గ్యాస్ .....తుస్స్....... - అచ్చంగా తెలుగు

గ్యాస్ .....తుస్స్.......

Share This
గ్యాస్ .....తుస్స్.......
కృష్ణ కసవరాజు
 చిత్రం: గూగుల్ సౌజన్యంతో 

వామ్మో వాయ్యో అని వొకటే కేకలు బయట ....ఏమైంది అని వాకిట్లో కి వెళ్ళా...పెళ్ళాం మొగుడ్ని చితక బాదుతోంది...చస్తావు ......ఆ పక్కకి వెళ్ళావంటే అని....ఆయన కుర్రో ముర్రో అని మూలుగులు...తుస్స్స్ అని శబ్దం పెద్దగా వస్తోంది అందరు తలా ఓ వైపు పరిగెడుతున్నారు..ఏమైందో అర్ధం కాలేదు ...మాకు ...పక్కింటి అయన గబా గబా వచ్చి కృష్ణ మోహన్ గారు మీరు రండి..గ్యాస్ ఆపడం తెలుసా రండి రండి అని ఆహ్వానిస్తున్నాడు...నీ ఇళ్ళు బంగారం కాను ఎప్పుడైనా గ్యాస్ ఆపండి అని మా ఆవిడ చెప్తే చస్తూ బ్రతుకుతూ వెళ్లి ఎటు తిప్పలో అర్ధం కాక ఏటో తట్టు తిప్పి పరిగెత్తి వచ్చే బాహుబలి ని నేను నాకే చెప్పాడు....మా ఆవిడ అందుకొని ..మా ఆయన కి రాదు ఎవర్నైన పిలవండి అని చెప్పింది..పతిబక్తి..ఏమి చేస్తాం.. మల్లి గోలా...అపార్ట్ మెంట్ తగలడి పోతుంది..సిలిండర్ పెలిపోతోంది ఏదైనా చెయ్యండి అని గోల....ఆ మూల వుండే వ్యక్తి అయితే బట్టలు సర్దుకొని రోడ్ లో ఆగిన ట్రావెల్స్ బస్సు ఎక్కి జంప్..
దొంగలు పడితే పోలీస్ లకి ఫోన్ చెయ్యడం తప్ప మనకి ఎమర్జెన్సీ తెలిసి చావదు ..సరే ఇది ఎమర్జెన్సీ నే కదా అని ధైర్యం చేసి 100 కి ఫోన్ చేశా..ఇక చూసుకోండి...ఎవరు తిప్పారు ..ఎందుకు తిప్పారు అని మొదలెట్టారు....పక్కన గ్యాస్ సంగతేమో గాని...నాకు గ్యాస్ మొదలైంది కడుపులో ఆ ప్రశ్నలకి....మళ్ళా బయట అరుపులు ఓరి దేవుడా ఏవిటి పరీక్షా అనుకున్న....సాకేత్ గాడు మెల్లిగా కిచెన్ తలుపు తీసాడు ....తుస్స్ సౌండ్ ఇంకాస్త పెరిగింది... మల్ల గోల మొదలు ..... ధైర్యం చేసి ఎలా గోల గ్యాస్ ఆపుదామని వెళ్తుంటే....మా ఆవిడ ఆపుతోంది.........మెల్లిగా కిచెన్ చేరుకొని చూస్తే........................................................

గ్యాస్ కాదు నా బుర్రా కాదు.............మాకు మంజీరా వాటర్ వదులుతారు రాత్రి 8 గంటలకి...ఆ కొళాయి ఆపడం మర్చిపోయి తుస్స్ సౌండ్ అది.................అయినా మీ హడావుడి తగలెయ్య...గ్యాస్ వస్తే వాసన రాదు .ఎంతసేపటికి కేకలు పెట్టి పక్కన వాళ్ళని తొయ్యడం తప్ప.......మనం మనవాళ్ళు బాగుండాలి...పక్కింటోడు ఏమైనా పర్లేదు ...అదే బంగారం గని వుంటే తలుపులేసి మరీ తోవ్వుకోరు.....గ్యాస్ లీక్ కాబట్టి ..మిగతావాళ్ళు రావాలి...

ఇలాంటి సందర్భాల్లోనే మనుషుల నిజమైన మనస్తత్వాలు బయట పడతాయి.......పోన్లెండి అంతా మనమంచికే...

***

No comments:

Post a Comment

Pages