శుశ్రూష - అచ్చంగా తెలుగు

శుశ్రూష

కౌండిన్య  


'మన హెడ్ మాస్టారు గారు రిటైర్ అయ్యారటే' అంది కుముద. 'అవునే, ఆయనలా మళ్ళీ తెలుగు పాఠాలు చెప్పే వాళ్ళు ఇంకెవరూ ఉండరేమో ఇంక ఆ బడిలో' అంది స్నేహ. ‘ఆయనకు సంఘంలో ఇచ్చే గౌరవం బట్టే తెలుస్తుంది ఆయన ఈ బడికి, దానితో పాటు ఊరికి ఎంత సేవ చేసారోనని' అంది రాగ. ‘అవును పాఠాలు చెప్పడమే కాకుండా జీవితంలో ఎనలేని పాఠాలు కూడా నేర్పారు మాస్టారు', అంటూ 'రేపు ఓ సారి వెళ్ళి ఆయనను కలవాలే, మీరు కూడా వస్తారా?' అని అడిగింది కుముద. సరేనన్నారు స్నేహితులు స్నేహ, రాగ తరువాత రోజు మాస్టారు గారింటికి వెళ్ళారు. ‘నమస్తే, మాష్టారు గారు మీ రిటైర్మెంట్ లోకూడా మిమ్మల్ని వదల దలుచుకోలేదు', అంది నవ్వుతూ కుముద. ‘ఫర్వాలేదు తల్లీ, ఏంటి స్నేహములు అందరూ కలిసి ఇటు వచ్చారు', అన్నారు మాస్టారు గారు అటు వరండాలో కుర్చీలో కూర్చుంటూఏమి లేదు మాస్టర్ గారు, ఓ చిన్న సందేహం మిమ్మల్ని అడుగుదామని వచ్చాము', అంది కుముద. ‘పైగా నేను, స్నేహ వేరే ఊరికి వెళ్ళబోతున్నాము దీనికేమో ఆ గోల లేదు', అంటూ రాగ ను వైపు చూపించింది  ‘మా మాటలలో పెద్దయిన తరువాత మీలాగా ఏదో ఒక సేవ చేయాలని చేయాలని ఉంది, కాబట్టి మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాము ‘మీరు చిన్నప్పుడు మాలానే సేవ చేద్దాం ఎపుడైనా అనుకున్నారా?', అని అడిగింది కుముద.  అంతలో మాష్టారు 'నేను చేసింది సేవేనంటారా అంటారా?', అన్నారు చిరునవ్వుతో 'సంఘంలో నలుగురికి పాఠాలు చెబుతూ, సంఘం కోసమే బ్రతికే మీరు మా అందరికీ సేవే చేస్తున్నారని తలుస్తున్నాను మాస్టారు', అంది కుముద.   అవునంటూ కుముద తో ఏకీభవించారు.   'ఏదోనమ్మా, వాళ్ళ నన్ను వెడిపో అనకముందే నేను రిటైర్ అయ్యాను, అదీకాక గవర్నమెంట్ బడిలో తెలుగు భాష అవసరం కూడా లేకుండా పోయింది, ఇంక నాలాంటి వాళ్ళ అవసరం రాదులే తల్లి, నేను ఈ వయసులో చేయవలసినదల్లా కృష్ణా రామా అంటూ ఆ దేముడి సేవే', అని మాస్టారు గారు అంటుండగా ఇంటి లోపలినుండి మాష్టారు గారి భార్య కాఫీ ఆయన చేతికిస్తూ 'ఇంకా బోలెడు వయసు ఉంది మీకు, పీకేస్తే పీకేసారు లేండి తెలుగు మీడియం, ఆ భాష మీద నిజమైన ప్రేమ గలవారు మీ దగ్గరకే వచ్చి మాకు నేర్పించండి అంటారు, సరేనా', అంది కోపం ప్రదర్శిస్తూ. ఆయన ఆ కాఫీ త్రాగుతూ 'అయినా ఇవన్నీ ఎందుకులే, మీరడిగిన దానికి నా అభిప్రాయం చెబుతాను', అంటూ మొదలు పెట్టారు.  'నేను చేసిందల్లా పాఠశాలలో పిల్లలకు స్పూర్తి కలిగించి, ప్రేరణ ఇచ్చానంతే.  నిష్పక్షపాతంగా, మనస్పూర్తిగా ఏ పని చేసినా మనం ఆ వృత్తికి సేవ చేసిన వాళ్ళ మవుతామని నా ఉద్ధేశ్యం, అదీ కాక మీరు ఏ పని చేసినా నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి  కాబట్టి మీరు మీ జీవితాలలో ఏ పని చేయదలుచుకున్నా శ్రద్ధతో, సభ్యతతో, సంస్కారంతో, ధర్మాన్ని కాపాడుతూ సంఘానికి ఎంతో కొంత ఉపయోగపడేలాగా చేస్తే మీరు వద్దన్నా మిమ్మల్ని ఈ సంఘం గౌరవిస్తుంది, ఇదే నేను చెప్పదలుచుకుంది', అంటూ తను చెప్పాలను కున్నది చెప్పేసారు మాస్టారు గారు ’ఇది చాలు మాస్టారు దీని కోసమే మీరు రిటైరైన మొదటి రోజే మిమ్మల్ని కలిసి విసిగించాము చాలా ధన్యవాదాలు మాస్టారూ', అంది కుముద 'సరే సెలవు ఇప్పించండి', అంటూ ముగ్గురూ మాస్టారి కాళ్ళకు నమస్కరించి బయలుదేరారు.  ఇంతలో కుముద కుముద అంటూ పిలుపులు వినబడడంతో తన ఆలోచనలోనుండి తేరుకుంది కుముద ఇది ఇరవై ఏళ్ళ క్రిందట సంఘటన, గిర్రున తిరిగి మళ్ళీ తను ఈ పిలుపుకు లోకంలోని పడింది లేచి అటు వెడుతూ తను చదువుకున్న ఊరికి ఓ సారి మళ్ళీ వెళ్ళాలి అనుకుంది కుముద, కానీ మనసులో తను ఇప్పటి వరకూ ఏ సేవ చేయ గలిగానని అక్కడికి వెళ్ళి మాష్టారు గారిని కలవాలి? చదువు పూర్తి చేసుకొని, పెళ్ళై, పిల్లల్ని కని, అత్తా మామగారిని జాగ్రత్తగా చూసుకుంటూ సామాన్య గృహిణి లాగా గడపడం తప్పా తను ఇంకేమీ చేయలేదు, కానీ ఏదో ఒకటి చేయాలని చిరకాలంగా తన మనసును వేధిస్తున్న తపన మళ్ళీ రగిలింది.  అటు అత్తగారు అడిగిన పని చేస్తున్నా ధ్యాసంతా ఏదో చేయాలన్న వెలితితో ఆ రోజు సాయంత్రం రాగ కు ఫోన్ చేసింది.
కుముద గొంతు విని ప్రాణం లేచి వచ్చింది రాగ కు 'అబ్బా, ఎన్నేళ్ళు అయ్యిందే నీ గొంతు విని, ఇన్నాళ్ళకు గుర్తోచ్చానా', అంటూ అన్నీ సంగతులు గల గలా అడిగేసింది రాగ , స్నేహ గురించి అడిగితే 'అది మనం అనుకున్నట్లే సేవ చేస్తోంది, వైద్య సేవ, వాళ్ళ ఆయన కూడా డాక్టరేనట బోలెడు సంపాదనట, అన్నీ ఊచకోతలే నేమోనే?'  అని నవ్వేసింది 'ఏమి సేవో అందరికీ చిన్నప్పుడు ఏదోచేసేయాలన్న తపన, కానీ పెద్దయిన తరువాత జీవితం ఎటు తీసుకెడుతుందో ఎవరికి తెలీదుముందు సొంత సంగతులు చూసుకోవడంలో జీవితం సగం వెడిపోతుంది,  సేవా లేదు గీవా లేదు ఆ తరువాత సంగతి దేవుడికే వదియేయాలి' అంది నవ్వుతూ రాగ 'మరి నీ సంగతి అని', అడిగింది రాగ ని. తన సంగతి అంతా వివరించింది'మన ముగ్గురిలో నువ్వొక్క దానివే నిజంగా సేవ చేస్తుంది', అంది కుముద'అదేం లేదు నాది బహుశ చిన్నప్పుడే నిశ్చయం అయిపోయింది,  మాస్టారిని కలిసిన తరువాత నా నిశ్చయం కూడా ధృఢ పడింది నేను మా చుట్టాలతన్ని చేసుకున్నాను ఆయన గుడిలో అర్చకుడు. నా ఉద్ధేశ్యంలో ఓ విధంగా అర్చకులు అందరి గురించి ఆ భగవంతుడు ప్రార్థించడంతో మనకు పరోపకారం చేసిన వారే అవుతారని పించింది, అందుకే వెంటనే ఒప్పేసుకున్నాను', అంది 'చాలా మంచి పని చేసావు అయితే మీ ఆయనతో పాటు నువ్వు కూడా భగవంతుడి సేవలో నిమగ్నమై ఉంటావనమాట', అంది కుముద.
'మరీ ఎక్కువ పొగిడేస్తున్నావు, నా సంగతి సరే కానే నువ్వేం చేస్తున్నావు', అని కుముదని అడిగింది'ఇప్పటి వరకూ ఏమీ చేయలేదే', అంటూ తన సంగతులు వివరించి, 'జీవిత సముద్రంలో కొట్టుకు పోయి ఇపుడే ఒడ్డుకు చేరాను, చేరగానే ఏదో చేయాలని పించగానే మాస్టారు గుర్తుకొచ్చారే, అందుకే నీకు చేసాను', 'ఏలా ఉన్నారు? ఆయన సంగతులు ఏమైనా తెలుస్తుంటాయా?', అని అడిగింది కుముద. 'ఈ మధ్య ఏమీ కలవలేదే కానీ బాగానే ఉన్నారని మాత్రం తెలుసు', అంది రాగ. తన మనసు లో మాట చెప్పి తను అనుకున్నది రాబోయే కాలంలో చేయగలిగితే తప్పకుండా వచ్చి నిన్ను, మాస్టారిని కలుస్తానని చెప్పింది కుముద . ఆ రోజు రాత్రి వాళ్ళ ఆయన్ని అడిగింది 'ఏమండి, అమ్మ ఒక్కతే ఉండటం నచ్చడం లేదండి', అంది. 'నాకూ అలానే ఉంది, కానీ ఎన్ని సార్లు నచ్చచెప్పినా ఆవిడకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు కదా', అన్నాడు కుముద వాళ్ళాయన. ‘'అవునండి, అమ్మకు నాన్నగారితో ముడిపడిన ఇల్లు అది, అందుకే ఆయన పోయిన తరువాత కూడా అక్కడ ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకొంటూ ఉంటుంది కానీ మరి ఎక్కడకు రాదు', 'ఒంటరిగా ఉండటం తో సరిగా పోషణ లేక ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటోంది, తోడుగా మనకు కళ్ళ ముందు ఉంటే బావుండేది', అని వాపోయింది. 'పోనీ, నువ్వే ఏదోకటి చెయ్యి'అన్నాడు ఓదార్సుస్తూ వాళ్ళాయన కుముదతో ‘ఓ వారంలో వెళ్ళి అమ్మతో మాట్లాడి వస్తానండి', 'అదీకాక అమ్మలాంటి వారు సంఘంలో చాలా మంది ఉంటారు కాబట్టి వారికి కూడా ఏదో విధంగా సేవ చేయాలని నాకోరిక', అంటూ 'అమ్మతో మాట్లాడి అక్కడ ఇల్లు గనుక అమ్మేసి ఇక్కడ మనింటి దగ్గరలోనే వేరే తీసుకొని, అమ్మలాంటి వారిని కొంతమందిని చేర్చగలిగితే అక్కడ అందరికీ ఏదో రకంగా సేవ చేసే భాగ్యం కలిగితుంది, అమ్మ కూడా మన కళ్ళ ముందు ఉంటుంది'  అంది 'నీ ఉద్ధేశ్యం చాలా మంచిదే కుముద', అన్నాడు 'సరే ఇంక చాలా పొద్దుపోయింది పడుకో', అన్నాడు.
వారం రోజుల తరువాత కుముద పుట్టింటికి బయలుదేరింది. అక్కడ అమ్మ పరిస్తితి చూసి కొంచెం బాధకలిగి కన్నీళ్ళు పెట్టుకుంది. తల్లితో తన ఆలోచన తెలిపి, కాదన వద్దని, ఓ రెండు మూడు నెలలో తను స్వయంగా అన్నీ ఏర్పాటులు చేస్తానని వివరించి తను వచ్చేసింది. కుముద తన ఇంటి దగ్గరలోనే ఇళ్ళు చూడటం మొదలు పెట్టింది, వాళ్ళ నాన్నగారి పేరుతోనే ఓ సేవా సదనం మొదలు పెట్టి ప్రకటనలు వేయించి ఇంకొంతమందిని జత చేయగలిగింది.  కుముద తన తల్లి ని కూడా తీసుకొచ్చి సేవ చేస్తూ ఇంకో నలుగురికి ఉపాధికూడా కలిగించింది. ఇంకొక కొన్ని నెలలు తిరిగగానే నాన్నగారి పేరున మరొకటి స్థాపించడం, దాని మీద పనులతో కొన్ని నెలలు గడిచాయి. ఓ రోజు ప్రశాంతంగా తన చేతుల మీదుగా కుముద తల్లి స్వర్గానికి చేరుకుంది. తల్లి వియోగం వల్ల కొన్ని నెలలు బాధ పడుతూనే ఉంది కుముద. వాళ్ళాయన మాత్రం కుముదని ప్రోత్సహిస్తూ,  తను చేస్తున్న మంచి పనిని పొగుడుతూ, తను చేసే సేవా స్పూర్తిని కొనియాడుతూ, పత్రికలలో తనగూర్చి రాసినవన్నీ గుర్తు చేస్తూ కుముదని ఓదార్చుతూనే ఉన్నాడు. మానవ సేవే మాధవ సేవ అంటారు కాబట్టి కుముద తను వృద్ధులు తల్లి , తండ్రిల సమానులైన వారికి చేస్తున్న సేవకు , దాని వల్ల చుట్టుపక్కలా పెరిగిన గౌరవానికి  పదే పదే కొనియాడాడు కుముదని వాళ్ళాయన.  కొన్ని నెలలు గడిచిన తరువాత కుముదకు ఓ రోజు మాస్టరిని కలవాలని అనిపించింది. రాగ కు ఫోన్ చేసి ఇట్లా వస్తున్నట్లు చెప్పింది.  అక్కడకు చేరుకొని ఇద్దరూ కలిసి మాస్టారుని కలవడానికి వెళ్ళారు. పాపం మాస్టారుని చూసి ఇద్దరూ జాలి పడ్డారు. కొన్ని నెలల క్రితం మాస్టారు గారి భార్య పోవడంతో అన్నేళ్ళు కలిసిఉండిన అనుబంధం వల్ల దిగులు పెట్టుకున్నారుట, ఒంటరితనానికి గురైతున్నారని చెప్పగానే, వెంటనే కుముదకు ఆలోచన తట్టింది. అమ్మ పోయిన తరువాత ఆ గది ఇంకెవ్వరికీ ఇవ్వ దలుచుకోలేదు, కానీ మాస్టారు గారిని చూస్తుంటే తనతో తీసుకొని వెళ్ళాలని పించింది కుముదకు. మాస్టారితో తన చేస్తున్న దానిగురించి అంతా వివరించింది, తనతో తీసుకొనగలిగితే ఆయనకు సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందని రాగ తో కలిసి ఇద్దరూ ఒప్పించారు. రాగ తో కొన్ని రోజులలో మాస్టారు గారిని తీసుకొని వెళ్ళే ప్రయత్నానికి కావలసిన ఏర్పాటులన్నీ చేయిస్తానని చిప్పి వెళ్ళిపోయింది కుముద. కొన్ని రోజుల తరువాత మాస్టారి ఉండే ఇళ్ళు తాళం పెట్టించి రాగ కూడా మాస్టారి తో కుముద దగ్గరకు బయలుదేరింది. కుముద రాగ ని అదే సమయానికి స్నేహ ను కూడా అక్కడకు పిలిపించేలా ఏర్పాటు చేయించింది. అక్కడ మళ్ళీ స్నేహితులు ముగ్గురుని చూసి మాస్టారి మనసు కుదుటపడింది. కుముద చిన్నప్పుడు అనుకున్న విధంగా పట్టుదలతో తను అనుకొన్న విధంగా సేవా సదనాలు స్థాపించి నలుగురికీ తోడ్పడుతూ, కొంత మందికి ఉపాధి కూడా కలిగిస్తూ, సంఘంలో మంచి పేరు తెచ్చుకున్నందుకు స్నేహ కూడా తనకు తోచిని సహాయం చేస్తానని, ఆ సేవలో పాలు పంచుకుంటానని, అలా చేయడం వల్ల అందరి ఆశయాలు నెరవేరతాయని అందరూ సంతోషించారు. కానీ మాష్టారు గారు మాత్రం తను అక్కడ ఉండాలంటే ఓ షరతు కు ముగ్గురు ఒప్పుకోవాలని చెప్పారు. ముగ్గురూ ఆత్రుతగా ఆ షరతు ఏమిటో నని మాస్టారిని అడిగారు. ఆయన తన ఇల్లు కూడా ఇలాంటి అవసరానికే వాడాలని, అది కూడా ఓ సేవా సదనంగా మారుస్తానని హామి ఇచ్చి వీలు నామా గనుక రాయిస్తే తను ఈ సేవా సదనంలో చేరటానికి ఏమాత్రం అభ్యంతరం లేదని చెప్పడంతో కుముదకు కన్నీళ్ళు గిర్రున తిరిగాయి. కుముదని చూసిన రాగ, స్నేహ లకు కూడా కన్నీళ్ళు కార్చారు. కుముద మాష్టారి కాళ్ళకు నమస్కరించి రాగ, స్నేహను మనసారా హత్తుకుంది. మాష్టారు గారు అందరినీ దీవించారు.
*****

No comments:

Post a Comment

Pages