ధౌమ్య హితోక్తులు -5 - అచ్చంగా తెలుగు

ధౌమ్య హితోక్తులు -5

Share This

ధౌమ్య హితోక్తులు -5

చెరుకు రామమోహనరావు


11.  అన్ని విషయాలలో అన్ని వ్యవ హారాలలో రాజుకు అనుకూలముగా వుండాలి
రాజుకు అనుకూలముగా వుందటమంటే రాజభక్తి కలిగి యుండుటయే కదా ! నయవంచనకు ఇచట తావు వుండదు. ఈ కథనొకసారి గమనించండి :
ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు  రామలింగడి తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చినాడు.ఆ గంప చాలా బరువుగా ఉంది. రామలింగడు ఆ గంపను తాకి చూసి తాను దానిని కదిలించనుగూడా  కదిలించలేనని అర్థం   చేసుకొన్నాడు. వెంటనే    తన తలపాగాను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణేలను పోసి మూట కట్టినాడు.   తన తలపాగాను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణేలను పోసి మూట కట్టాడు. కొన్ని నాణేలను తన జేబుల్లో నింపుకుని, మూటను చంకకు తగిలించుకొని, గంపను నెత్తిన పెట్టుకుని ఇంటికి బయలుదేరినాడు.
రామలింగడని సమయస్పూర్తికి ఆశ్చర్యపదిన రాజు "శభాష్ రామలింగా! అంటూ మెచ్చుకోసాగినాడు. రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తలవంచి నమస్కరించిన అతని జేబుల్లోని నాణాలు కొన్ని నేలమీద పడిపోయినాయి. వాటి చప్పుడుతో సభంతా నవ్వులతో నిండిపోయింది. గంపను, మూటను కిందపెట్టి రామలింగడు ఆ  నాణెముల కోసం సభంతా వెతకసాగినాడు. పడుతూ, లేస్తూ ఏరుకొంటూ వుంటే తలా ఒకమాట అన్నారు.
రామలింగడు నాణేలన్నీ ఏరిన తర్వాత రాజు "రామలింగా! నీకు గంపెడు నాణేలను ఇచ్చినాను కదా!  మరి ఎందుకింత దురాశ, కిందపడిన కొన్ని నాణేల కోసం వెతికావు? అన్నారు. "రాజా! ఇది దురాశ కాదు, కిందపడిన నాణేలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసి ఉంది కదా! ఇలా అందరూ నడిచే చోటపడి, ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను. కాబట్టే నేను అంత అదుర్దాగా వాటిని ఏరి వేశాను" అని చెప్పడంతో సభంతా మూగబోయింది.
 పై కథ చదివితే రాజభక్తి తో బాటూ సమయస్పూర్తి కూడా రాజసేవలో ఎంత అవసరమో తెలుస్తుంది.
12. రాజుకు ఇష్టము లేని వస్తువును అనుభవించకూడదు
ఈ ధౌమ్య సూక్తులను ఆకళింపు చేసుకొన్న మేధావి కథ చదవండి. దాదాపు రెండు సంవత్సరముల క్రితము ఇది నేను
వ్రాసి ప్రచురించియుండినాను.  ఇప్పుడు క్లుప్తముగా వ్రాయుచున్నాను.ఒక కార్పొరేటు ఆఫీసులో ఒక బాసు(ఒకే బాసు) ఉండినాడు . అతని అనేక మంది అనుచరులలో ఒక మేధావి ఉండినాడు. ఒకరోజు ఎదో పనిమీద బాసు కేబిన్ లోకి వెళ్ళితే ఆయన రమ్మని ఎదుట కూర్చుండబెట్టుకొని , తాను వ్రాస్తూవున్న రేనాల్డు బాలు పెన్నును గూర్చి ఇట్లు చెప్పినాడు " నల్లేరు మీద బండి నడచినట్లు ఎంత మెత్తగా వ్రాస్తుందో ఈ   పెన్ ను చూడు మేధావి' అన్నాడు. అందుకు మేధావి వెంటనే 'సార్ రేనాల్డ్ బాల్ పెన్ నాకు దైవసమానము సార్. మీవద్ద పనిచేసే అదృష్టము నాకు ఆ పెన్ తో పరిక్ష వ్రాయుట చేతనే వచ్చింది ' అన్నాడు.బాసు మహదానంద భరితుడై 'నేను చెప్పే ప్రతి మాటకు నీవద్ద ఒక అనుభవము వుంటుంది,అందుకే నీవంటే నాకిష్టం, అన్నాడు. వేరొక సందర్భములో మేధావి బాస్ రూము లోనికి పోతూనే బాసు తన పెన్నును కాగితము పై గీకి ప్రక్కనున్న చెత్త బుట్టలోకి బలంగా విసిరి, మేధావితో 'ఈ రేనాల్డ్ బాల్ పెన్ కన్నా చెత్తది ఇంకొక పెన్ ఉండదు.' అన్నాడు . వెంటనే మన మేధావి అందుకొని' అంతకంటే హీనమైనది,చండాలమైనది,దరిద్రమైనది,అసహ్యమైనది,
అవసరానికి పనికిరానిది ఇంకొకటి ఉండదు'అన్నాడు. బాసు వెంటనే గతము గుర్తు తెచ్చుకొని 'ఆ రోజు ఆ పెన్నును అంతగా పోగిడితివే'అంటే ' ఆ వెధవ బాల్ పెన్ రాస్తే ఏమి రాయకుంటే ఏమి నాగురించి మీరు బాగా వ్రాసి ప్రోమోషనులు ఇప్పించాలిగానీ' అన్నాడు. విస్తుపోవడము బాస్ వంతైనది.
కావున ఈ సూక్తులను చదివి ఆకళింపు చేసుకొంటే ' మూడు ప్రోమోషనులు ఆరు ఇంక్రిమెంట్లగా' గడిచి పోతుంది.

No comments:

Post a Comment

Pages