విటమిన్ సి లోపాన్ని గుర్తించటము ఎలా? - అచ్చంగా తెలుగు

విటమిన్ సి లోపాన్ని గుర్తించటము ఎలా?

Share This

విటమిన్ సి లోపాన్ని గుర్తించటము ఎలా?

 అంబడిపూడి శ్యామసుందర రావు


అమెరికాలోని ఇల్లినాయిస్ యూనివర్సిటి వారి అధ్యయనములో చాలా మంది అమెరికన్లు విటమిన్ సి లోపముతో భాద పడుతున్నట్లు కనుగొన్నారు. సామాన్యముగా మనము తినే తిండిలో అన్ని పోషకాలు ఉండవలసిన స్తాయిలో తీసుకోకపోవటము వల్ల చాలా మందిలో తీవ్రమైన అనారోగ్య లక్షణాలు బయటపడుతున్నయి. విటమిన్ సి ప్రతి వ్యక్తీ యొక్క ఆరోగ్యానికి చాలా అవసరము విటమిన్ సి ని ఎందుకు తీసుకోవాలో ముందు తెలుసుకుందాము. విటమిన్ సి మంచి శక్తి వంతమైన యాంటి- అక్సిడంట్ .క్యాన్సర్ వ్యాధి రాకుండా నిరోధిస్తుంది. వచ్చినవారిలో క్యాన్సర్ కు వాడే మందులు బాగా పనిచెయ టానికి తోడ్పడుతుంది .గుండె నొప్పి వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది .శరీరములోని ఇన్ఫ్లమేటరీ కండీషన్లను తగ్గిస్తుంది.  కోలాజిన్ తయారీలో తోడ్పడి మంచి ఆరోగ్యవంతమైన చర్మము ఉండేలా చూస్తుంది వయస్సు పై బడటాన్ని ఆలస్యము చేస్తుంది శరీరము ఐరన్ వంటి ఖనిజలవణాలను శోషించుకొనేటట్లు చేస్తుంది . నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనము మన ఆహారములో తప్పనిసరిగా తగినంత స్తాయిలో విటమిన్ సి తీసుకోవాలి.
విటమిన్ సి లోపము వల్ల ముఖ్యముగా స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. చిగుళ్ళనుండి రక్తస్రావము దంతాలు ఊడి పోవటము ఈ వ్యాధి లక్షణాలు .ప్రస్తుతము ఇది సర్వసాధారణము అయింది.  US నేషనల్ హెల్త్ అండ్ నూట్రిషన్ ఎక్సామినేషన్ సర్వే వారు 31%అమెరికా జనాభా తగినంత విటమిన్ సి ని తెలిపారు. మద్యపానము, నిషేదిత మందులు వాడేవారు ,ఎక్కువగా పండ్లు కూరగాయలు తిననివారు,జీర్ణ సంబధిత వ్యాధులతో భాద పడేవారు ధూమపానము ఎక్కువగా చేసేవారిలో,గర్భిణీ స్త్రీలలో,పిల్లలకు పాలిచ్చే తల్లులలో విటమిన్ సి లోపము కనిపిస్తుంది
విటమిన్ సి లోపాన్ని గుర్తించే  లక్షణాలు :-
1. గాయలు ఆలస్యముగా నయం కావటము -  విటమిన్ సి కోలాజిన్ ఏర్పడటానికి దోహద పడుతుంది గాయాలు నయము కావాలి అంటే కోలాజిన్ అవసరము అంతే కాకుండా విటమిన్ సి యాంటి ఆక్సిడెంట్ గా  పనిచేసి వ్యాధి నిరోధకతను పెంచుతుంది  గాయాలు త్వరగా నయము అవుతాయి.
2.చిగుళ్ళ వాపు,దంతాలనుండి -:తక్కువ స్తాయిలో విటమిన్ సి  అందినప్పుడు చిగుళ్ళవాపు లేదా రక్తస్రావము,తరచుగా నోటిలో పుండ్లు కనిపించటము వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి గట్టి దంతాలు, చిగుళ్ళ కోసము విటమిన్ సి చాలా అవసరము.విటమిన్ సి లోపము వల్ల"స్కర్వి' అనే చిగుళ్ళకు సంబందించిన వ్యాధి వస్తుంది .
3. జుట్టు,గోళ్ళు పొడిబారిపోవటము :-మంచి బలమైన గోళ్ళు, మెరిసే జుట్టు ఆరోగ్యవంతుల లక్షణాలు విటమిన్ సి లోపిస్తే గోళ్ళు పెళుసుగా ఉండటము వెంట్రుకల కొసలు చిట్లటము జరుగుతుంది విటమిన్ సి ఐరన్ శొషణలో  పాత్ర వహిస్తుంది.
4. పొడిబారిన,గరుకు,ఎర్రటి చర్మము :-కోలాజిన్ లోపము వల్ల చర్మము గరుకుగాను,పొడిగాను మారుతుంది ఈ పరిస్తితి ని " కెరటొసిస్ పిలారిస్ "అంటారు ఈ పరిస్తితిలో  చేతుల మీద తొడలపైన, పిరుదులపైన గట్టి బుడిపెలు లాంటివి ఏర్పడతాయి .అహారాములో విటమిన్ సి తీసుకోవటమువల్ల చర్మము మృదువుగాను ప్రకాశవంతము గాను ఉంటుంది ముడతలు తగ్గుతాయి. సూర్య రశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుండి రక్షణ కలుగజేస్తుంది.
5. తరచుగా ముక్కునుండి రక్తము  కారటము విటమిన్ సి లోపము వల్ల జరుగుతుంది. ముక్కులోని రక్త నాళాలు విటమిన్ సి లోపమువల్ల బలహీనముగా ఉండి తరచుగా రక్త స్రావాన్ని కలుగజేస్తాయి .కాబట్టి ముక్కు వెంబడి రక్తస్రావము ఉంటే అది విటమిన్ సి లోపమని గ్రహించి సరిజేసుకొండి .
6.వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ మనకు సుక్ష్మ జీవులనుండి రక్షణ కలుగ జేస్తుంది కాబట్టి మన ఆహారములో తగినంత విటమిన్ సి వుంటే వ్యాధి నిరోధక శక్తి బాగుంటుంది విటమిన్ సి లోపము ఉన్నవారికి తరచుగా జలుబు చేయటము మనము గమనిస్తూనే ఉంటాము .
7. ఇన్ఫ్లమేటరీ అర్థరైటిస్ వ్యాధిలో కనిపించే కీళ్ళ వాపు,నొప్పికి కారణము విటమిన్ సి లోపమే 2004లో బ్రిటన్ లో జరిపిన సర్వేలో తెలిసిన విషయము ఏమిటి అంటే విటమిన్ సి తక్కువగా తీసుకొనేవారికి రుమటాయిడ్ అర్థ్రైటిస్ వ్యాది వచ్చే అవకాశము మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
8. త్వరగా అలసిపోవటము, వ్యాకులత (డిప్రషన్)   వంటి లక్షణాలు కూడా విటమిన్ సి లోపమువల్ల సంభవిస్తాయి విటమిన్ సి మానసిక పరిస్తుతులపైన కూదా ప్రభావము చూపుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తెలిసింది.
9. కారణము లేకుండా శరీరము బరువు పెరగటము జరుగుతుంది .విటమిన్ సి లోపము వల్ల నడుము ప్రాంతము లో  క్రొవ్వుపేరుకొని బరువు పెరుగుతారు.తీసుకొనే ఆహారములోని విటమిన్ సి శరీరముచే గ్రహించబడి క్రొవ్వును కరగించటములో పాత్ర వహిస్తుందని  2006లో ఆరిజోనా యునివర్సిటి వారి అధ్యయనము లో తెలిసింది.
10. సాధరణముగా క్రింద పడినప్పుడు చిన్నగాయాలు ఏర్పడి అ ప్రాంతములోని రక్త నాళాలు పగిలి కొంత రక్తము బయటకు వచ్చి ఎర్రటి గడ్డలు ఏర్పడతాయి కాని విటమిన్ సి లోపము ఉన్నప్పుడు చర్మము పైన ఇటువంటి ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి .దీనికి కారణము విటమిన్ సి లోపము వల్ల బలహీనమైన రక్తకేశనాళికలు.
20మంది లావుపాటి ఆడవారిని,మగవారిని 4 వారాల పాటు తక్కువ క్రొవ్వుతో ఉన్నఆహారము,మాములుగా తీసుకోవలసిన విటమిన్ సి పరిమాణములో 67%మాత్రమే ఉన్న ఆహారము మాత్రమే ఇస్తూ మధ్యలో కొంతమందికి అదనముగా 500మిల్లిగ్రాముల విటమిన్ సి మాత్రలను ఇచ్చారు. విటమిన్ సి మాత్రలను అదనముగా తీసుకొనివారిలో రక్తములో క్రొవ్వు ఎక్కువగా చేరటాన్నిగుర్తించారు. మిగిలినవారిలో రక్తములోని విటమిన్ సి క్రొవ్వును 11% ఎక్కువ ఆక్సికరణము చేసింది కాబట్టి వారిలో క్రొవ్వు చేరలేదు. కనుక మనం కూడా విటమిన్ సి విరివిగా లభించే పదార్ధాలను స్వీకరించి లబ్ది పొందుదాం.
*****

No comments:

Post a Comment

Pages