రాధా కృష్ణుడవై .... - అచ్చంగా తెలుగు

రాధా కృష్ణుడవై ....

Share This

రాధా కృష్ణుడవై ....

తిమ్మన సుజాత 


శేష శయనుడవై సేదతీరూ...
శ్రీలక్ష్మి సేవలందుకుంటున్న విష్నుమూర్తీవే.. ...
దేవకి గర్బాన అష్టమినాడు జన్మించి ...
వసుదేవునెంట యదుకులానికి వలసపోయి
యశోధమ్మ చిన్ని కృష్ణుడవై.....
అల్లారు ముద్దు కన్నయ్యవయినావే.. కృష్ణా..!!
మట్టి తింటున్నావని బ్రమసిన ఆ తల్లికి ముల్లోకాలను...
నీ చిన్నినోట చూపించి ..అండపిండ బ్రహ్మాండాలలోనూ ..
నేనే..సత్యం..నేనే..నిత్యం ..అని ..తెలియజేస్తూ...
ఆ అమ్మ విస్మయానికి కారణమయినావే..కృష్ణా..!
.వెన్నను దొంగలించినిదురించె గోపెమ్మెల పెదవులకు పూసి...
వారింటిలో ..ఒకరితో.. కొకరి తగవులకు కారణమైనావే.కృష్ణా....!!
‘ఇదేమిచోద్యమ్మన్నా!’అని....కోపించిన యశోద
నిను రొటికి బందింఛి నంతనే.....
ఆ రోటిని అవలీలగా లాక్కొని పోయి...
బారెడు చెట్లమద్య దూర్చి...వాటినే కూల్చి ...
శాపవాసమున వృక్ష ములైన గంధర్వులకు ముక్తి నొసగినావే..కృష్ణా..!
శిఖను పించమును ధరించిన శిఖిపించమౌళి..
జలకాలాడు కన్నెల చీరెలెత్తుకెళ్ళి..పొన్న చెట్టు పైన జేరి..
జవాబుగా వారి జీవితాలకు ఆనందమునొసగి
వారి హృదయాలను దొంగలించి.....చోరుడివైనావే..కృష్ణా..!!
రేపల్లెలో గోపాలులతో చేరి...
గోవులను గాస్తూ...వెదురు ముక్కలను
 వేణువుగా చేసికొని..నీ వేలికోసలతో మీటుతూ...
మధుర రవాలు పలికిస్తూ..మురళీధరుడవయినావే...కృష్ణా...
మేనమామయిన కంశుని వధించి తల్లితండ్రుల చెరవిడిపించి
బృందావని చేరి యమున తరగల పాదాలిడి పావనమొనరించి
రాధచెలిమిని పంచుకొంటూ..ఆరాధనలభాగమై రాధాకృష్ణుడవైనావే..కృష్ణా...!!

No comments:

Post a Comment

Pages