రుద్రాణి రహస్యం – 6 - అచ్చంగా తెలుగు

రుద్రాణి రహస్యం – 6

Share This

రుద్రాణి రహస్యం 6

- వేద సూర్య


(జరిగిన కధ : రుద్రాణి కోనలో ఉన్న శక్తిని వశం చేసుకోవాలని చూస్తుంటాడు ఫ్రెడ్రిక్. ఈ ప్రయత్నంలో భాగంగా అతను పంపిన ఇద్దరు విదేశీయులు, కొనలో అకస్మాత్తుగా కనిపించిన వెలుగుతో మాడి మసైపోతారు. ఇది ప్రొజెక్టర్ పై చూసిన ఫ్రెడ్రిక్ విస్తుపోతూ ఉండగా, విలియమ్స్ అతన్ని క్షుద్రపూజలు చేసే అత్రిక వద్దకు తీసుకువెళ్తాడు. ఆ శక్తి అత్రికకు అందక, ఆమె వారిని భారత్ లో ఉన్న తన గురువు తంత్రిణి వద్దకు వెళ్ళమని పంపుతుంది. గండరుడి కోసం పూజలు చెయ్యాలని నిశ్చయించుకుంటుంది తంత్రిణి. రుద్రాణి కోనకు ఆర్కియాలజి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ప్రవల్లికకు బదిలీ అవుతుంది. సృష్టి, అధ్భుత్ కలిసినప్పుడల్లా ప్రమాదాలు తప్పిపోతుంటాయి.  ప్రవల్లిక వెళ్తున్న జీప్ పంక్చర్ అయితే, ఆ అడవిలో తిరుగుతున్న దేవ్ రిపేర్ చేస్తాడు. తంత్రిణి హోమానికి ప్రసన్నుడైన గండరుడు రుద్రాణి కోన రహస్యం గురించి చెప్తూ ఉంటాడు. కృష్ణుడి వద్దనుంచి ప్రద్యుమ్నుడికి వచ్చిన శమంతకమణిని రుద్రాణి కోటలో ఉంచి అతడు పూజిస్తూ ఉంటాడు. తరతరాలు మారి అది అప్పుడు కోటను పాలిస్తున్న వీరసింగడి చేతికి వస్తుంది. దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నంలో సింగడి కూతురైన జాబిల్లి, ఆమె ప్రేమికుడు సూరీడులను హతమారుస్తాడు కింకాసురుడు. రుద్రాణి వద్ద బందీగా నిలుస్తాడు.   అడవిలో ప్రవల్లికకు అనేక వింత సంఘటనలు ఎదురౌతూ ఉంటాయి. బెంగుళూరు యూత్ మీట్ కు సెలెక్ట్ అవుతారు అద్భుత్, సృష్టి.  ఇక చదవండి...)
హైదరాబాద్ లో ఫ్రెడ్రిక్ , విలియమ్స్ తమ కారవాన్ లో వెళుతుంటారు.
ఫ్రెడ్రిక్ దీర్ఘంగా ఆలోచిస్తుంటే గమనించిన విలియమ్స్, చేతిలోని వైన్ గ్లాస్ ను ఫ్రెడ్రిక్ కు అందించి , “డోంట్ వర్రీ ఫ్రెడ్డీ ...అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతాయి. బిలీవ్ మి” అన్నాడు.
“యా హోప్ సో , కానీ ఎందుకో ఇదంత చిన్న విషయంలా అనిపించట్లేదు. ఆర్ యూ ష్యూర్ ఈ విచ్ ల వల్ల అవుతుందంటావా?” ఫ్రెడ్రిక్ నిరుత్సాహంగా అడిగాడు.
“ష్యూర్ దే విల్! నువ్వే చూసావుగా, థింగ్స్ హావ్ చేంజడ్, తంత్రిణిని కలిసిన తరువాత వియ్ గాట్ సమ్ బ్రేక్ థ్రూ.. ఆల్మోస్ట్ వియ్ ఆర్ నియర్ టు ద సీక్రెట్ .. “, తాపీగా వైన్ సిప్ చేస్తూ చెప్పాడు విలియమ్స్.
“బట్ హూ ఈజ్ దిస్ , వాట్ దే సెడ్ ..ఆ ..పునర్వసు నక్షత్రం వాడు , ఎవడయి ఉంటాడు ?” ఫ్రెడ్రిక్ అడగటం విని, “ఎవడైనా కానీ వచ్చాక మనవాడైపోతాడు” అన్నాడు విలియమ్స్.
క్యారవాన్ వెళుతూ ఉంది.
అదే రోడ్ కు కొంత దూరంలో ఉన్న శ్రీని మెడికల్ అండ్ ఇంజినీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో ..
ఐఐఎస్ సీ మీట్ కు వెళుతున్న స్టూడెంట్స్ బస్ ఎక్కుతున్నారు....
అద్భుత్ గడియారం వైపు చూసుకుని,” సృష్టి రాలేదేంటి ?” అని అనుకుని సృష్టి స్నేహితురాలు వందన దగ్గరకెళ్ళి , “వందనా సృష్టి ఇంకా రాలేదేంటి?” అని అడిగాడు.
“అదేంటి నీకు తెలియదా, తను రావట్లేదు కదా,” అని వందన చెప్పింది.
“రావట్లేదా ? ఏమయ్యి ఉంటుంది ? తను బానే ఉందా ?”అని అనుకుంటూ ఉండిపోయాడు అద్భుత్.
“ వేర్ ఆర్ యూ బోయ్? ఆల్ రెడీ ..గెట్ ఇన్ ..విల్ స్టార్ట్” అంటూ ప్రొఫెసర్ బస్ లో కి ఎక్కాడు.
“సార్, ఏమనుకోకండి మీరు బయలుదేరండి , నేను బెంగళూరులో జాయిన్ అవుతాను,” అని అద్భుత్ చెప్పటం విని, “ఆర్ యూ ష్యూర్?” అడిగాడు ప్రొఫెసర్.
“యస్ సర్! యూ పీపుల్ క్యారీ ఆన్,” అని ప్రొఫెసర్ కి చెప్పి విండో పక్కన కూర్చున్న వందన దగ్గరకు వెళ్ళి “వందనా, సృష్టి అడ్రస్ ఇస్తావా?” అని అడిగాడు.
“ష్యూర్” అని వందన పేపర్ పై రాస్తున్నంతలో, ప్రొఫెసర్ డోర్ లాక్ చేసాడు.
“ఓకే ..అద్భుత్ , బై .. డోంట్ బీ లేట్ టు ద మీట్ ..”అని అద్భుత్ కి చెప్తుండగా డ్రైవర్, రైట్ రైట్ అనటంతో బస్ కదిలింది.
వందన అడ్రస్ రాసిన పేపర్ ను గాలిలోకి వదలటంతో, అద్భుత్ దానిని పట్టుకోబోతుంటే గాలి ఎక్కువగా వీచటం మొదలయ్యింది.
కాగితం గాలిలో ఎగురుతూ వెళుతుంటే అద్భుత్ దాన్ని పట్టుకోడానికి వెళ్తున్నాడు. కాగితం వెళుతూ వెళుతూ, కాలేజ్ గేట్ దాటి రోడ్ మీదకు వెళ్ళిపోవటం చూసి , “ఒసే ఆగవే అది ఒట్టి అడ్రసు కాదే , నా లైఫ్ అడ్రెస్”, అంటూ రోడ్ దాటి వెళుతూ, రోడ్ కి చివర కనిపించిన డ్రైనేజిని చూసి, అక్కడున్న డివైడర్ పై  నిలబడి, అటువైపుగా వస్తున్న కారవాన్ ను చూసి, కారవాన్ వెనక గ్రిల్ ను పట్టుకుని ఒక్క ఉదుటున జంప్ చేసి డ్రైనేజ్ లో పడబోతున్న పేపర్ ను పట్టుకున్నాడు.
రేర్ వ్యూలో అదంతా చూసిన ఫ్రెడ్రిక్ “వాట్ ద హెల్,” అని ఇరిటేట్ అవుతూ కారవాన్ ఆపమని బెల్ ప్రెస్ చేయటంతో కారవాన్ ఆగింది.
కోపంగా కారవాన్ దిగి, కాగితాన్ని చూసి ఆనందపడుతూ పేపర్ లో రాసి ఉన్న మొబైల్ నంబరుకు కాల్ చేస్తున్న అద్భుత్ ను చూసి,” హేయ్ బోయ్ ,ఆర్ యూ క్రేజీ?” అని అడిగాడు ఫ్రెడ్రిక్.
“సారీ జెంటిల్ మెన్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్” అని అద్భుత్ అనటం విని , “వాట్ !దిస్ పీస్ ఆఫ్ పేపర్ ఈజ్  మోర్ దాన్ యువర్ లైఫ్?” అన్నాడు ఫ్రెడ్రిక్.
“బట్ ఫర్ నౌ దిసీజ్ మై లైఫ్ , ఒన్స్ అగైన్ సారీ,” అని చెప్పి అద్భుత్ వెళ్తుండటం చూసి, “హేయ్ యూ ఆర్ బ్లీడింగ్?” అని అధ్బుత్ కాలి నుండి కారుతున్న రక్తాన్ని చూసి అన్నాడు ఫెడ్రిక్.
అద్భుత్ అది చూసుకుని జంప్ చేస్తున్నపుడు కాలికి గ్రిల్ అంచు తగలటం గుర్తొచ్చి, ఇట్స్ ఓకే అన్నాడు. “నాట్ ఓకే .. వెయిట్ వెయిట్,” అని అద్భుత్ కు చెప్పి,” ఎక్కడికెళ్ళాలి?” అని అడిగాడు ఫ్రెడ్రిక్.
“జుబ్లీహిల్ల్స్” అని అద్భుత్ చెప్పటంతో కమ్ డ్రాప్ చేస్తాను, అని ఫ్రెడ్రిక్ లిఫ్ట్ ఆఫర్ చేసాడు.
“థాంక్స్ , బట్ ఐ విల్ టెక్ ఆటో,” అంటూ అద్భుత్ ఆటోను పిలిచాడు.
“అటే వెళుతున్నపుడు ఆటో ఎందుకు, ఫర్లేదు రా,” అని ఫ్రెడ్రిక్ అనటం విని “వావ్ , మీరేంటి తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు?” అని అడిగాడు అద్భుత్.
“ఒక పని కోసం రెండేళ్లుగా తెలుగు గాలి పీల్చుతున్నాం కదా, ఇక్కడి భాష కూడా మాలో ఒకటై పోయిందని” చెప్తూ ఫ్రెడ్రిక్ అద్భుత్ కి ఫస్ట్ ఎయిడ్ కిట్ ని ఇస్తాడు.
అధ్భుత్ కాటన్ తో రక్తం తుడుచుకుని బ్యాండ్ ఎయిడ్ వేసుకుంటుండగా, “ఏంటి లవ్వా?” అని అడిగాడు విలియమ్స్.
“అంతకంటే ఎక్కువ,” అని అధ్బుత్ చెప్పటం విని నవ్వుకుని,” అందుకేనా రక్తం ఇచ్చి మరీ పట్టుకున్నావ్ ?” అన్నాడు ఫ్రెడ్రిక్.
“తన కోసం రక్తమేంటి ప్రాణమైనా ఇచ్చేస్తాను,” అన్నాడు అద్భుత్.
“వేడి రక్తం కదా! ఇపుడు అలానే అంటారు,” అని నవ్వుతూ విలియమ్స్ డ్రింక్స్ ప్రిపేర్ చేస్తాడు.
“ట్రెజర్ ఆఫ్ లైఫ్ టైం” అని కనిపించిన బుక్ ని , కొన్ని ఫొటోగ్రాఫ్ లను చూసిన అద్భుత్ – “అంటే మీరు ఏదయినా ట్రెజర్ హంట్ చేస్తున్నారా?” అని అడిగాడు.
“సింపుల్ గా అలాంటిదే, కానీ దాన్ని ట్రెజర్ అనటం కంటే పవర్ అనాలి ,”చెప్పాడు ఫ్రెడ్రిక్.
“ఇండియా కదా అలానే అనాలి , ఆ పవర్ దొరికితే ఏం చేస్తారు?” అడిగాడు అధ్బుత్.
“ఆ పవర్ చిక్కితే ప్రపంచానికే ఎనర్జీ వస్తుంది, అది దొరకటం అలా ఉంచితే కనీసం ఒక్కసారయినా చూడాలి,” అని ఫ్రెడ్రిక్ ఎక్సైట్ అవ్వుతూ చెప్పాడు.
“వినటానికి బావుంది, దొరికితే ఇంకా బావుంటుంది.” అని చెప్తూ నా ప్లేస్ వచ్చేసింది అన్నాడు అద్భుత్.
విలియమ్స్ బెల్ ప్రెస్ చేయటంతో కారవాన్ ఆగింది.
“థాంక్యూ అండ్ నైస్ మీటింగ్ యూ,” అని అద్భుత్ ఫ్రెడ్రిక్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
“ఓకే యంగ్ బోయ్! ఆల్ ద బెస్ట్ నీకు, నీ లవ్ కి కూడా !” నవ్వుతూ చెప్పాడు ఫ్రెడ్రిక్.
అది విని హ్హ హ్హ అని నవ్వుకుని,” టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, మీ పల్స్ రేట్ చెప్తోంది మీ హార్ట్ అంతా ఆ ట్రెజర్ పైనే ఉందని, డోంట్ వర్రీ మా అమ్మ ఎపుడూ చెపుతుంది.. ఏదయినా మంచి మనసుతో హార్ట్ ఫుల్ గా కోరుకుంటే అది మనకు దక్కుతుందని, ఐ విష్ మీ ట్రెజర్ కూడా మీకు దొరకాలని, అది అందరికీ ఉపయోగపడాలని” అని అద్భుత్ అన్నాడు.
 “థాంక్యూ సో మచ్”, అని అద్భుత్ ని హగ్ చేసుకున్నాడు ఫెడ్రిక్.
“బై బై”, అని అద్భుత్ వెళ్ళటం చూస్తూ ఉన్న ఫ్రెడ్రిక్ ని, “వాట్ ఫ్రెడ్డీ, ఆర్ యూ ఓకే,  వేలు టచ్ అయ్యిందని ఒకడి చెయ్యే తీసేసావ్, అలాంటిది నువ్వు వీడిని హగ్ చేసుకున్నావ్, ఏమైంది ?”అడిగాడు విలియమ్స్.
అది విని నవ్వుకుని నాకెందుకో వీడిని మరలా కలుస్తాననిపిస్తుంది చెప్పాడు ఫ్రెడ్రిక్.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages