పనీర్ బట్టర్ మసాలా - అచ్చంగా తెలుగు

పనీర్ బట్టర్ మసాలా

Share This

 పనీర్ బట్టర్ మసాలా 

- లీలా సౌజన్య 


మామూలుగా హోటల్ కు వెళ్తే మనం మొదట ఆర్డర్ ఇచ్చే వంటకం - పనీర్ బట్టర్ మసాలా. ఇది చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు, మరి ఎలాగో చూద్దామా ?
కావలసిన పదార్ధాలు :
ఉల్లిపాయలు - 4 (200 gr)
టమాటోలు - 4 (200 gr)
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లిపాయలు - 5 రెబ్బలు
ఎవరెస్ట్ షాహీ మసాలా - 1 స్పూన్
కారం - 1 స్పూన్
జీలకర్ర - 1/2 స్పూన్
ఉప్పు - తగినంత
వెన్న, లేక తాజా క్రీం
నూనె - 5 స్పూన్లు
తరిగిన కొత్తిమీర
పనీర్ - 200 గ్రా. ముక్కలు కోసుకుని, కడిగి నీటిలో వేసుకుని ఉంచాలి.
తయారీ విధానం :
ఉల్లిపాయలు పెద్ద ముక్కలు తరిగి, అల్లం వెల్లుల్లి కలిపి, మిక్సీ లో రుబ్బుకోవాలి.
చిన్న కుక్కర్ తీసుకుని, అందులో నూనె వేసి, కొంచెం కాగాకా జీలకర్ర వేసి, అది వేగాకా ఉల్లిపాయ పేస్టు వేసి, 5 నిముషాలు వేయించాలి (ఉల్లిపాయ ముద్ద త్వరగా వేగాలంటే , ఉప్పు కలుపుకోవాలి.)
ఇప్పుడు టొమాటోలు కూడా ముక్కలు కోసి, మిక్సీ వేసి, ఈ వేగే ఉల్లిపాయ ముద్దలో కలపి వేయించాలి.
తర్వాత తగినంత ఉప్పు, కారం, షాహీ మసాలా పొడి, 1/2 స్పూన్ పంచదార వేసి, 10 నిముషాలు వేగనివ్వాలి. కొంచెం వేగాకా 2 చిన్న గ్లాసుల నీరు పోసి, పనీర్ ముక్కలు వేసి, కుక్కర్ మూత, విసిల్ పెట్టి, 4 కూతలు రానివ్వాలి. చల్లారాకా, కుక్కర్ మూత తీసి, కొత్తిమీరతో , ఫ్రెష్ క్రీం తో పైన అలంకరిస్తే, హోటల్ స్టైల్ లో పనీర్ బట్టర్ మసాలా తయార్... అన్నట్టు, నీరు మరీ ఎక్కువైతే, కుక్కర్ తెరిచాకా, కాసేపు స్టవ్ మీదే ఉండనివ్వండే !

No comments:

Post a Comment

Pages