శివం - 24 - అచ్చంగా తెలుగు

శివం - 24

రాజ కార్తీక్

9290523901

(  శివభక్తుడైన ఉద్భవుడి కధను చెబుతుంటాడు శివుడు..)

"హర హర హర మహాదేవ" అని అందరూ అంటున్నారు..అందరిలో అదే ఆనందం ..భక్తి ఉన్మాదం..ఇదివరకు అంతగా భక్తి  లేని వారు కూడా తన్మయత్వంతో ఓలలలడుతున్నారు..కొంతమంది శరిరం ఊగిపోతుంది..
ఉద్భవుడు మాత్రం తన చేతులు పైకీ ఎత్తి “శంకర శంకర ..సమస్తము నీవే స్వామి.నీవే  సత్యం..స్మరణం.. నీ పదం మాకు శరణం” అని తనకు వీలయిన  అంత తల ఎత్తి నన్నే చూస్తున్నాడు..ప్రజలు అందరూ తమ కళ్ళ వెంట నీరు తుడుచుకుంటున్నారు..అయినా  అవి వస్తూనే  ఉన్నాయ్..కొంతమంది నేల  మీద పడి  దొర్లుతున్నారు..శివ శివ శివ అని అందరూ నన్ను తలుస్తున్నారు..
కొంతమంది “ఏమిటి రా ఇది--- శివయ్య రా దేవుడు ఉన్నాడు రా .మన కళ్ళ ముందు శివయ్య . ఎంతమందికి ఈ భాగ్యం దొరుకుతుంది ..మనందరం కలిసి కైలాసవాసిని చూస్తున్నాము.”అంటూ నృత్యం చేస్తున్నారు.
ప్రజలలో ముందుగా భాగ్యం అన్న వారు “జయ జయ శంకర ”అంటూ ఆనందం లో తన్మయత్వం  పొందుతున్నడు.
ఉద్భవుడు “ఉమాపతి నీవే మా  గతి .కలిగించు మాకు సద్గతి.నీ భక్తీ అసలైన ఉన్నతి .అందుకోనుము మా వినతి ”అంటూ లేచి నా దగ్గరకు వస్తున్నాడు.అటు  పరిగెడుతూ “శివయ్య రావటం కాదు మేము అడిగినంత సేపు ఉండాలి ”అని అంటున్నాడు
అందరు “అవును పరమేశా మీరు వెళ్తానని కనుమరుగు అవ్వగుడదు..ఎన్ని చేసినా మా ఈ నేత్రాలతో నిన్ను ఇలా చూడటం మాకు ఎంతో ఆనందం కలిగించే విషయము.” అన్నారు.
నేను ఒక చిరునవ్వు నవ్వాను..”సరిగ్గా ఒకడు పిలిస్తేనీ నేను వెళ్ళకుండా ఉండలేను ..ఇక ఇంతమంది నన్ను స్మరించి అడుగుతుంటే ఎక్కడికి వెళ్ళగలను”
మంత్రి గారు మాత్రం ఇది అంత చూసి ,"ఉద్భవుడు మనసు అర్ధం ఇప్పుడు ఇప్పుడే అర్ధం చేసుకుంటున్నాడు..తను కట్టివేయబాడటంతో నాకు దణ్ణం పెట్టలేకపోతున్నాడు తను నా వైపు చూస్తూ మనసులో” స్వామి! నీవు కనపడితే కనీసం నమస్కారం చేసుకోలేని చేతులు” అంటూ ఆనందంగా ఏడుస్తున్నాడు ..అతని కట్లు వాటంతట అవే ఊడిపోయాయి.
ఉద్భవుడు నా దగ్గరకు వచ్చాడు.నాకు ప్రదక్షిణాలు చేస్తూ ..”నేనే  శివున్ని దర్శిచింది నేనే ..నాలో నే  శివుడు ..నా తోనే  శివుడు ..నాకోసం శివుడు ”అంటూ ప్రార్ధనలు చేస్తున్నాడు..
ప్రజలు అందరు మూకుమ్మడిగా, “శివ ..కళ్ళు ఉంది నిన్ను చూడటానికే /మనసు ఉంది నిన్ను తలవటానికే  ..మాట ఉంది నీ  జపం చేయుటకే , చేతులు ఉంది నీ అభిషేకం చేయుటకే పాదాలు ఉంది నీ ప్రదక్షిణ లు చేయుటకే ..” అంటూ నన్ను కీర్తిస్తున్నారు.
ఇలా అందరు నన్ను స్మరిస్తుంటే  నాకు ఎంతో ఆనందం వస్తుంది..వర్ణ విభేదాలు లేకుండా అందరు నన్ను జపిస్తున్నారు..
నేను “భక్తులారా మీ కోరిక నెరవేరుస్తాను ..మీ మనసు నాకు తెల్సు ..మీరు అందరు ఇక నుండి పునీతులు అవుతారు .భోగ భాగ్యాలే కాకుండా సత్బుద్ది తో మెలిగి అంతిమంగా  నన్ను చేరుకుంటారు..” అన్నాను.
అందరు "భం భం" అంటూ నృత్యాలు చేస్తున్నారు ...నేను కనపడిన ఆనందం లో వారు చేసే మంచి పని ఏదైనా నాకు ఇష్టమే.
అందరు కోలాహలంగా ఉన్నారు ..
నేను “చెప్పు ఉద్భవా..లింగ ఉద్భవా..నీ భక్తీ తో నన్ను నీ దెగ్గరకు చేర్చుకున్నావు..అంతే కాకుండా మీ రాజ్య ప్రజలందరికి నా దర్శనం ఇప్పించావ్..నీ  ఒక్కడి తపస్సు ఇంత మందిని తరింపచేసింది.”
"ఎందుకు ఇదంతా చేసావో చెప్పు, వీరందరికీ ..భక్తీ మార్గాలలో ఒక విభిన్నమైన  నీ పయనం గురించి చెప్పు," అని అడిగాను నేను.
“స్వామి నేను ఎన్నో గ్రంధాలలో ధ్యానం గురించి చదివాను  ..వాటిలో ఎంతో మంది ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ నువ్వు కనపడలేదు, అలాంటిది ..నేను ఎంత నా బతకు ఎంత, కేవలం వంద వర్షములు కూడా బతకని నేను నిన్ను ఎలా చూడగలను? అని నా  మనసుకు అనిపించింది ..ఎంతో మందిని అడిగి చూసా వారు అందరు "మనసుతో పిలిస్తే మహేశ్వరుడు పక్కనే ఉంటాడు", అని చెప్పారు ..నా  పక్కనె ఉన్న నిన్ను చూసీ జ్ఞాననేత్రాలు నాకు ఎక్కడివి స్వామి, అందుకే ఇదంతా చేశా..”
ప్రజలు అందరు ఒకసారి ఉద్భవుడిని తప్పుగా అనుకున్నందుకు బాధపడ్డారు..
ఉద్భవుడు”స్వామి నీ దూషణ చేయను నన్ను క్షమించు ...” అన్నాడు.
నేను “తప్పు చేసే వారిని క్షమించాలి, కానీ నీవు సత్యవాదము చేశావు సత్యంకు నేను సైతం కట్టుబడి ఉంటాను ”
ఉద్భవుడు “అవును స్వామి ! వినాయకుడ్ని నీవు బ్రతికించినది, గజాననుని చేసింది నీ భక్తుని వరం కోసం ,కుమారుడిని సేనాధిపతి ని చేసింది ,.అందులకే ఆ స్వామి పుట్టాడు కనుక ..అతని జనన కారణం అదే కనుక, నీ మానస పుత్రిక అయిన మానసను దేవ పదవిని ఇవ్వండి అంతకు  తగిన అర్హత లేదు అని మాత్రమే  ”వదిలేసావు.
మంత్రి గారికి ఇప్పుడు గుర్తుకువచ్చింది, తను ఉద్భవుడు మందిరానికి వెళ్ళినప్పుడు "శివ శివ "అని రోదనలు వినపడేవీ..అంతే అతడు అంతరంగిక  మందిరం లో ప్రార్ధన  చేస్తున్నది ?ఇంతకాలం .....
(సశేషం )

No comments:

Post a Comment

Pages