శివం – 23 - అచ్చంగా తెలుగు

శివం – 23

Share This

శివం – 23

(శివుడే చెబుతున్న కధలు )

రాజ కార్తీక్

9290523901

(  శివభక్తుడైన ఉద్భవుడి కధను చెబుతుంటాడు శివుడు..)

ఆకాశవాణి: “నాయనా లింగోద్భవా? అస్తు అస్తు తథాస్తు” అని గట్టిగా వినిపించింది. గాలి వీయడం మానింది, గట్టి చినుకుల తాకిడితో భోరున వర్షం పడింది, ప్రకృతి అంతా అప్పుడే పుట్టిన పాపలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంది. చినుకుల జడికి అందరూ శుభ్రులయ్యారు.
ఉద్భవుడు: మోకాళ్ళ మీద కూర్చొని ‘రావయ్యా...రా..ర..మా రాజ్య ప్రజలను కరుణించు” అని తన్మయత్వంతో ఏడుస్తున్నాడు....
“నేను శివుడ్ని... తప్పక దర్శనమిస్తాను, లింగోద్భవా నీ మనసు నాకు నచ్చింది, నీకు నాయందు ఉన్న ధ్యేయం నన్ను కదిలించింది. భక్తి కన్నా బలమైనది లేదు, భగవంతుడ్ని కదిలించేది అది ఒక్కటే., “ ఆకాశవాణి అంటుంది.
రాజ్యప్రజలు అందరూ నిలచిపోయారు, వారికి ఏమి అర్ధం కావటం లేదు, “నిజంగా మనం శివవాణి విన్నామా?” అని అందరూ అనుకుంటున్నారు, అందులో ఉన్న ఒక వ్యక్తి, అతనె ఇది వరకు ఉద్భవుడికి సభలో నమస్కారం చేసే వ్యక్తి, ఆనందంగా ఆకాశం వైపు చూస్తూ, చేతులు పైకెత్తి నంది వలె కూర్చొన్నాడు, “హరహరమహాదేవా” “భం భం పరమేశ్వరా” అని నినాదాలు చేస్తున్నాడు, అక్కడ ఉన్న ప్రజల సమూహం రాజోద్యోగులు కూడా అందరూ అంటే కూర్చొని నన్ను బిగ్గరగా స్మరిస్తున్నారు. “సరిగ్గా ఒక్కడు పిలిస్తేనే వెళ్లకుండా ఉండలేను, ఇక ఇంతమంది పిలిస్తే ఉండగలనా?”
కట్టిపడేసిన మంత్రి ఎవరైనా నా కట్లు తీయండి అని అరుస్తున్నాడు కానీ, ఎవరి తనమయత్వం వారిదే,
ఉద్భవుడు: “శివయ్యా రావయ్యా ఇంత మంది నీ కోసం పిలుస్తుంటే నీవు రాకుండా ఎలా ఉండగలవు, సాక్షాత్కారించు స్వామి” అని రొద ప్రార్ధన చేస్తున్నాడు. అప్పుడే అక్కడికి పరుగున వచ్చారు జక్కన్న పండితులు, అక్కడ జరుగుతుంది అంతా చూసి ఆయన కూడా ప్రార్ధన మొదలెట్టాడు.
“ఇక ఉద్భవుడి కోరిక తీర్చే సమయం ఆసన్నమయ్యింది.”
నమస్కరించిన వ్యక్తి: శివయ్యా, మరణ సమయంలో నిను తలచిన వారికి ముక్తిని ఇస్తావు కదా, మరణ సమయంలో కూడా నిన్ను తప్ప మరొకరిని స్మరించని ఇందరి భక్తుల కోసం కదలి రావయ్యా” అంటున్నాడు.
ఢంకా శబ్దం....
వేల వేల గంటలు మ్రోగుతున్నాయి....
సూర్యుడి కన్నా చూడగలిగిన తీక్షణమైన కాంతి...
ఓంకారనాదం....
ముందుగా త్రిశూలం...తర్వాత ఢమరుకం..ఇక శంఖం ఆకాశంలో అందరికీ కనబడుతున్నాయి.
అందరూ “పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తున్నాడు” అని ఉన్మాదంగా అరుస్తున్నారు.
తర్వాత జటలు..ఇక పులిచర్మం...
“దేవా...శివశివశివశివహరహరహరహర...
ఇక త్రినేత్రం కనబడుతుంది.
ఉద్భవుడు”శివయ్యా, నీకు రూపం లేదు అని మాకు తెలుసు, కానీ మేమెందరం ఊహించుకునే రూపంలో మాకు కనబడి, మా జనంలను ధన్యం చేయండి” ఇక అవన్నీ ప్రత్యక్షమైన చోట, తీవ్రమైన మంచుపొగ ఏర్పడింది..
ఆ మంచుపొగ మొత్తం ఒక అణువు లాగా అయిపొయింది.
అంతే అందరి కళ్ళ ముందు నేను ప్రసన్నంగా నిల్చొన్న, అదే సాక్షాత్కారం.
ఉద్భవుడు, మంత్రి, జక్కన్న, అందరూ ప్రజలు వారిలో ఆ ఋషి అందరూ మౌనం దాల్చి, తీవ్రమైన తన్మయత్వంతో చూస్తున్నారు.
‘అదే మనిషి ఆత్మ యొక్క యదార్ధ స్థితి, అన్ని ఆత్మలు నావే, అందుకే నేను పరమాత్మను, నా నుంచే జనన మరణాలు, ఎంతటివాడైనా నన్ను దర్శించినంత మాత్రానే తన ఆత్మ యొక్క శక్తితో పునీతమైన యోగ స్థితికి చేరతాడు. అదే స్థితిలో అందరూ తన్మయత్వంతో ఉన్నారు”
నేను “ఉద్భవా! లింగోద్భవా ! భగవంతుడ్ని చేరడానికి ఆ భక్తుడు నిండు మనస్సుతో ఆర్తితో,తృష్ణతో వెతుక్కునే మార్గాలను ఆ భక్తుడి ఆరాధ్య దైవం ఎప్పుడు సమర్ధిస్తాడు. నీవు వెతుక్కునే ఈ మార్గం నన్ను ఎంతో ఆనంద పెట్టింది. నీయొక్క భక్తి మార్గంలో, నీవే కాదు అందరిని తరింప చేశావు, నిజమైన భక్తికి మానసిక ప్రార్ధన ఎంత దోహద పడుతుందో భక్త చరిత్రలో ఇదొక ఉదాహరణ...చెప్పు ఉద్భవా .. నీకు ఇప్పుడు సంతోషమేనా..”
లింగోద్భవుడు “ఆ”.. లేచి చేతులు పైకెత్తి” శంకరా....” అని....
(సశేషం...)

No comments:

Post a Comment

Pages