***తాదాత్మ్యత ***
--మోపిదేవి భాస్కరరావు
అందమైన ప్రతి అణువూ నీలో ఉంది 
ఈ అజరామర ప్రణయ జగత్తుకు 
తన ప్రతీకవు నీవే అంది .
చూపుల్లో సూర్యచంద్రులు 
ఊర్పుల్లో అగ్ని వాయువులు 
నిడుపాటి కురుల్లో ఇరులూ మరులూ -
నీ గాత్రం కష్టసుఖాల సంకేతం 
నీ మంత్రం సమస్త సౌభాగ్య సంకేతం
స్నేహంలో వసంత పవనాలు 
విరహంలో వడగాడ్పులు 
రాగ రంజిత అధరంలో 
సుధా విప్రుషాలు .
కదిలే కాలంలోని అన్ని కదలికలూ 
నీలో ఉన్నాయి అన్నీ నీవే అన్నాయి.
నీ చిరునవ్వుల సుందర 
నందన వనాల్లో --
నేను మైమరచి విహరించాను 
నీ ఊహో ద్వే గ జలపాత 
మృదంగ ధ్వానాల్లో 
నేను పారవశ్యంతో నర్తించాను .
నీ సౌందర్య పర్వతోన్నత శిఖరాలను 
నేను అద్భుతంగా అధిరోహించాను .
నీ అపార దయా పారావారంలో 
నేను ఆనందంతో అవగాహం పొందాను
నిజం --
నీవున్నదే స కృ త్తు 
నీవు లేనిదేదైనా మృ త్తూ -అసత్తూ -
నా దాహానికి అమృత కలశానివి 
నా ప్రాణానికి సూనృత రూపానివి .
*************************
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment