మౌనం చెల్లిస్తున్న మూల్యం - అచ్చంగా తెలుగు

మౌనం చెల్లిస్తున్న మూల్యం

Share This

మౌనం చెల్లిస్తున్న మూల్యం

రఘోత్తం రెడ్డి పిన్నింటి


పోలీసులపైకి రాళ్ళూ రువ్వడం అయినా
మత మందిరంలో తలుపు విరగడమయినా
ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను చంపడమయినా
సరిహద్దు దాటుతున్న ఉగ్రవాదమైనా
కరెన్సీ నోట్లతో ఏదో ఓ రకంగా కొనుక్కో బడ్డదే

మానవీయ విలువుల మరణం, మనస్సుల మధ్య విద్వేషం
మంచితనపు పరాభవం, నిజాయితీకి నిష్ఠూరం 
నడిబజారులో నిలదీయ బడుతున్న జాతీయ భద్రత
కరెన్సీ నోట్ల కనుసన్నల్లో జరుగుతున్నది నిజం

మనందరి మౌనాన్ని అంగీకారంగా తీసుకొని
ప్రజాస్వామ్యాన్నిపదే పదే చెరబడుతున్న
రకరకాల హక్కుల పోరాటాలయినా
వార్తా పత్రికల్లో రాతలైనా, టీవీ చర్చల్లో అంశాలైనా
కరెన్సీ నోట్ల చే రచింప పడుతున్నవే
  
మనం వేసే ఓటు ని, మనం చేసే ఉద్యోగాన్ని
మనిషిగా చేయవలసిన సహాయాన్ని
ఒక్కో రేటుకు మనల్ని మనమే అమ్ముకుంటున్నాం
అవినీతికి విత్తనాలు వేస్తున్నాం 
మనిషి లో ఉండవలసిన కనీసపు నిజాయితీని
గొంతు నులిమి చంపుకుంటున్నాం
ఉన్నవాడంటే డబ్బు బాగా వున్నవాడు కాదు,
నిజాయితీ కలిగున్నవాడు...
మీరు ఎందులో ఉన్నవారో...లెక్కలు వేసుకోండి

ఎంత సంపాదించాడో అని ఆలోచించకండి
ఎలా సంపాదించాడో ఆలోచించండి
ఎలాగైనా సంపాదించాలనే ఆలోచనని చంపేయండి
మన కులపోడు కాదని పక్కకు పెడతాం
మన మతపోడు కాదని దూరం ఉంచుదాం
అమానుషం గా అంటరాని వాడంటాం
మరి.... అవినీతి పరుడని దూరం ఎందుకు పెట్టలేక పోతున్నాం?

దేశద్రోహం, ఉగ్రవాదం, సాంఘిక అసమానత
దౌర్జన్యం, దురంహంకారం, బలుపు, బరిదేగింపు తనం
అమానుషం ఏదయినా ఏ రూపంలో ఉన్నా
తల్లివేరుమాత్రం.... అవినీతి డబ్బే
దేనిని కట్టడి చెయ్యాలన్నా ,
ముందు పీకివేయాల్సింది ఊతమిచ్చే తల్లివేరునే
నిజాయితీ చాలా విలువైనది...దానిని కాపాడుకుందాం.
****

No comments:

Post a Comment

Pages