ఆదిశక్తి అవతారం - అచ్చంగా తెలుగు

ఆదిశక్తి అవతారం 

పెమ్మరాజు అశ్విని 



   మన భారతీయ సంప్రదాయం అందులో ను హైందవ సాంప్రదాయం లో స్త్రీ మూర్తులకు అత్యంత ఉన్నత స్థానం  వుంది .గాయత్రీ మాత ,సరస్వతి ,లక్ష్మి వంటి అనేక శక్తీ స్వరూపాలు గా కొలిచి వాళ్ళ దివ్యాశీసులు కోసం దేవాలయాల ముందు పడిగాపులు కాసే భక్తులకి కొదవ లేదు మన దేశం లో.
        ఇక రామాయణం ,మహాభారతం వంటి పురాణాలలో ఒక స్త్రీ మూర్తి ని అవమానించినందుకు మహా యుద్దాలు జరిగి రావణ,దుర్యోధనులకి వారి కుటుంబాల వారికి ఏ గతి పట్టిందో లోకవిదితమే ,అంతే కాదు చరిత్ర లో ఎందరో మహారాజులు తల్లి మాట విని ఎన్నో మహోన్నత మైన పనులు చేసారు జీజా బాయి పెంపకం లో ఛత్రపతి శివాజీ ఎంతటి ధీరుడు గా నిలిచాడో అతను తల్లి కి ఎంత ఉన్నతమైన స్థానం  ఇచ్చారో  మనకి విదితమే,ఇంతేకాక మన తెలుగు రాజు శాతకర్ణి తల్లి పేరుని తన పేరు ముందు పెట్టుకుని ఎంత ఉన్నతమైన స్థానం  ఇచ్చారో , అంతటి  మహోన్నత మైన సంస్కృతీ సంప్రదాయాల లో స్త్రీ ని గౌరవించిన భారతావని లో
 మన దౌర్భాగ్యం ఏంటంటే ఆడవారిని అవమానిస్తే  వారికి పట్టిన గతి కంటే వారెలా స్త్రీ ని వేధించారు అనే అంశమే ప్రజలకి ఆదర్శం అవుతున్నాయి .
      ఇవాళ్టి పరిస్థితులు ఇలా  భిన్నంగా తయారవడం చూస్తుంటే బాధ కలగక మానదు ప్రతి రోజు దేశం లో ఎదో ఒక మూల స్త్రీ మీద అత్యాచారం,దౌర్జన్యం లాంటి వార్తలు మన కళ్లబడక మానదు,ఇంతేగాక అమెరికా వంటి అగ్రరాజ్యాలలో భారతదేశం లో  స్త్రీల కి రక్షణ లేదు అని భారతావని కి వెళ్ళేటప్పుడు నిండైన వస్త్రధారణ తో వెళ్ళమని వారి దేశ స్త్రీలకూ సూచిస్తున్నాయి అంటే పరిస్థితి యెంత దిగజారిందో మనం ఊహించుకోవచ్చు  . 70 ఏళ్ళ స్వతంత్ర భరతమాత ఒడి లో ఇంకా ప్రతి రోజు ఏదో ఒక మూల స్త్రీ మీద మానసిక ,శారీరిక చిత్రవధ కనిపిస్తోంది ,తన మాన మర్యాదలు కాపాడుకునేందుకు ఇంకా తాపత్రయ పడాల్సి వస్తోంది అంటే మన సమాజ విపరీత ధోరణి కాక మరేమిటి ,ఎన్నో రంగాల్లో ముందంజ వేసి ఇంట బయట రాణిస్తున్న కూడా స్త్రీ లు ఇంకా మైనారిటీ వర్గమే .
           ఇంకా ఇన్ని సంవత్సరాలైనా పల్లెలో అందులోను మరి ముఖ్యం గా రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో ఈ రోజుకి బాల్య వివాహాలు ,కన్యాశుల్కం పద్దతి నడుస్తోంది,ఇప్పటికి ఎందరో ఆడవాళ్లు ఇళ్ల లో గృహహింస కి గురవడం విన్న ప్రతిసారి మనసు బాధ తో మూలుగుతుంది .ఆడ వాళ్ళు ఎన్నో రంగాలలో ప్రగతి సాధించిన కూడా ఈనాటికి కొన్ని ఇళ్లలో ఆడపిల్ల పుట్టింది అనగానే నిరాశ పడేవారిని చుస్తే మన ప్రగతి ఏంటో అర్ధం అవుతుంది .  ఇంతే కాదు కొద్దీ గా పాశ్చాత్య వస్త్రధారణ వేసుకున్న అమ్మాయిల  క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడటమే కాక ప్రేమ అని వెంట పడి ఆ అమ్మాయి ని కేవలం అందచందాల బొమ్మగా వారిని భావించే కుర్రాళ్లను చుస్తే ,ఇలాంటి వారికి   వారి ఇంట్లో వున్న తమ తల్లి,సోదరి వంటి స్త్రీ మూర్తులు ఎందుకు గుర్తుకు రారు.
              ఇలాంటో దుస్సంఘటనలు చాలవన్నట్టుగా అగ్గిపుల్ల ,సబ్బుబిళ్ళ దగ్గర నుండి కార్లు ,విమానాల వరకు ఏ వస్తావు అమ్మాకానికి పొడచూపాలంటే   స్త్రీ ని రూపదర్శిని గా వాడుకొని లాభపడుతున్నారు.  అయితే ఇలాంటి అడ్వేర్టీసెమెంట్స్,సినిమాలు ,టీవీ ల లో నటించే మహిళల పట్ల సమాజం లో ఎప్పుడు చిన్న చూపే,వారి గురించి మనకి ఏమి తెలియక పోయిన ఫలానా అమ్మాయి గుణం మంచిది కాదనో,లేదా ఫలానా అతని తో ప్రేమలో ఉందనో మాట్లాడేసుకుంటాము ,అక్కడికి వారేదో మన స్వంత సొత్తు అయినట్టు విమర్శించేస్తాం.
          ఝాన్సీ లక్ష్మి భాయ్ ,రాణి రుద్రమ దేవి వంటి వీర వనితలు రాజ్య పాలన చేసిన మన భారతావని లో ఈ రోజు కి అనేక రంగాలలో స్త్రీలు విజయ బావుటా ఎగురవేస్తున్నారు,వ్యాపార రంగాలలో చందా కొచ్చర్,ఇందిరా నూయి,కిరణ్ మజుమ్దర్ షా వంటి నారీమణులు ,క్రీడా రంగం లో పీవీ సింధు,కోనేరు హంపి,మేరీ కోమ్, కరణం మల్లీశ్వరి వంటి వారు మనదేశ ప్రతిష్ట ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు .
         ఇలాంటి ఎందరో స్ఫూర్తిప్రదాతలైన స్త్రీ మూర్తులలో ఒకరు శ్రీమతి సునీతా కృష్ణన్ ,ఈవిడ ఒక సంఘసేవకురాలు ,ప్రజ్వల అనే సేవ సంస్థ స్థాపించి వ్యభిచార వృత్తిలో కూరుకు పోతున్న యెందరో అమాయక ఆడపిల్లల్ని రక్షించి వారిని తిరిగి మంచి జీవితాన్ని అందించే ఆదర్శవంతమైన కార్యక్రమం చేపడుతున్నారు,ఈ పని చేయడం అంత తేలికైన పని కాదు ఎందరో అసాంఘిక శక్తులని ఎదుర్కొన్నారు,ఈ క్రమం లో ఇప్పటి వరకు సుమారు 14 సార్లు భౌతికంగా దాడులు జరిగాయి,ఇహ బెదిరింపుల కైతే లెక్కలేదు,అయినా ఇటువంటి వాటిని లెక్క చేయక ఆమె చేస్తున్న సేవలకు గాను మదర్ తెరెసా అవార్డు ఫర్ సోషల్ జస్టిస్ ,టాల్ బెర్గ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు ఏ గాక  ,  భారత ప్రభుత్వం 2016 లో  పద్మశ్రీ  కూడా ఇచ్చి గౌరవించింది .
       ఇటువంటి ఎందరో స్ఫూర్తి దాయకమైన మహిళల అడుగు జాడలలో మనం మన భవిష్యత్ తరాలు అడుగులు వేసి స్త్రీ ల పట్ల వున్న చులకన భావాలను తొలగించి ,మన నవ భారత యువత చేత పెద్దబాల శిక్ష చదివించి,అమ్మతనం గురించి తెలిపి భరతమాత మొహాన చిరునవ్వు చూసే ప్రయత్నం చేద్దాం . జై భారతమాత ..
     *****

No comments:

Post a Comment

Pages