మానవీయ బంధాల కదంబం.. దీప తోరణం - అచ్చంగా తెలుగు

మానవీయ బంధాల కదంబం.. దీప తోరణం

Share This

మానవీయ బంధాల కదంబం.. దీప తోరణం

- సమ్మెట ఉమాదేవి 


చదివించే చక్కని శిల్పంతో జీవన శిల్పం... కదిలించే కథనాలతో పొడిచే పొద్దు  వెలువరించాక ..
కన్నెగంటి అనసూయ కలం నుండి వెలువడ్డ మూడవ కథల సంపుటి ఈ దీప తోరణం ..
         సామాజిక సేవ రచయిత్రి సహజ ప్రవుత్తి.. ఆమె దైనందిన జీవితంలో కళ్ళెదుట ఎదురయ్యే అనుభవాలు కొల్లలు. చలించే మనస్తత్వం .. ప్రతి చర్యించే స్వభావం రాయకుండా ఆమెని  నిలువనియ్యని  కథాంశాలను  ఇచ్చాయి. వాటినే దీప తోరణంగా మనకు అందించారు ఆమె.
         14 కథలు ఇందులో చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రముఖ  సంస్థల పత్రికల  బహుమతులు కూడా అందుకున్నాయి. కథా శీర్షికల విషయంలో రచయత్రి కనపరిచే శ్రద్ధ.. పాఠకులను  ఆకట్టుకుంటుంది. ఒక కథ మనలను ఓ పల్లెటూరికి తీసుకెళ్తుంది. ఒక కథ మనలను మన ఇంటి వసారాలో నిలబట్టి కుటుంబ విషయాలను  చర్చిస్తుంది.  ఒకకథ మన సామజిక బాధ్యతలను నిలదీస్తుంది . ఒక కథ మనలోని సున్నితంగా అంతరాలను  స్పృశిస్తాయి. ఒక్కో  కథలో ఒక్కో సమస్య. మనలో ఆలోచనలను తట్టిలేపుతాయి..పరిష్కారలవయిపుకు  పురి కొల్పుతాయి. ..
       బడికి సెలవంటే చాలామంది పిల్లకు సరదా.. కాని  వానలో కూడా బడికి రావడం మరి కొందరికి సరదా.. ఏ  నీడ లేని ఓ నిరుపేద పిల్లకు బడే సర్వస్వం.. ఆ అమాయికకుఓ అండ దొరికితే యెలా. ఉంటుందో కన్నులు  చమరించే కథనంతో ఆ చల్లని నీడ కథ చెబుతుంది.
      జ్ఞాపకం జీవించిన వేళలో .. సీతా ఫలాలు అమ్ముకునే తాత కథతో పాటుగా మనలను పల్లెకు తీసుకెళ్ళి మధుర జ్ఞాపకాలను తట్టి  లేపుతాయి.. పల్లెలో ఒకరు మరొకరినిఆదరించి అన్నం పెట్టే గుణం మళ్ళీ మనం చేసుకుంటాం .
        ఏది మురికి  ఎవరు మురికి కథలో మురికి పనులు చేసేవాళ్ళంతా మురికి వాళ్ళు ఎలా  అవుతారు.. వాళ్ళు వదిలించేది మన మురికినే కదా అన్న ప్రశ్న చెల్లునచరవడం గమనిస్తాం
      వయసులో పెద్దవరో  జీవితానుభవం ఉన్నవారో మాత్రమే మంచి విలువలు పాటిస్తారని  అనుకోరాదు .. అవకాశాలను  బట్టి మన ఆశలను బట్టి విలువలుమారిపోతుంటాయి. కానీ మనవి కాని వాటిని మనం ఆశించరాదు  అన్న నిబద్దత ఉంటే.. సున్నితమయిన  కథాంశాన్ని చిక్కని కథనం .. మనవి కానివి  కథలో చూస్తాం. పితృదేవోభవ కథలో  సందర్బానుసారంగా చలం గురించి చర్చించిన ఆసక్తి కరమయిన విషయాలను వింటాం.
         దీపతోరణం కథ మనలను,  ఒక్క సారి .. చిన్నపాటి దీపావళి పండగ రోజులోకి తీసుకెళ్ళి .. ఒకింత చీకటిని మరోకింత స్నేహ కాంతిని తడిమిన వైనం చూపుతుంది.కొబ్బరి నీళ్ళు కథ,  ముసలి తల్లి కోసం ఓ పెద్దాయన పడ్డ అగచాట్లు వివరిస్తూ పాత్రోచితమయిన యాసతో  నడిచి .. మాతృ ప్రేమ విలువను  కొబ్బరి నీళ్ళలా అందిస్తుంది..
       సమాజాన్ని వణికించే ఎయిడ్స్ వ్యాధి సోకిన వారి గాధలెన్నో చదివాము మనం. వ్యాధి గ్రస్తురాలు మంచి  సేవికగా మారడం .. అంతకు మించి మరో మెట్టుకు ఎదిగి  "ప్రమాదం లో ఉన్న వ్యక్తికి సాయం చేసే ముందు వాడు మంచి వాడో కాదో చూస్తామా.." అని అన్న వాక్యాలతో బాధిత   ఔన్నత్యాన్ని చూస్తాం.    .  ఆ మాత్రం చాలు కథవినియోగదార్ల హక్కులను గుర్తు చేసే మంచి కతయితే తెలుగు భాష పట్ల అభిమానం పెంచే కథనం రాజ ముద్ర కథలో చూస్తాము. ఆధునిక యుగంలో మనం కోల్పోతున్నఅనుబంధాలను గురించి వివరిస్తూ సున్నం, గోడలు కాదు.. సాంకేతిక జ్ఞానం కాదు, జీవితాలను నడిపించేవి ప్రేమ, అభిమానం, ఆత్మీయానురాగాలు ఇవే శాశ్వతంగా.నిలిచేవి..అని  నిర్వచిస్తారు  రచయిత్రి .. జీవితాలను శాసించేవి కథలో....
     ఇలా ఈ కథలన్నీ పల్లె గాలులువీచి .. మానవత్వంతో  పరిమళి స్తుంటాయి. కథలు చదువుతునంత   సేపు  సీతాఫలాలు, చెరుకు గడలు , ఏరు సెనక్కాయలు తాటిముంజలు, పిండి వడియాలు  గుమ్మడి కాయ ముక్క  అరిసెలు, పాకుండలు , వెన్న ముద్దలు, చేగోడీలు .. మనల నోరు  ఊరిస్తే.. తాత, మావయ్య , చిన్నీ, బాపాయి పెద్ది,పాటపోల్లు, రూపాయి పెద్ది,  అప్పగారు ఇలా మనచుట్టూ కలియ తిరుగుతుంటారు ఇలా దీపతోరణంలోని  కథలన్నీ  మన పల్లెలోని నగరంలోని  సమాజంలోని స్థితి గతులకుచక్కని నివేదికలుగా నిలుస్తాయి రచయత్రి కలం నుండి మరిన్ని మట్టి వాసనల  మానవ సంభందాల కథలును ఆశించవచ్చు.
దీప తోరణం -  కథానికల సంపుటి
 గంటి అనసూయ - శ్రీ రవి పవన్ పబ్లికేషన్స్
వెల 120 రూ.
for  copies ..
Kanneganti Ansooaya , 406 Vindhya 4, Kukatpally Y Junction , Jyaya Bharathi Gardens, Kukat payy Hyderabad 500016
Mobile no 9246541249, ansooya kanneganty@gmail.com

No comments:

Post a Comment

Pages