మనసులు కలవాలి - అచ్చంగా తెలుగు
మనసులు కలవాలి
- పి.వి.ఆర్. గోపీనాథ్

"సుశీలా ఎందుకమ్మా అట్లా ఉన్నావ్?” “ఏం లేదత్తయ్యా. బాగానే ఉన్నానే...” “నలతగా ఉన్నట్లు కనబడతున్నట్లుంటేనూ...” “రాత్రి సినిమాకు వెళ్ళాం కదా, నిద్ర చాలకేమో...” “సర్లే. తేడా ఉందనిపిస్తే డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్దామనే...” ఆ మాట వినగానే మనసెందుకో బాధగా మూలిగింది సుశీలకు. సంభాషణ మరి పొడిగించలేక గదిలోకి వెళ్ళిపోయింది. సరస్వతమ్మగారు కూడా అప్పటికి మౌనం పాటించడమే మంచిదనుకున్నారు. ఆ తర్వత కొడుకు సురేశ్ ను కదిలిస్తే అతనూ ఏం చెప్పలేకపోయాడు. మరి అతను అడిగినా సుశీల ఏం లేదనే చెప్పిందాయె. గమనిస్తున్న రమణయ్యగారు కూడా కోడలి గురించి భార్య దగ్గర ప్రస్తావించారే కానీ సమాదానం దొరక్క అప్పటికి ఊరుకున్నారు. ఓ రెండు రోజులు చూసి ఇక ఆగలేక, “అమ్మాయి బెంగ పెట్టుకుందేమో, కాకినాడ పంపరాదా ఓ నాల్రోజులు ఉండి వస్తుందీ”...కొడుకుతో అన్నారు సరస్వతమ్మా, రమణయ్యగారు కూడా. తనను అడిగి చెప్తానన్నాడు. కానీ, అందరూ ఊహించినట్లుగానే సుశీల కాదనేసింది. తరచుగా వెళితే బాగుండదన్నది. ఫరవాలేదని ఎలాగో ఒప్పించి, ఆ తర్వాత వియ్యాలవారితో మాట్లాడి మరీ సుశీలను సురేశ్ వెంట కాకినాడ పంపించారు. ఆఫీసుకు సెలవు దొరకదంటూ అతను తిరిగి విజయవాడ వచ్చేసిన తర్వాత సుశీల మాత్రం ఓ మూడు రోజులుండి వచ్చింది. అప్పుడే వచ్చేసేవేమిటన్న భర్తా అత్తా మామలకు చిరునవ్వే జవాబయింది.
ఉన్నఊరిలోనే పాలిటెక్నిక్ లెక్చరరుగా ఉద్యోగం రావడంతో అతను భార్యతోపాటు తల్లిదండ్రులతోనే సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. కూతురు లక్ష్మీ, అల్లుడు రమాకాంత్ ఇంజనీరింగ్ చదివి బెంగుళూరులో స్థిరపడ్డారు. రమాకాంత్ కు తోబుట్టువులెవరూ లేకపోవడంతో అతని తల్లిదండ్రులూ అతని దగ్గరే ఉంటున్నారు. కాగా, సుశీలకు ఒక్క చెల్లాయి మాత్రమే ఉండి ఆమె కూడా దూరాన చెన్నైలో ఉంటూండటంతో ఆమె తల్లిదండ్రులు కూతురింట గడపలేక, బాష తెలియని రాష్ట్రంలో ఉండలేమంటూ కాకినాడలోనే ఉంటున్నారు.
***
క్యాలెండరులో మూడు కాగితాలు వెనక్కు పోయిన తర్వాత, ఓ రోజు.. పేపరు చూస్తున్న రమణయ్యగారితో... “లక్ష్మిని చూసి చాలా కాలమైనట్లుంది కదండీ?” “అదేంటీ. మొన్న ఉగాదికే ఇద్దరూ వచ్చి వెళ్ళారూ, కావాలంటే వచ్చే నెలలో పిలిపిస్తాలే. అతనికీ సెలవులిస్తారుగా...” “మంచి ఆలోచనే. కానీ అతనికి ఇక్కడేం తోస్తుందండీ?” “అదీ నిజమే.మరేం చేద్దామో నువ్వే చెప్పూ, మనసులో ఏదో పెట్టుకుని పైకి ఇంకేదో మాట్లాడితే ఎట్లా?” “ఆఁ. అన్నీ నేనే చెప్పాలేం..” కొంటెగా నవ్విందావిడ... అర్థమయీ కానట్లు చూసిన రమణయ్యగారు ఇంకేదో అనే లోగానే సరస్వతమ్మగారు లేచి వంటింట్లోకి నడిచారు.గదిలోనే ఉన్న సురేశూ, సుశీలా మొహాలు చూసుకున్నారేగానీ, వారికీ ఏం జరగబోతున్నదో బోధపడలేదు.ఇప్పుడు జరగబోయేది చెప్పాలంటే ముందుగా కొంచెం వెనక్కు వెళ్ళాలి.

***
రమణయ్య, సరస్వతమ్మ దంపతులకు ఓ కొడుకూ, కూతురూ. సురేశ్ కు ఉన్నఊరిలోనే పాలిటెక్నిక్ లెక్చరరుగా ఉద్యోగం రావడంతో అతను భార్యతోపాటు తల్లిదండ్రులతోనే సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. కూతురు లక్ష్మీ, అల్లుడు రమాకాంత్ ఇంజనీరింగ్ చదివి బెంగుళూరులో స్థిరపడ్డారు. రమాకాంత్ కు తోబుట్టువులెవరూ లేకపోవడంతో అతని తల్లిదండ్రులూ అతని దగ్గరే ఉంటున్నారు. కాగా, సుశీలకు ఒక్క చెల్లాయి మాత్రమే ఉండి ఆమె కూడా దూరాన చెన్నైలో ఉంటూండటంతో ఆమె తల్లిదండ్రులు కూతురింట గడపలేక, బాష తెలియని రాష్ట్రంలో ఉండలేమంటూ కాకినాడలోనే ఉంటున్నారు.

***
“నువ్వు లోపలకు రావే తల్లీ. ఆటో వాడికి అన్న ఇస్తాడులే డబ్బులూ...”
తల్లి మాట వింటూనే ఒక్క ఉదుటున బయటకు వచ్చారు సురేశూ, సుశీలా. తెల్లవారుతూనే దిగిన లక్ష్మిని చూసి ఆశ్చర్యానందాలతో నోట మాట రాలేదిద్దరికీ. తిరిగి తానే తేరుకున్నట్లుగా...
“ఏంటోయ్ గాలి ఇటు మళ్ళిందీ?” మేలమాడింది సుశీల ఆడపడుచును. “ఏం చేస్తాం. నువ్వు మడిగట్టుకున్నావాయె. మరి నాకు తప్పదుగామ్మా...”
“సర్లే. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక మాట్లాడుకుందాం. రెస్టు తీసుకో...” అనేసి అక్కడి నుంచి కదిలారు సుశీలా, సురేశ్ కూడా.
అదే స్థాయిలో జవాబిచ్చింది లక్ష్మి. నవ్వుతూనే అన్నా కొంచెం నిష్ఠూరం కూడా ధ్వనించినట్లు కనిపించడంతో తానే సర్దుకుని, “అవునూ, లక్ష్మి ఉన్నట్లుండి ఇప్పుడెందుకు వచ్చినట్లూ, నీకేమైనా ఉప్పందిందా?”
“బావుందే నువ్వు చెప్పేదీ, వాళ్లు యాత్రలకు వెళ్ళారని చెప్పి మేం రావాలా, చూసేవారు ఏమనుకుంటారూ? అసలు మీ ఆయన మాత్రం ఎలా ఒప్పుకున్నాడూ? ఇంతకూ ఆయనకు చెప్పావా నువ్వూ?”
మధ్యాహ్నం లంచ్ బ్రేకులో భర్తను కదలేసింది సుశీల ఫోనులోనే. “అదే అర్థం కావడం లేదు.” నిజంగానే వారికి జరుగుతున్నదేమిటో తెలియదు మరి. ఇక్కడ ఇంట్లో మాత్రం పెద్ద గొడవే..... ప్రశ్న వర్షం కురిపించారు రమణయ్యగారూ, సరస్వతమ్మానూ.
“అది కాదురా, వాళ్లు అటుపోగానే మేము రావడం... అదీ వారికి తెలియకుండా...ఏం బాగుంటుంది చెప్పూ...”
“ఏంటమ్మా మీరు మరీనూ... నేనేమో అస్తమానూ రావడం బాగుండదు. మొన్న వదినె కూడా ఇలా వెళ్ళి అలా వచ్చేసిందని మీరే చెబుతుంటిరాయె. అయినా నాకు మాత్రం మిమ్మల్ని దగ్గరుంచుకోవాలని ఉండదా. ఏం, మీకు మాత్రం అలా అనిపించడం లేదా నిజం చెప్పండి...“ రమణయ్యగారలా అనగానే ఆ గొంతులో భావం పసిగట్టింది లక్ష్మి. ఎంతైనా ఆ తల్లిదండ్రుల పిల్లేనాయె. అప్పుడు అసలు సంగతి అక్కడ జరిగిన సంగతి చెప్పుకొచ్చింది. ఏమిటంటే..అచ్చు సుశీల కాకినాడ వెళ్ళి రావడానికి ముందు ఇక్కడ జరిగిన కథే.
“ఎవరా అనేదీ? అయినా వచ్చే వారం మీరు రావడం కోసం మీ అల్లుడుగారే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేరు తెలుసా?”
పర్యవసానంగానే రమాకాంత్ తల్లిదండ్ర్రులు యాత్రల నెపంతో ఓ నెల్లాళ్ళు సెలవు పెట్టారన్నమాట. వినగానే భళ్ళున నవ్వేసిందిసరస్వతమ్మ. తల్లి అంతలా ఎందుకు నవ్వుతోందో అర్థంగాక తెల్ల ముఖం వేసింది లక్ష్మి. “మరి లేకపోతే ఏమిటమ్మా నువ్వనేదీ?ఇప్పుడీ వంకతో మేం వస్తే ఇంకెంత గొడవవుతుందో తెలుసా? అమ్మ నాన్నలను పిలిపించుకోవడం కోసం అత్తా మామలను యాత్ర పేరుతో సాగనంపింది మహా తల్లీ అనరుటే ఇరుగూ పొరుగూ?” అప్పుడు నవ్వడం రమణయ్యగారి వంతయింది. ఉడుక్కుంటున్న లక్ష్మికి అసలు విషయం చెప్పి అన్నా వదినెలక్కూడా చెప్పవదన్నారు.

***
“బావగారూ! మేం గూడా వచ్చేశాం.”
హఠాత్తుగా తన తల్లి దండ్రులు రావడమేమిటో, వారికోసం అత్త మామలు ఎదురు చూడటం ఏమిటో అంతుబట్టక సుశీల తెల్లబోయింది. అంతలోనే అనుమానం రాగా, లక్ష్మి రాకకూ వీరి ఆగమనానికీ లింకు ఏమైనా ఉందేమోనని అనుకుంటూ ఆడపడుచు వంక ప్రశ్నార్థకంగా చూసింది. అది గమనించీ గమనించనట్లు తనలో తను నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచింది లక్ష్మి. సంగతి తెలుసుకోవాలనే కుతూహలంతోనూ, అమ్మావాళ్ళు వచ్చారన్న ఆనందంతోనూ సుశీల ఆఫీసుకు సెలవు పడేసింది. కానీ, ఎంత ప్రయత్నించినా ఎవరూ ఏమీ చెప్పడం లేదు. పైగా రాక రాక వస్తే ఎందుకు వచ్చావని ప్రశ్నేమిటని పెద్దవారు నలుగురూ ఒక్కటైనట్లు కోప్పడుతుంటే ఉడుక్కోవడం తప్ప ఏమీ చేయలేక పోయింది.
“రండి, రండి. మీకోసమే చూస్తున్నాం.”
మద్యాహ్నం భోజనాలైనాక గదిలోకి వెళ్ళినప్పుడు సురేశ్ పలకరించగానే తన తల్లిదండ్రులు వస్తున్నట్లు ముందే చెప్పలేదేమిటని అతడిని ఫోనులోనే నవ్వుతూనే దులిపేద్దామనుకుంది గానీ అతనికి అప్పుడే చెప్పవద్దని అమ్మా, అత్తా కూడా హెచ్చరించడంతో నీకోసం ఓ సర్ ప్రైజ్ ఈవెంట్ ఎదురు చూస్తోంది. వీలైతే త్వరగా రమ్మని చెప్పి ఫోన్ పెట్టేసింది.
***
“అదిరా సంగతీ. అమ్మాయికేమో నీలాగే తనూ తల్లి దండ్రులను దగ్గరుంచుకోవాలని మనసులో పీకుతోంది. అటు చెల్లాయిదీ అదే వరస. మీరంతా ఒకే తరం, పైగా మా పిల్లలేనాయె...
“సరిగ్గా ఇదే సమయానికి లక్ష్మి అత్తగారూ, మామగారూ యాత్రలకు వెళ్తూ మమ్మల్నీ పిలిచారు. అప్పుడు అందరం కలసి ఫోన్లలోనే చర్చించుకుని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ ప్రకారంగా వారు యాత్రలకు వెళ్తారు. మేము అటూ, బావగారూ వాళ్ళు ఇక్కడికీనీ...”
మాకెలాగ తెలుసనకండి. ఆ మాత్రం మనసులు చదవలేనివారమేం కాదుగా. మాకూ చిన్నప్పటి అనుభవాలేగా ఇవీ.”
“ఇప్పుడు నేను చెపుతా బావగారూ!” అందుకున్నారు సుశీల తండ్రి భుజంగరావుగారు.
“మొన్నన పెన్షన్ డబ్బులు అరియర్స్ వచ్చాయి. అల్లుడుగారికీ, అమ్మాయికి ఏమైనా ఏమైనా పెడదామనుకున్నాం. అప్పుడే బావగారు సత్తెకాలపు మనిషాయె. ఏమీ వద్దనీ, హాయిగా తిరిగి రమ్మనీ చెప్పారు. అప్పుడే మాటల మద్యలో బయటపడిందేమిటీ అంటే ఆడ పిల్లలిద్దరికీ కూడా తల్లిదండ్రులను దగ్గరుంచుకోవాలనే కోరిక ఉంది గనుక తీరిస్తే బాగుంటుందని.” ఆయన మాట పూర్తి కాకుండానే తిరిగి రమణయ్య అందుకున్నారు.
వింటూనే ఆనందం పట్టలేక లక్ష్మీ, ఆ ఉదయమే దిగిన రమాకాంత్, సుశీలా, సురేశ్ చప్పట్లు కొట్టారు. అవైన తర్వాత తనదైన ధోరణిలో ...
“కం. మనసులు కలసిన చూడుము మనముననే బాళి పెరిగి మాయమె బాళిన్ తన యనుకొన్నను చాలును తన వారలె లోకమంత తథ్యము మిత్రా...!”
కాబట్టి మనసులు కలవాలి. ఉమ్మడి తనం మన హృదయాలలోనే ఉంటే అంతా మనవారే. అప్పుడు తల్లిదండ్రులు కేవలం కొడుకు దగ్గరే కాదు, కూతురు దగ్గరా ఉండగలరు. ఉండాలి కూడా...!!
(బాళి అనే పదానికి గల అర్థాలలో సంతోషము, బాధ అనేవి కూడా ఉన్నాయి మరి)
***

2 comments:

  1. ఆడపిల్లలకైనా, మగపిల్లలకైనా తల్లిదండ్రుల మీద ప్రేమ ఒక్కటే కదా. భార్యా భర్తలు ఒకరి తల్లిదండ్రులను ఒకరు గౌిరవించుకోవాలి, అభిమానించాలి.

    ReplyDelete
  2. katha alochana prayatnam bagunnaayi.oka pera rendu sarlu vacchindi.varusa kramam kooda atoo itoo ayindi.sarigga choosi prachuriste bagundedi.

    ReplyDelete

Pages