అక్షరవనం - అచ్చంగా తెలుగు
అక్షరవనం
సి.ఉమాదేవికవితంటే గుప్పెడు అక్షరాలు వెదజల్లడం కాదు
కథంటే దోసెడు వాక్యాల ఊకదంపుడు కాదు
తరుముకుంటూవచ్చిన మనసుపట్టనన్ని అక్షరాలు
గుండెతలుపు తట్తాయి మనోనేత్రంపై నిలిచి
ఆలోచనల కొలిమిలో అలసివచ్చిన
  మా అక్షరాలకు పుటం పెట్టి, పదును చేసి
అమర్చమంటాయి పాఠకుడి మనోవేదికపై
భావితరాలకు మనసుభాషపై
మమకారపు రుచిని నేర్పమంటాయి
కొలువు తీరిన  సాహితీపుటలు
మన ముంగిట పేర్చబడ్డ అక్షర సోపానాలు
 నేటి తరానికి మమకారం పెంచండి తెలుగు భాషపై
అక్షరవనమంటే సుగ్రంథపరిమళమైన అక్షరపూదోట
ఆఘ్రాణించండి మనసుతో
ప్రాణవాయువునందించండి భాషకు
కారాదు మన మాతృభాష మరో మృతభాష
భాష మనుగడే మన బ్రతుకుజాడ
 ***

No comments:

Post a Comment

Pages