కంప్యూటర్కామెడీ చిప్స్ - అచ్చంగా తెలుగు

కంప్యూటర్కామెడీ చిప్స్

      - ప్రతాప వెంకట సుబ్బారాయుడు



యమనోటీసు

ఇందుమూలంగా సమస్తలోక వాసులకు తెలియజేయడమేమనగా!
యమలోకాన్ని ఆధునీకరించడంలో భాగంగా..పాపుల్ని వేయించే నూనె కడాయిలకు బదులుగా కంప్యూటర్ తో పనిచేసే ఫర్నేస్ లు, హాట్ ఛాంబర్లు ఏర్పాటుచేయడం, వై ఫై కల్పించడం, చిత్రగుప్తుడి చిట్టాను సర్వర్ లో పొందుపరచడం..ఇంతే కాకుండా భటులందరికీ  ల్యాప్ టాప్ లు ఇవ్వడం లాంటివి చేపట్టడం వలన కొన్నాళ్లపాటు యమలోకానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నాం. ఆ సమయంలో మరణాలు వాయిదావేయబడతాయి.
ఈ కంప్యూటరీకరణ బ్రహ్మలోకానికి కూడా వర్తిస్తుంది. అందుచేత జననాలూ వాయిదా వేయబడతాయి. దయచేసి ఎవ్వరూ సంతానసాపల్య కేంద్రాలను దర్శించడం, పుత్రకామేష్టియాగాల్లాంటివి చేయవద్దని మనవి.
*****
భార్య భర్తతో-
"మనబ్బాయి తప్పిపోయిన విషయం మామూలుగా చెపితే వినరని ఫేస్ బుక్ లో పెడితే, జస్ట్ లైక్ కొట్టి అలా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటారేంటండి..ఆఁ"
*****
రాజారావు-
"ఇదివరకే నయం రా..మనం మన పెళ్లాల్ని బజారుకు తీసికెల్లినప్పుడే షాపింగ్ చేసి చేతి చమురు వదిల్చేవారు..ఇప్పుడు ఇంట్లో కూర్చుని హాయిగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తూ..రోజూ తల బొప్పికట్టిస్తున్నారు..వాఁ.."
*****
పెళ్లాంతో మూర్తి-
"రాధా నేనెంత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నయినా..నీ పేరంటానికి ఆన్ లైన్లో ముత్తైదువల్ని పిలిచి,,నీ చేత వాయినాలిప్పించే ప్రోగ్రామ్ రాయలేనే.."
*****

No comments:

Post a Comment

Pages