కలం చిందులు - అచ్చంగా తెలుగు

కలం చిందులు

Share This

కలం చిందులు

- బ్నిం


దసరా.. అంతకుముందు వినాయక చవితి ...ఈ హడావిడిలో తెలుగు వాళ్ళు ఎవ్వరూ డ్యాన్స్ పాటలకోసం రూపకాలకోసం హడావిడి పెట్టలేదు. హాయిగా పెండింగ్ వర్క్స్ కంప్లీట్ (ఒసోస్... ఆరంబిద్దం అనవచ్చు) చేసేద్దాం అనుకున్నా..
అంతలో ఓ మిత్రత్రయం వచారు. 9 పాటలు రాయాలని గుండెల్లో రాళ్ళు పోయించుకున్నాను. ఓ కొత్త చానల్ లాంచింగ్ ప్రోగ్రాం కి. దానికి కల్చరల్ కో ఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్న ప్రముక సినీ నటులు దైవ సమీత ఎమ్మెస్ నారాయణ గారి అమ్మాయితో మా పాత మిత్రుడు, టీ వీ లో వార్తలు చదివే మంచిగాయకుడు (బాగా పాడతాడు - వార్తల్లో కాదు), ఆ గాయకుడు గారి (బ్.టెక్ అయిపోయిన, కూచిపూడి నర్తిస్తూన్న)  అమ్మాయి, ముగ్గురూ వచ్చారు.
సేం యాజ్ ....నేను హాల్లోకి వెళ్ళకుండా, నా విక్రమార్క సిమ్హాసనాన్ని వీడకుండా ముగ్గుర్నీ నా గదిలో కూరేసాను....కూర్చుండజేసాను.
ఏతావాతా... 9 పాటలు, 'శివశక్తి సాయి ' అనే కొత్త చానల్ ఇనాగరేషన్ కి మూడు దేవుళ్ళూ ఒక బ్యాలే లో ఎలాగో ఇరికించాలి.
''కధ ' ఒండాం!"రెండ్రోజుల తర్వాత ఇస్తాన్లెండి" అని మొదలెట్ట డానికి మొదటి పెర్మిషన్ పేల్చాను.
'అయి పోతుంది - అలా ట్యూన్ చేస్తూ మీ మ్యూజిక్ డైరెక్టర్ ని పాడమనండి .. నేనిలా రాసిస్తాను..' అని 'కధ ' చెప్పి వాళ్ళని సాగనంపాను - అఫ్ కోర్స్.. బ్యాలే కధ కూడా వాగేం అనుకోండి !
వాళ్ళు.. 'అర్జెంట్ గా ! ఆ కధైతే రాసేస్తాన్లే ' అని నిశ్చింతగా వెళ్ళాకా అసలు కధ నాకు మొదలైంది.
ఎప్పటి శివశక్తులు ! ఎప్పటి వాడు షిరిడీ సా(రు)యి !
ఎలా ఎలా ఎలా రాయను? ఆ విషయం మీద చింత అనవసరం. రెండు రోజులు వదిలేయమనాను గా...హ్యాపీ గా ముందున్న చెరువు దాటేసి...ఆ కొండ ఎక్కేయొచ్చు...కొండ గురించి అప్పుడే బెంగ పెట్టు కుంటే చెరువు దాటడం కూడా అవ్వదు..(చిన్నప్పుడు చందమామలు చదివిన ఇంగితం)
ఈ మధ్య బెంగళూరులో ప్రసిద్ధ కూచిపూడి నర్తకి వైజయంతి గారికి.."కన్యాకుమారి " నృత్య రూపకం అఘమేఘాల మెద కంప్లీట్ చేసాను - (అవునండీ..నాకు తెలుసు..ఇది శింజారవం కనుక నాట్యరంగానికి నేను చేస్తున్న అక్షరార్చన గురించే రాస్తున్నాను.నా డైరీ కాను..అదే అయితే మధ్యలో ఏ బొమ్మలేసానో, ఎవరెవర్ని ఇంటికొస్తే భరించానో రాయాలిగా..అవి స్కిప్ చేసాగా)
కన్యాకుమారి ..కధ ఏ పురాణంలో దొరకలేదు..అవిదే అక్కడా ఇక్కడా సేకరించి స్థలపురాణాలు సమీకరించి ఒక లైన్ చెప్పారు. దాని ఏడెనిమిది గంటల ఫోన్ సంభాషణల్లో ఓ కొలిక్కి తెచ్చిమంగళగీతం పాడించాను - నిన్నటిదాకా ఒక వచనం , నాలుగు లైన్ల సాకీ అంటూ...పేచ్ వర్క్లు చేయిస్తూనే ఉన్నారు - నాకు నచ్చాలి కన్విన్స్ అవ్వాలి..ఆమెని కన్విన్స్ చేయాలి. ఇక్కద పెద్ద గండం ఆవిడకి నాకూ..మా ఇద్దరికీ కామన్ లాంగ్వేజి ఇంగ్లీషు..నాకది రాదు...అర్ధమైనా..నా భావాన్నిఅనువధించి ఆవిడకి చెప్పడానికి నా హెడ్ ప్రాణం టెయిల్ కొచ్చేది. మొత్తానికి వాట్సప్ లో, వాయిస్ మెసేజీలతో కొన్ని అండర్ స్టాండింగులకి వచ్చాం.  బాగా వచ్చిందని చివరకి ఆమె తెలుగు లో చెప్పింది. నేను ఇంగ్లీషులో కృతజ్ఞతలు చెప్పాను.
'సుందర భారత తీరపుటంచున
సౌందర్యమ్మే రూపుగట్టిన
అవతరించిన రూపసిని
అవని ధరించిన ఆది శక్తిని.. '
అని రాసిస్తే .. ఆ మాటలు ప్రతిపదార్ధాలు వచ్చీరాని భాషలో వివరించడం - ఆనక ఓపిక పోయి వాట్సప్ వాయిస్ మెసేజీల్లో..12 పాటలూ..నేను రాసిన తాళంలో పాడేసి..ఊపిరి పీల్చుకున్నాకా..చెరువు దాటేశాం! కొండ దగ్గరకి వచ్చేసింది - (ఇది శింజారవమే కనక నా దినచర్య కాదని మనవి)
అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ని వేసుకొని ఆయనో ఎలక్ట్రానిక్ శ్ర్తి పెట్టెతో (కాషియో) వచారు - ఉద్దండ పండితుడే..
ట్యూన్స్ అనుకుంటే మన పాట ఒదగదనీ, రాగాన్ని పట్టుకొని రాస్తానని ఒప్పించాను = బ్యాలే వద్దు, శివుని మెద, శక్తి పైనా, సాయి బాబా మీదా రెండు పాటలు చొప్పున రాసుకొని శివశక్తి మయం సిగ్నేచర్ ట్యూన్ చేస్తే బావుంటుందని, కధ అశాస్త్రీయం అని.. 'దేవుడే దిగివస్తే "సినిమా చేయవద్దని అర్ధించాను. వాళ్ళు హిప్నొటైజ్ అయ్యారు.
'టే' తాగి రమ్మని 15నిమిషాల్లో 10పల్లవులు రాసి రెడీగా ఉంచాను - 10చక్కటిరాగాలు కుదిర్చారు మ్యూజిక్ డైరెక్టర్ నరేంద్ర గారు.
ఆ మర్నాడికి రాసి పంపుతాననే ఒప్పందం తో వాళ్ళు వెళ్ళాకా..దేవుడా..10 పాటలు ఒకే సారి రాస్తే అష్టోత్తరాలు రాయాలా....పైగా డ్యాన్స్ రిథింస్ లోనా???ఎలా...వాళ్ళెళ్ళాకా బెంగ పెట్టుకున్నా. డ్యాన్స్ చేసే కోరియోగ్రాఫర్ ఇంజినీరు 'అంకుల్ పాటైన వెంటనే మెరు పంపిస్తే నేను జతుల్లో కంపోజ్ చేసుకుంటాను...ప్లీజ్ అని హుకుం !! వాళ్ళ పాటలు మొదలెట్టకుండానే దేవుడు నన్ను ఆశీర్వదించేశాడు.
ఎలా...
వాళ్ళు బయటికి వెళ్ళి రెండు గంటల్లో... 'సార్.. మీకు నచ్చిన పల్లవులు తీసుకొని శివ-శక్తి-శాయి ల పై మూడు పాటలు రాయండి చాలు.
హమ్మయ్య (స్వగతం) సరే రెపొద్దున్న తెసుకెళ్ళండి - అనీ - వద్దు మెయిల్ చేస్తా లెండి అన్నాను.
రరి రాయాలి. రాయలేదు - కారణం - నవరాత్రుల గోల- తీన్మార్ పాటలు - మా హైద్రాబాద్ దేవుళ్ళకి ఇష్టం - రిథిం మార్చరు...
మర్నాడు పొద్దున్నే, "మెయిల్ రాలేదు..మళ్ళీ పంపరా" అని ఫోను (పంపక పోతే ఎలా వస్తుంది??)ఓ పని చేస్తాను - నేను మీ అఫీసుకి వచ్చి అకడ రాసిస్తా - నాకు నెట్టు పోయింది - కొత్త కధ చెప్పాను - పాపం నమ్మారు.
12 గంటలకి భోజనం చేసి వెళ్ళి గంటన్నరలో మూడు పాటలు రాసిచ్చాను - పాట వింటూ డ్యాన్స్ అమాయి ముద్రలు వెతుక్కొంటోంది. రాస్తుణ్ణది చొస్తోనే నరేంద్ర గారు ...రాగబద్ధం చేసేసారు - నా పని పూర్తైంది - వేడి వేడిగా మూడు పాటలు పాడి చూసుకున్నారు - ఇది శిజారవం కి సరిపోయింది కదా !
నాచేతి వెంట నాట్య గీతం ఈ రకంగా హింస పెడుతుంది - పడుతుంది ... అని చెప్పడానికి ఈ నెల కేటాయించాను అన్నమాట.
.

No comments:

Post a Comment

Pages