నాకు నచ్చిన మహనీయచిత్రకారుడు (కార్టూనిస్టు), పద్మ విభూషణ్ మారియోమిరండా! - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన మహనీయచిత్రకారుడు (కార్టూనిస్టు), పద్మ విభూషణ్ మారియోమిరండా!

Share This

నాకు నచ్చిన మహనీయచిత్రకారుడు (కార్టూనిస్టు), పద్మ విభూషణ్ మారియోమిరండా!

 శ్రీ రవి భూషణ్ శర్మ కొండూరు,శ్రీమతి ఇందు కిరణ్ కొండూరు
అభిరుచి సారధి ఐతే, అవకాశాలు వాహనం ఐతే, పోటీతత్వము ఇంధనమైతే గెలుపుతధ్యం..” అన్నదినాకు తెలిసిన ఒక వ్యక్తి జీవితంలో అక్షర సత్యం. ఆ వ్యక్తి గురించి చాలా మందితెలుగు వారికి తెలియదు, అట్టి మనిషిని తెలుగు వారికి పరిచయం చేసే ప్రయత్నమే మా యీ వ్యాసము.

మాచిన్న తనంలో, గుంటూరులోఎక్కువ శాతంపాఠశాలలోకేవలం తెలుగు మాత్రమే బోధనా మాధ్యమంగా ఉండేది. మేము చదివిన పాఠశాలలోకూడా అదే పరిస్థితి, దాంతో, మాకు తెలుగు మీద మంచి పట్టు లభించింది. వాస్తవానికిహిందీ, ఇంగ్లీషులురెండూపాఠ్యాంశాలుగాఉన్నా, మాకు పెద్దగా ఇంగ్లీషు, హిందీ వొచ్చేవి కావు. అందుకనిమా నాన్నగారు కేవలం తెలుగు ఒకటే చదివితే కాదని, మాకుహిందీఇంగ్లీషులోకూడా ప్రావీణ్యం రావాలని, అవికూడా బాగానేర్చుకోవాలని, హింది శిక్షణా సంస్థలలో చేర్పించారు.అలాగేఇంగ్లీషులో రాణించటానికిమా నాన్నగారు ఇంగ్లీషు దిన పత్రికలూ, వార పత్రికలూ ఇంటికి తెప్పించి మమ్మల్ని వాటినిచదవమని ప్రోత్సహించేవారు. ఐతేఆ పత్రికల్లో ఉన్నఇంగ్లీషు చదవటంతో పాటు, ఆయా పత్రికల్లో వొచ్చేకొన్నికార్టూనుబొమ్మలు నా దృష్టిని బాగా ఆకట్టుకొనేవి.ఆ బొమ్మలు చూసి, నేను కూడా ఆకార్టూన్బొమ్మలు పోలిన బొమ్మలు వేయటం నేర్చుకున్నాను.ఆ బొమ్మలు చిన్న పిల్లలకు సైతం అర్థం అయ్యేటట్టు, చిన్న పిల్లలను చిత్ర లేఖనం వైపు ఆకర్షితులను చేసేటట్టుఉండేవి.ఆ చిత్రాలు “మారియోమిరండా” అనే కార్టూనిస్ట్ కుంచె నుంచి రూపుదిద్దుకున్న బొమ్మలు.రేపు, అనగామే 2వ తేదీ, మారియోమిరండాజన్మ దినము కావున ఆయన్ని ఇలా గుర్తు చేసుకుంటున్నాను.

షుమారు 90 సంవత్సరాలక్రితం అనగా 1926లో, మే 2వ తేదీన, ముంబాయి నగరానికి తూర్పునరమారమి 200కి.మి. దూరంలో ఉన్న “డయ్యుడామన్”అనే ఊర్లో మారియోమిరండా జన్మించాడు. మారియోమిరండా చాలాచిన్న తనం నుంచి చిత్రకళలో మంచి ప్రావిణ్యాన్ని ప్రదర్శించేవాడుట. ఒకసారిమారియోఇంటి గోడ మీద గీసిన బొమ్మ చూసి మారియోతల్లిచాలా ఆశ్చర్య పడ్డారుట, అంత చిన్న వయసులో కొడుకు చూపిన ప్రతిభకి ముచ్చట పడ్డారుట. చిన్న తనంలో దెన్నీ చూసినా దాన్ని ఇట్టే చిత్రంలో బంధించేవాడుట. ఒక సారి ఇలాగే తను చదువుతున్న స్కూల్లో ఉపాధ్యాయుల బొమ్మలు (కేరికేచుర్లు) గీసి దెబ్బలు కూడాతిన్నాడట. బెంగళూరులో ఉన్నతపాఠశాల చదువులఅనంతరం, బొంబాయిలో బి.ఏ. చదువుపూర్తి చేశాడు.చదువు ముగిసిన తరువాత కొన్ని ప్రముఖమైనపత్రికల్లోఅనగాThe Times of India– టైమ్స్ ఆఫ్ ఇండియా,The Economic Times– ద ఎకనామిక్ టైమ్స్, The Illustrated Weekly of India– ద ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ అఫ్ ఇండియాలలోఎన్నో సంవత్సరాలు పని చేసారు.తనప్రతిభ కారణంగా వివిధ దేశాల్లోని చిత్ర కళాకారులు, ప్రముఖుల పరిచయాలు ఏర్పడ్డాయి. ఆపరిచయాలతో అమెరికా, ఇంగ్లాండ్, ఇటలీ వంటి దేశాలలో తన చిత్రాలనుప్రదర్శించి ఆయా దేశాలలో పనికూడా చేసాడు.తన జీవితానుభవాలను ఎన్నో పుస్తకాలుగావ్రాశాడు, అందులో కొన్ని Life of Mario 1950, Life of Mario 1951, Mario de Miranda, The Life of Mario1949, Mario’s Goa, మరియుMario’s Bombay మొదలగునవి ప్రముఖమైనవి.తనువ్రాసిన పుస్తకాలు, గీసిన బొమ్మలు ఎంతో ప్రాచుర్యం పొందినాయి.తనబొమ్మలలో కొన్ని పాత్రలు, ముఖ్యంగా మహిళలు  (ఉదాహరణకుMiss Nimbupani and Miss Fonseca మొదలగునవి)  బహుళ ప్రజాదరణ పొందాయి.తనుఎంత పెద్ద చిత్రమైనా, ఎంత విలక్షణ చిత్రమైనా, తనపెన్ను లేకపెన్సిల్గానీపైకిఎత్తకుండా ఒకే సారి బొమ్మ మొత్తం గీయటంలో సిద్ధ హస్తుడు. దాంతో,తనబొమ్మలకు ఉన్న గిరాకీ అంతా ఇంత కాదు, తనుగీసిన బొమ్మలు ఉన్న వస్తువులు అంటేగ్రీటింగ్ కార్డులు, ఫోటోఫ్రేములు, దిండ్లు, దుప్పట్లు, చెక్క బొమ్మలు, కీ-చైన్స్, కాఫీకప్పులు,మగ్గులు, డిన్నర్ ప్లేట్స్, చిన్న గిన్నెలు, సెంటు సీసాలు, బ్యాగ్గులు,మొబైల్ ఫోన్ కవర్లు,డెకరేషన్ బల్బులు మొదలగునవివేల రూపాయలకు అమ్ముడు పోతాయి. వీటి వివరాలు మీకు http://www.mariodemiranda.com/ వెబ్ సైట్ లో చూడవచ్చు.తనుగీసిన కొన్ని ప్రఖ్యాతిగణించిన కొన్ని బొమ్మల పేర్లు“బ్రహ్మచారి నివాసగృహము (The bachelor apartment)”– ఇందులో చిత్రకారుడు ఒక బ్రహ్మచారి నివాస గృహములో ఎటువంటి స్థితిగతులు ఉంటాయో అట్టి వాటిని కళ్ళకు కట్టినట్టు మనకు చూపించాడు.“వీధిమూల ఉన్న మనిషి (Man at the corner– మెన్ఎట్ ద కార్నర్)”– ఇదినా అభిమాన చిత్రాలలో ఒకటి, ఇందులో ఒక నల్ల జాతీయుడు వీధి చివర ఒక కూడలిలో నిల్చున్నట్టు గీశారు ఇది వివిధరంగుల చిత్రం (Colour Cartoon). “శివాలయం(Mangeshi Temple– మంగేషి టెంపుల్)” గోవా లోని ఒక గుడి ని చాలా అందంగా రేఖా చిత్రంలో బంధించాడు.“గ్రామీణ బస్సు (Village bus– విలేజ్ బస్సు)” ఇదికూడా నా అభిమాన చిత్రాలలో ఒకటి, ఇందులో గ్రామీణ వాతావరణంలో బస్సు ప్రయాణం కళ్ళకు కట్టినట్టు చూపించాడు చిత్రకారుడు. ఇలా ఎన్నో తనకుంచె నుంచి జాలువారినాయి.

ఇది ఇలా ఉంటె తనుగీసిన కొన్ని బొమ్మలు లక్షలలోఅమ్ముడు పోయాయిఅంటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. అలా అమ్ముడు పోయిన కొన్నిబొమ్మల వివరాలు మనం చూద్దాము.

ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గబొమ్మ, మిరండా2007లో గీసిన బొమ్మ, దీనిపేరు“Balaco Serenade– బలాకో సేరెనాడే” అంటే“ఒక ప్రియుడు తన ప్రేయసి ఇంటి గవాక్షము నుండి, ఒకరాత్రివేళ, పాడుతున్నపాట” అని అర్థము, దీన్నిఆంగ్లములోఅనువాదము చేస్తే“A piece of music sung or played in the open air, typically by a man at night under the window of his lover”. ఈ బొమ్మఅక్షరాల ఐదు లక్షల యాభైవేల రూపాయలకు (Rs. 5,50,000.00/-)అమ్ముడు పోయిందట.ఈ బొమ్మ ప్రత్యేకతలు ఒకటి రెండు కావు, ఈ బొమ్మకి ఉన్న ప్రత్యేకతల జాబితా షుమారు రెండు పేజీలు  వస్తుంది అంటే అతిశయోక్తికాదు. ఈ బొమ్మకి సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు చూద్దాము. ఇందులోపోర్చుగీసువారిభవననిర్మాణశైలిని, అలంకరణ శైలిని, ప్రతిబింబించేవిధంగాఉంటుంది.20-21వ శతాబ్దములో గోవాప్రజల దుస్తుల శైలిని ఇందులో చూడవచ్చు.రాత్రి పూటజరిగిన ఒక సన్నివేశాన్ని కన్నులకు కట్టినట్టు కేవలంనలుపు తెలుపురంగుతోగీశాడు.ఆ బొమ్మ ఇక్కడ చూడండి.
ఇలాంటిదేఇంకో ఉదాహరణ, ఈ బొమ్మపేరు“Boat man smoking pipe– బోట్ మాన్ స్మోకింగ్ పైప్” అంటే“పొగ త్రాగుతున్న ఒకనావికుడు” అని అర్థము. ఈ బొమ్మఅక్షరాల రెండులక్షల డెబ్భైవేల రూపాయలకు (Rs. 2,70,000.00/-)అమ్ముడు పోయిందట.ఈ బొమ్మ ప్రత్యేకతలు కొన్ని చూద్దాము,ఈ బొమ్మను 1975లో అమెరికాలోమిరిండా ఉద్యోగం చేసే రోజుల్లో గీశాడు, ఇది కేవలం రేఖా చిత్రం మాత్రమే, పైనచెప్పిన“Balaco Serenade” బొమ్మలాఎటువంటి అలంకరణలు, అట్టహాసం, ఆర్భాటం లేకుండా సాదాసీదాగా కేవలం రేఖలతో గీసిన బొమ్మ ఇది.మరో విచిత్రం ఏమిటంటే,ఈ బొమ్మలో షుమారుగారేఖలు అన్నీ కలసి ఉండటం చేత పెన్ను, పెన్సిల్ పైకి ఎత్తకుండా ఒకే సారి గీసినట్టు తెలుస్తుంది (అంటే Single Stroke sketch).ఆ బొమ్మ ఇక్కడ చూడండి.
ఇలాంటిదే ఇంకో ఉదాహరణ, ఈ బొమ్మను, మిరండా1970సంవత్సరం చివరలో గీశాడు, దీనిపేరు“Beleaguered Government” అంటే“ఇబ్బందులతో చుట్టుముట్టబడినప్రభుత్వము” అని అర్థము. ఈ బొమ్మఅక్షరాల ఒకలక్ష రూపాయలకు (Rs. 1,00,000.00/-)అమ్ముడు పోయిందట.ఈ బొమ్మలో చిత్రకారుడు,మత విద్వేషాలు, అవినీతి, హింస, కుంభకోణాలు, అరాచకాలు,నేరాలు,ఘోరాలు,శ్రామిక దోపిడీ వంటి అంశాలను, వరదలు,అలనాటి రాజకీయ సంక్షోభం, సామాజికస్థితిని ప్రతిబింబించే విధముగా గీసి పలువురి ప్రసంశలు అందుకున్నాడు.ఆ బొమ్మ ఇక్కడ చూడండి.

ఇలాంటి బొమ్మలు తనకుంచె ద్వారా వొచ్చినవి ఎన్నో ఉన్నాయి. అన్ని బొమ్మలు ఈ వ్యాసములో పెట్టటం కుదరదు కాబట్టి కేవలం కొన్ని మాత్రమే ప్రస్థావన చేయటం జరిగింది. మిగిలిన బొమ్మలు చూడ దలచినవారు ఈ వెబ్ లింకునుhttp://www.mariodemiranda.com/క్లిక్ చేసి చూడ వచ్చు.ఇందులోప్రతిదీ ఒక ఆణిముత్యము అంటే అతిశయోక్తికాదు.

మారియోమిరిండా, డిసెంబరు 11, 2011న తుదిశ్వాస విడచి పెట్టారు, వారి మరణానంతరము, ప్రముఖ పాల పదార్థాల వ్యాపార సంస్థవారు (అముల్) మారియో మృతికి వినూత్న పద్ధతిలో సంతాపం తెలియ పరచారు. ఇందులో అముల్ బేబి, మారియో సృష్టించిన రెండుప్రముఖమహిళాపాత్రలతొ అంటే పైన పేర్కొన్న మిస్ ఫోన్సెకా మరియు మిస్ నిమ్బుపానిలతోకలసి కన్నీటి ధారలతోసంతాపం తెలియచేసేటట్టు చిత్రీకరించారు.

మారియోమిరండా పత్రికారంగానికి, చిత్రలేఖనమునకు, దేశవిదేశాల్లో భారతదేశ ఖ్యాతిని చాటి
చెప్పినందుకు గానూ 2012లోవీరి మరణానంతరము “పద్మ విభూషణ్” బిరుదుతోభారత ప్రభుత్వం గౌరవవించింది.

మాయీ వ్యాసంపెద్దలందరూచదివి, పైన చెప్పిన వెబ్ సైట్ చూసి,తమపిల్లలకుచూపించి. పిల్లకిచిత్ర లేఖనములో ఉన్న ఆసక్తిని, అభిరుచిని, ఆదరించి వారిని ప్రోత్సహించి వారిచేత కూడా మంచి మంచి బొమ్మలు గీయించి వారిలో సృజనాత్మకత పెంచుతూమరొక మారియో మిరండాలా తీర్చి దిద్దుతారు అని ఆసిస్తూ.

మళ్లి ఇంకోవ్యాసముతో మిమ్మల్ని కలుసు కుంటాము అప్పటి వరకు సెలవు.

గమనిక:  ఈ వ్యాసము యొక్క ముఖ్య ఉద్దేశ్యము పద్మ విభూషణ్ మారియో మిరండా గారిని, వారిప్రతిభా పాటవాలను, చిత్రకళను పదిమందికి పరిచయము  చేయటం మాత్రమే. ఈ వ్యాసములోమారియో మిరండా గీసినకొన్నిచిత్ర పటములను ఉపయోగించుట జరిగినది. ఆయా బొమ్మలు పైకాపీ హక్కులు(కాపీ రైట్స్) అసలు హక్కుదార్లకు మాత్రమే చెందుతాయి. వీటిమీదవ్యాసకర్తకు గానీ, ఈ వ్యాసము ప్రచురణ చేసిన ఈ వెబ్ సైట్ వారికి గానీ లేవు. వీటిని ఇక్కడ ఉంచటం ఎవరికైనా అభ్యంతరమైనచో వ్యాసకర్తకు గానీ (PadaKusumaMaala@Gmail.com),వ్యాసము ప్రచురణ చేసిన వెబ్ సైట్ వారికి (contact@acchamgatelugu.com) గానీ సమాచారం అందించిన దీనిని తొలగించేందుకు మేము సిద్ధమని తెలియ చేయుచున్నాము.

ఇట్లు,
రచన: రవీందు కలం నుంచి.
దినము: ఆదివారం 30 ఏప్రిల్ 2017,
సమయం:సాయింత్రం6:00గంటలకు

1 comment:

  1. Today 2nd May is Birthday of legendry artist (Cartoonist) Mariyo Mirinda, our Article got published about him.

    ReplyDelete

Pages