్రం హాస్టల్ కి వచ్చేంతవరకు ఏడుసూనే వుంది వర్ష, గట్టిగా కళ్లు తుడుచుకుంటూ సైలెంట్గా ఏడుస్తున్న వర్షను వాళ్ళ రూం మేట్స్ అంతా ఓదార్చారు. అయినాఏడుపు ఆగలేదు.
అమ్మాయిలంతా కాలేజీల నుండి హాస్టల్కి వచ్చాక, ఒకసారి వెళ్లి పలకరిస్తుంది మధురిమ, అందరి దగ్గరకెళ్లినట్లే వర్ష దగ్గరకి కూడా వెళ్లింది. వర్ష ఏడుస్తుంటే హోమ్ సిక్ అనుకొంది మధురిమ.
"ఎందుకేడుస్తున్నావ్ వర్షా ఏం జరిగింది? మమ్మీ, డాడీ గుర్తొచ్చారా?” అంటూ మృదువుగా అడిగింది మధురిమ.
వర్ష పలకలేదు.
"అబ్బాయిలు కామెంట్స్ చేశారట మేడమ్!" అంటూ వర్ష రూం మేట్ చెప్పింది. వర్ష ఏడుస్తుంటే ఏం చేయాలో అర్థంకాక దిండుని ఒళ్ళో పెట్టుకొని వర్షనే చూస్తూ కూర్చుంది మేధ.
"కామెంట్స్ అనేవి నేచురల్ వర్షా! అవి మా కాలేజీ రోజుల్లో కూడా ఉండేవి. మరీ ఇంట సెన్సిటివ్ గా ఫీల్ అయ్యి ఏడవకూడదు” అంది మధురిమ.
కళ్ళు గట్టిగా తుడుచుకుంటూ మధురిమ వైపు చూసింది వర్ష.
“అదికాదు మేడమ్! మా హైదరాబాద్లో ఎక్కువగా ఇలాంటి డ్రెస్ లనే వేసుకుంటాం. ఇందులో తప్పేముంది? మరీ సెన్స్ లేకుండా వాళ్ళు నా డ్రెస్ ని కామెంట్ చేశారు. అందుకే ఏడుపొస్తుంది” అంటూ ఏకధారగా కారుతున్న కన్నీళ్లను మళ్ళీ గట్టిగా తుడుచుకుంది. ఆ కన్నీళ్లు ఎంత ఆపుదామనుకున్నా ఆగటం లేదు. కన్నీళ్ల విషయంలో వర్షది వాళ్ళ అమ్మమ్మ పోలిక.
అప్పుడే కొత్తగా చూస్తున్న దానిలా వర్ష వేసుకున్న డ్రెస్ వైపు పరిశీలనగా చూసింది మధురిమ.
“హైద్రాబాద్ కి, వరంగల్ కి తేడా వుంది వర్షా! ప్రస్తుతం మనం ఉండే ప్రదేశాన్ని బట్టి డ్రెస్ లు వేసుకోవాలి. నువ్వు చుడీదార్లు, సెల్వార్లు వేసుకో చక్కగా ఉంటావు. అప్పుడు నీ సీనియర్లే కాదు ఏ అబ్బాయి నీ జోలికి రాడు. వీలైనంత త్వరగా నీ గెటప్ మార్చుకొని, నువ్వు సెన్స్ గా ఉండు. వాళ్ళ సెన్స్ లో వాళ్ళుంటారు. నీకీ న్యూసెన్స్ తప్పుతుంది” అంటూ అక్కడ నుండి కదిలి. వేరే బ్లాక్ కి వెళ్ళింది మధురిమ.
మధురిమ మాటలు వర్ష తలమీద సుత్తితో గట్టిగా కొట్టినట్లు అయ్యాయి మధురిమ వెళ్లిన వైపు కసిగా చూస్తూ కూర్చుంది వర్ష.
ఇంట్లోమాడాడీ కూడా ఇంతే నేను ఫ్రీగా హ్యాపీగా కళ్ళలో నిప్పలు పోసుకున్నట్టు చిందులు వేస్తాడు. తెలియకుండా రెండో అడుగు వేయడానికి వెయ్యటానికి లేదు. మారోజుల్లో ఇలా ఉండేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం అని లెక్చర్షిస్తాడు. అది భరించలేకనే నేను హైదరాబాదులో వున్నన్ని రోజులు ఇంట్లో ఉండేదాన్ని కాదు. ఇంటర్నెట్ కెళ్ళి కూర్చునేదాన్ని” వర్ష. వర్ష మాటలకి వాళ్ల రూంమేట్స్ ఆశ్చర్యపోతూ చూశారు.
“ఇంటర్నెట్కి వెళ్లేదానివా! నీకు చాటింగ్ చెయ్యటం వచ్చా?" అంటూ ఆసక్తిగా వర్షవైపు చూస్తూ ఒకమ్మాయి అడిగింది. ఆ అమ్మాయికి చాటింగ్ చెయ్యటమంటే పర్వతాన్ని ఎక్కుతున్నంత బాధ.
“ఓ నాకెప్పడో వచ్చు. ఏం నీకు రాదా? చాటింగ్ చెయ్యటమంత డెడ్ ఈజీ ఇంకొకటి లేదు. నీకు ఇంకొక విషయం తెలుసా? చాటింగ్ కొత్త కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అలా నాకు పరిచయమైన వాడే రాణా! రాణాది వరంగల్. కిట్స్ కాలేజీలో బి. ఫార్మసీ చేస్తున్నాడు. నన్ను వరంగల్ వచ్చి బి.టెక్ చెయ్యమని రాణా చెబితేనే వచ్చాను. నేను హైదరాబాదులో వున్నన్ని రోజులు రోజూ నాకు చాటింగ్లో మంచిమంచి కొటేషన్స్, గ్రీటింగ్స్ పంపేవాడు" అంది వర్ష.
నోరెళ్లబెట్టి వింటోందా అమ్మాయి. ఆ అమ్మాయిది ఘన్ పూర్ దగ్గర చిన్న పల్లెటూరు. ఇంటర్ వరకు పెద్దపెండ్యాలలో చేసింది. ఎంసెట్లో మంచి ర్యాంకు రావటంతో ప్రస్తుతం బి.టెక్ చేస్తోంది. ఆ అమ్మాయి చదివేది కూడా వర్ష చదివే కాలేజిలోనే.
నిన్న నేను బయటకెళ్లింది కూడా రాణాతోనే. రాణా తన బైక్ మీద నన్ను సుప్రభాకి తీసికెళ్లి తినిపించాడు. ఆ హోటల్ నాకు బాగా నచ్చింది" అంది వర్ష
"హోటల్ కెళ్ళావా! నిన్నమేడమ్తో అబద్దం చెప్పి బయటకెళ్లింది రాణాతో తిరగటానికా ఇది తెలిస్తే మేడమ్ నిన్ను హాస్టల్లో వుండనిస్తుందా! అమ్మో!" అంటూ షాక్ తిన్న దానిలా చూసిందా అమ్మాయి.
ఆ అమ్మాయికి ఇలాంటి విషయాలు వినాలన్నా ఇది మీకు తెలుసా! అంటూ తను విన్న విషయాన్ని ఇతరులతో చెప్పాలన్నా చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటుంది. అదీకాక తనువిన్న విషయాలను ఆ బ్లాకంతా తిరిగి చెప్పి వస్తేనే తిండి తింటుంది. లేకుంటే పాస్టింగ్ వున్నదానిలా తిండిమానేస్తుంది. అదీ ఆ అమ్మాయిలో వుండే స్పెషల్ క్వాలిటీ. ఆశ్చర్యపోతూ వర్షనే చూస్తున్న ఆ అమ్మాయివైపు క్యాజువల్గా చూసింది వర్ష.
“రాణాతో బయటకెత్తే తప్పేంటి? నేను మా హైదరాబాదులో వున్నప్పుడు కూడా రాణా వరంగల్ నుండి వచ్చి మా డాడీకి తెలియకుండా బయట తిప్పేవాడు. ఇప్పడు కూడా నన్ను అలాగే తీసికెళ్లాడు. ఏమో బాబూ! ఇంట్లో మాడాడీ నస క్లాసులకన్నా, ఈ హాస్టల్లో ఈ మధురిమ గారి నస క్లాసులే నాకు బోర్ కొడుతున్నాయి. ఈ హాస్టల్లో యింకా నాకు ఎన్ని బాధలున్నాయో, గాడ్ నోస్" అంటూ ఆ రూంలో అందరమ్మాయిలు వినేలా గట్టిగా చెప్పింది.
మధురిమ తనని సెన్స్ గా వుండమందన్న కోపంతో బాత్రూంలో కెళ్ళి అన్ని టాప్లు ఆన్చేసి వచ్చింది. టాంకుల్లో నీళ్ళాన్ని అయిపోయాయి. కరెంట్ పోయింది.
అమ్మాయిలంతా మధురిమ దగ్గరికి వెళ్లి బాత్ రూమ్ లో నీళ్లు రావడం లేదని కంప్లయింట్ చేశారు. అంతకుముందే మోటర్ ఆన్ చేసి ట్యాంకులన్నీ నింపి పెట్టింది. నీళ్లన్నీ ఏమయ్యాయో అరం కాలేదు. ఆమెకు టెన్షన్ పెరిగింది. ఆమె అలా టెన్షన్ పడుతుంటే హాపీగా ఫీల్ అయ్యింది వర్ష.
రూమ్ మేట్స్ అందరిముందు తనని సెన్స్ లేని దానిలా నిరూపించిన మధురిమ మాటలు వర్ష మెదడును తొలచివేస్తున్నాయి. ఆ పురుగును చంపేదాకా తన బాధ తగ్గదు. తనెంత బాధను అనుభవిస్తుందో మధురిమా కూడా అంత బాధను అనుభవించాలి. ప్రతీకారం తీర్చుకోవటంలో వర్షాది అందెవేసిన చెయ్యి.
రాత్రి డిన్నర్ టైం లో కావాలనే పెరుగు క్యాన్ కింద పడేసింది వర్ష. నేలపాలైన పెరుగువైపు చూస్తూ అయ్యో ఇప్పుడే తినాలి? అనుకున్నారు అమ్మాయిలంతా. క్యాన్ క్రిందపడ్డ కప్పుడు విని మధురిమ తన రూంలో నుండి బయటకు వచ్చింది. ఆమె రూంకి ముందే మెస్ ఉంటుంది. మధురిమను చూడగానే నిర్లక్షంగా తలా ఎగరేసింది వర్ష. వర్షను చూడగానే ఎలర్జీ అన్పించింది మధురిమకు.
క్రింద పడ్డ పెరుగు అంటా టైల్స్ నిండా అంటుకొని, కాలు పెడితే జారే విధంగా వుంది. అదంతా చదవటానికి పనిపిల్ల లేదు. ఇంటికెళ్లింది. ఎలాగైనా అది తుడవకపోతే అమ్మాయిలు క్రింద పడతారు. నేల మీద పడిన పెరుగు అంటా ఓపికగా తుడిచింది మధురిమ. ఆమె అలా వంగి నేల అంత తుడుస్తుంటే సంబరంగా వుంది
వర్షకి. సెన్స్ లేదని, తొక్కలేదని అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకున్నావ్ అనుభవించు" అన్నట్లుగా మధురిమ వైపు చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయింది వర్ష.
రాత్రి పదిన్నర దాటాక మళ్లీ మెస్లోకి వచ్చింది వర్ష అప్పటికే తన రూంలో పడుకొని నిద్రపోతోంది మధురిమ, కసిగా ఆ రూంవైపు చూస్తూ మనసులో మధురిమను తిట్టుకొంది వర్ష ఎంత తిట్టినా వర్ష మనసులో మంట చల్లారలేదు. వర్ష వాటర్ బాటిల్స్ నిండా నీళ్లు పట్టుకొంది. అక్కడే నిలబడి కొన్ని నీళ్ల త్రాగింది. వెళ్ళూ వెళూ కావాలనే వాటర్ ఫిల్టర్ల టాప్లు ఆన్చేసి వెళ్లింది. డోర్ పెట్టుకొని నిద్రపోతున్న మధురిమకు వాటర్ క్రిందపోతున్న చప్పడు విన్పించలేదు.
*****
మధురిమ తెల్లవారి నిద్రలేచి, డోర్ తీయగానే మెస్సంతా నీళ్లతో నిండి వుంది. అది చూడగానే ఆమె గుండె జారిపోయింది. ఇది వర్ష పనే అనుకొంది. ప్పనిపిల్ల ఇంకా రాలేదు. అమ్మాయిలంతా తీ త్రాగటానికి మెస్ లోకి వస్తున్నారు. వెంటనే మెస్ అంతా తుడవడం మధురిమ పని అయింది. తన పనులతోనే సతమతమవుతున్న మధురిమకి ఈ ఎక్సట్రా పనుల వాళ్ళ ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. చికాకు ఎక్కువ అవుతోంది.
అందరితోటి టీ త్రాగటానికి వచ్చిన వర్ష, మెస్సంతా అదిరిపోయే పెద్దఎత్తున గొడవ చేసింది. నిన్నటి నుండి మధురిమ అంటే వర్షకి భయం, గౌరవం లేకుండా అయింది. క్షణక్షణం గొడవపడటానికి సిద్ధమవుతోంది.
"ఇది టీలా లేదు మేడమ్! ఎంత త్రాగుదామన్నా త్రాగలేకపోతున్నాను. మరి ఇంత చెత్తలా టీ వుంటుందని ఇంతవరకు నాకు తెలియదు. కొంచెం కూడా టేస్ట్లేదు పాడులేదు. ఎలా త్రాగుతున్నారో వీళ్లంతా" అంటూ టీ త్రాగుతున్న అమ్మాయిలవైపు చూస్తూ, మధురిమకు దగ్గరగా వెళ్లి స్థిరంగా నిలబడింది వర్ష.
వింతగా చూసింది మధురిమ. నిజానికి టీ బాగుంది. ఆమె కూడా త్రాగింది.
"వేరే కుక్ని పెట్టండి మేడమ్! రాత్రి సాంబారు కూడా బాగాలేదు. చట్నీలో సాల్ట్ ఎక్కువైంది. కర్రీకూడా అలాగేవుంది. నేనసలు ఈ హాస్టల్లో తిండి తినలేకపోతున్నాను. మరీ యింత ఘోరంగా వుంటుందనుకోలేదు. మేం డబ్బులు కడుతున్నాం. అది గుర్తుంచుకోండి!" అంటూ అందరు వినేలా గట్టిగా అరిచింది వర్ష. మెస్ లోకి వచ్చిన అమ్మాయిలంతా వినీ విననట్లు వెళ్లిపోతున్నారు. ఎవరూ పట్టించుకోవటం లేదు.
“సరే! వర్షా! కుక్ తో చెబుతాను. జాగ్రత్తగా వండమని" అంది మధురిమ. జారిపోతున్న సహనాన్ని కూడగట్టుకొని.
మీరలాగే అంటారు. ఏదీ సరిగ్గా పట్టించుకోరు. మొన్న రాత్రి తిందామని మెస్ లోకి వస్తే అన్నం లేదు. పెరుగు లేదు. మా ప్లేస్ లో మీరుండి చూడండి! మా బాధేంటో మీకర్దమవుతుంది. మా పెద్దవాళ్లు మీ మీద నమ్మకం తోనే కదా మమ్మల్ని వదిలేసి వెళ్లారు . మాట్లాడరేం?" అంటూ మధురిమను నిలదీస్తున్నట్లుగా అడిగింది వర్ష.
వర్ష మాటలు పైనబడి కొట్టినట్లే అనిపిస్తున్నాయి. ఆ హాస్టల్ లో ఎప్పుడూ ఉంటుంది. కానీ వర్ష అలా అపద్దం చెబుతుంటే తలా కొట్టేసినట్లు అయింది మధురిమకు.
“చెప్పండి! ఇప్పుడేంటి మా పరిస్థితి? మీరు సమాధానం చెప్పకపోతే మా పేరెంట్స్ ని పిలిపిస్తాం” అంది బెదిరిస్తున్నట్లుగా వర్ష. మధురిమా మౌనం చూసి మరింత రెచ్చిపోతుంది.
“నీకు ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పటానికి నా దగ్గర మాటలు లేవు వర్షా! నేను తర్వాత ఆలోచించి నీతో మాట్లాడతాను” అంది సీరియస్ గా మధురిమ.
వెళ్ళిపోయింది వర్ష.
****
మధురిమ ఆలోచిస్తూ వెళ్లి బాల్కానీలో నిలబడింది. ఆమె ఎప్పడైనా ఆలోచించాలంటే చాలాసేపు ఒంటరిగా వుంటుంది. సరైన నిర్ణయం దొరికేదాక అలాగే వుంటుంది. అప్పడే ఆమె ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. మనోహర్ దూరమైనప్పటి నుండి ఆమె చేస్తున్న పని అదే. ఒంటరిగా ఆమె చేస్తున్న ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు. ఎన్నో ఆటుపోట్ల ఎంతో పని ఒత్తిడి ఆ ప్రయాణంలో శాటిస్ఫాక్షన్ వున్నా లేకున్నా తప్పనిసరిగా చేయవలసిన ఓటి పడవ ప్రయాణం ఆమెది.
ఆ రాత్రి కూడా వర్ష గురించే ఆలోచిస్తూ పడుకొంది మధురిమ, వర్ష తనని కావాలని పెడ్తున్న టార్బర్ చూస్తుంటే భయంగా వుంది మధురిమకి చులకన చేసి మాట్లాడుతున్న ఆ మాటల్ని తట్టుకోలేకపోతుంది. ఏ టైంలో ఏం మాట్లాడుతుందోనని బెదురుగా వుంది. ఎలాగైనా దీనికి పరిష్కారం ఆలోచించాలి. అయినా ఈ సమస్యలన్నీ అలల్లాంటివి. ఈ అలలకి బెదిరిపోకూడదు. సముద్రపు గట్టులా తట్టుకోవాలి. అని తనకి తనే ధైర్యం చెప్పకొని నిద్రలోకి జారుకొంది మధురిమ.

అర్ధరాత్రి దాటాక ఎవరో తలుపుకొడుతున్న చప్పడు విని వులిక్కిపడి నిద్రలేచింది మధురిమ, కళ్లు నులుముకుంటూ తలుపుతీసి, ఎదురుగా వున్న వర్షను చూసి షాకయ్యింది.
"ఏం జరిగింది? ఈ టైంలో వచ్చావ్?" అంటూ కంగారుగా వర్షవైపు చూస్తూ అడిగింది మధురిమ.
“నా సెల్ ఫోన్ కన్పించట్లేదు మేడమ్! మా బ్లాక్ లో ఎవరూ తీయలేదంతున్నారు. మీరొకసారి వచ్చి అందర్ని చెక్ చేయండి! దాని కాస్ట్ టెన్ తవుజండ్. మా మమ్మీకి తెలిస్తే తిడుతుంది. మా డాడీకి తెలిస్తే మీమీద కేసు వేస్తాడు” అంది వర్ష.
ఈ అమ్మాయితో తనకేంటి ఈ తలనొప్పి అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. వర్షను చూస్తుంటే వదిలేలాలేదు. మొండిగా అక్కడేనిలబడింది. తనిప్పుడు వెళ్ళి ఎవరినని చెక్ చేయాలి? అలా చెక్ చేయడం మధురిమకు ఇష్టం లేదు.
సెల్ఫోన్ పోకముందే జాగ్రత్తగా వుండాలి. పోయిన వస్తువు దొరకదు. నేను వచ్చి చెక్చేస్తే అమ్మాయిలు ఫీలవుతారు" అంది మధురిమ. "అమ్మాయిలు ఫీలవుతారని వదిలేస్తే ఆ సెల్ఫోన్ కాస్ట్ మీరు కట్టవలసి వస్తుంది. నాకు సెల్ఫోన్ అయినా దొరకాలి. లేదా డబ్బన్నా కట్టాలి? అంది వర్ష .
"నేనెందుకు కడతాను ? "మీరు కట్టకపోతే మా క్లాసు అబ్బాయిల్ని పిలుస్తాను. వాళ్లు ఈ హాస్టల్కి వచ్చి, మీచేత డబ్బు ఎలా కట్టించాలో చెబుతారు" అంటూ బెదిరించింది వర్ష.
“చూడు వర్షా! నీ అజాగ్రత్త వల్ల నీ సెల్ పోయింది. ఆ సెల్ఫోన్ వున్నన్ని రోజులు నువ్వే దాన్ని వాడుకున్నావ్ అదిప్పడు పోయింది కదాని నన్ను డబ్బులు అడుగుతున్నావ్. మీ క్లాసు అబ్బాయిలు వచ్చి నన్ను డబ్బులు అడిగినంత మాత్రాన నేను ఇస్తానని అనుకుంటున్నావా?” కాస్త గట్టిగానే అంది మధురిమ.
"ఎక్కడో పొతే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను. మీ హాస్టల్లో పోయింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ ఇంత సెక్యూరిటీ లేకుండా వుంటుందని నేను అనుకోలేదు. మీరింత బాధ్యత లేకుండా మాట్లాడతారని కూడానేను అనుకోలేదు" అంది వర్ష
"నా బాధ్యతలేంటో నాకు బాగా తెలుసు. అది నువ్వు గుర్తుచెయ్యనవసరం లేదు. ముందు మీ రూం కి వెళదాం పద అంటూ వర్షను తీసుకొని వర్ష రూం కెళ్లింది మధురిమ.
“నీ నెంబరు చెప్ప?" అంటూ వర్ష వైపు చూసింది మధురిమ. వర్ష నెంబరు చెబుతుంటే తన సెల్ఫోన్లోంచి వర్ష సెల్ కి రింగ్ చేసింది మధురిమ,
వెంటనే వర్ష బ్యాగ్లో వున్న వర్ష సెల్ఫోన్ రింగ్ అయ్యింది. రింగ్ విని అందరూ వర్ష బ్యాగ్ వైపు చూసి ఆశ్చర్యపోయారు. స్విచ్ ఆఫ్ చేసిపెట్టిన తన సెల్ఫోన్ ఎలా రింగయిందో అర్థంకాక వర్ష కూడా ఆశ్చర్యపోతూ తన బ్యాగ్ వైపు చూసింది. వర్షముఖంలో నెత్తురు చుక్కలేకుండా అయ్యింది.
"వర్ష సెల్ వర్ష బ్యాగులోనే వుంది మేడమ్! తన సెల్ తన బ్యాగులోనే పెట్టుకొని, ఇప్పటివరకు మా బ్యాగులన్నీ చెక్ చేసింది. అందర్నీ టెన్షన్ పెట్టింది" అంటూ అక్కడున్న అమ్మాయిలంతా కోపంగా అన్నారు. షేమ్ గా అన్పించి తల దించుకొంది వర్ష
"నీ బ్యాగులోనే నీ సెల్ఫోన్ పెట్టుకొని అందర్నియిలా బ్లేమ్ చెయ్యటం దేనికి? మాతో ఆడుకోవటానికి ఈ టైమే దొరికిందా?" అంటూ సీరియస్గా వర్ష ముఖంలోకి చూసి వెళ్లిపోయింది మధురిమ, వంచిన తల ఎత్తలేదు వర్ష వాళ్ల ముఖాల్లోకి చూడాలంటేనే సిగ్గుగా వుంది. మధురిమను టార్చర్ పెట్టాలని కష్టపడి ప్లాన్ చేసుకుంటే ఆ టార్పరేదో తనకే చుట్టుకున్నట్లు అయింది.
మేధ మీద అనుమానం వచ్చింది వర్ష కి.
"నా బ్యాగ్లో పెట్టుకున్న నా సెల్ఫోన్ని స్విచ్ ఆన్ చేసిపెట్టింది నువ్వే కదూ!” అంటూ అక్కడే వున్న మేధను అడిగింది వర్ష.
“అవును. నేనే నీ సెల్ఫోన్ని నీకు తెలియకుండా స్వేచ్ ఆన్చేసి పెట్టాను. నువ్వు చేసింది తప్పు. నేను చేసింది తప్పు కాదు" అంది మేధ.
"తప్పొప్పలు కాదు ఇప్పడు కావలసింది. నా ప్లానంతా పాడుచేసి పెట్టావు. నీ అంత ఇడియట్ ఇండియాలోనే లేదు” అంది వర్ష.
"ఇడియట్ని నేనుకాదు. నువ్వు. మేడమ్ నిన్నేం చేసింది? డ్రన్ సెన్స్ నేర్చుకోమంది అంతేకదా! ఆ మాత్రానికే ఆవిడ వెంట పిచ్చికుక్కలా పడ్డావ్! ఘోరంగా టార్చర్పెడుతున్నావ్! ఈ పాపం వూరికే పోదు నీకు. నీకు నిజంగా సెన్స్ వుంటే ఈ టైంలో మేడమ్ని నిద్రలేపి డిస్ట్రబ్ చేసేదానివి కాదు” అంది మేధ.
"మేధా! నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావ్ మేడమ్ ని వెనకేసుకొస్తున్నావ్!" అంది వర్ష.
"వెనకేసుకురావడమే కాదు. ఇకముందు ఈ హాస్టల్లో నీ ఆటల సాగవని చెబుతున్నా. మాటకు ముందు డబ్బు కడుతున్నాం అంటూ మేడమ్ మీదికి పోతున్నావ్ డబ్బు కట్టకపోతే ఎక్కడెక్కడనుండో వచ్చిన మనందరికి ఈ షెల్టర్ ఎలా వస్తుంది? సెక్యూరిటీ ఎవరిస్తారు? ఫెసిలిటీస్ ఎవరు కల్పిస్తారు? ఫుడ్, బెడ్ ఎలా దొరుకుతాయ్? ఒక్కటి గుర్తుంచుకో. నువ్వు డబ్బు కడుతున్నావు కాబట్టే మేడం నీకు ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేస్తున్నారు. ఇక్కడ మనకు అందే సర్వీసంతా మనం కట్టే డబ్బుతోనే ముడిపడి వుంది. ఇంకెపూడూ డబ్బు ప్రసక్తి తీసుకురాకు అంది మేధ.
హాస్టల్ పెట్టకముందు నుండి కూడా మధురిమ మేధకి తెలుసు. వాళ్ల విక్రమ్ అన్నయ్య మధురిమ గురించి ఇంట్లో చెపుండేవాడు.
"నా ఫ్రెండ్ వి అయి వుండి నువ్వే ఇలా మాట్లాడతావా? ఈ హాస్టల్లో నేనుండను. తొక్కలో హాస్టల్, తొక్కలో ఫ్రెండ్స్ ఒక యూనిటీ లేదు. పాడూలేదు. ఇక్కడుండే వాళ్లంతా మేడం తొత్తులు. ఏం ఫెసిలిటీస్ వున్నాయని ఇక్కడ? ఒక్క ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు. బట్టలు వుతుక్కోటానికి ప్లేసులేదు. ఆరేసుకోటానికి తీగల్లేవు. చేతులు వాష్ చేసుకోటానికి బేసిన్లు లేవు. ఏదీ టైంకు అందదు. నా బెడ్ కైతే గాలేరాదు. ఈ తొక్కలో బెడ్ కి అకామిడేషన్ బిల్గొకటి" అంటూ తన బెడ్ కేసి ఓ తన్ను తన్నింది వర్ష.
అప్పటికప్పుడే తన లగేజి మొత్తం సర్టేసుకుంది వర్ష.
“ఏంటి! లగేజి మొత్తం ఇప్పడే సర్టేసుకున్నాన్! ఇంత రాత్రివేళ బయటకి వెళతావా?” అడిగింది మేధ.
“వెళ్ళాలన్న వీలుకాదు. క్రిందో పెద్ద తాళం వేస్తారు. బోడితాళం. ఎవడిక్కావాలో ఈ సెక్యూరిటీ. నాకైతే ఈ హాస్టల్ ఏమాత్రం నచ్చలేదు. దోమల కుడుతున్నాయ్! ఇక్కడో క్షణం కూడా ఉండను. తెల్లారగానే వెళ్ళిపోతాను." అంటూ బెడ్ పై పడుకొని, టక్కున దుప్పటి కప్పుకోండి వర్ష.
వర్ష ఎంత త్వరగా వెళ్ళిపోతే ఆ హాస్టల్ అంత ప్రశాంతంగా ఉంటుందనిపించింది మేధకి. రాణాతో వర్ష తిరుగుతుందన్న విషయం తెలిసినప్పటి నుండి, ఆ రూమ్ లో వుండే అమ్మాయిలకి వర్షంటే మంచి ఇంప్రెషన్ లేదు. హాస్టల్ వెకేట్ చేస్తానని వర్ష లగేజి సర్దుకోవడం చూసి ఆ అమ్మాయిలు సంతోషించారు.
*****
(సశేషం)

No comments:

Post a Comment

Pages