నాట్య వేద – చింతలూరి శ్రీ లక్ష్మి - అచ్చంగా తెలుగు

నాట్య వేద – చింతలూరి శ్రీ లక్ష్మి

Share This

నాట్య వేద  – చింతలూరి శ్రీ లక్ష్మి 

- బ్నిం


కృష్ణా జిల్లా మధిర మండలం...
అదో జమిందారు గారి దివాణo. ఆ ఊరు వాళ్ళు ,ఆ భవంతిలో వారు జమిందారు గారి ఆలనా పాలనా పొందుతున్నట్లే
వినయ విధేయతలతోనే ఉంటారు. జమిందారు గారి అబ్బాయి గారు ‘పిల్ల జమిందారు’ అని గౌరవాలు పొందాలనుకోలేదు గాని, అతనిమన్నన మనస్తత్వానికి, కళా హృదయానికే అందరి మన్ననలు పొందుతుంటాడు.
ఇప్పుడువాళ్ళింట్లో జమీదారు కూడా తలవంచేది, చిన్న జమిందారు కూడా అగ్గగలాడేది ఒక్కరి కోసమే !
ఆఖర్న పుట్టిన మనవరాలు అందరి గారాల కూచి,లక్ష్మి కళతో పుట్టిన పాపకి, ఆ కళ మరింత కళాత్మకంగా ఎదగాలని శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు.
జమిందారు గారు జమీన్ జమా ఖర్చులు రాయటానికి సమయాన్ని జనాన్ని వినియోగించుకోలేదు గాని తీరిక దొరికినప్పుడు సత్కళా కాలక్షేపానికే వినియోగించారు.
తనకిగా తాను సంగీత నృత్యకార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ఆనందించేవారు.
పరిసర పట్టణాల్లో అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నా సకుటుంబంగా బండి కట్టించుకొని వెళ్లి చూసోచ్చేవారు.
అలా ఎందరో కళాకారులు వారి దివాణం వద్ద కళా ప్రదర్శనలు చేసి ఆనందించేవారు.n3
ఓసారి ఓ 16 ఏళ్ల బాలామణి ముగ్ధ మనోహరంగా అభినయం చేస్తే జమిందారు గారు చిన్న జమిందారు గారు, విడి విడిగా బహుమానాలు అందించి సత్కరించారు.
సత్కరించిన వారిద్దరికీ  తెలుసు - ఆ చిరంజీవి వేదాంతం సత్యనారాయణ శర్మ గారని – ఆ విషయం తెలిసాక దివాణం స్రీలు, పరివారం గుండె కుదుట పది సంతోషించారు. ఆ తర్వాత ఆచ్యర్య పోయారు .ఆ జమిందారు గారు తన మనవరాళ్ళకి డాన్స్ నేర్పుతారా అని కూచిపూడి నాట్య గురువులని అడిగారు.వారు వినయంగా “మేము ప్రదర్శన కోసం ఉన్నచోట ఉండకుండా తిన్న చోట తినకుండా తిరుగాడే సంచార కళాకారులం. చెన్న పట్నంలో శైవా గారనే మహనీయుడు అనేక ప్రదేశాల్లో నాట్యం నేర్పిస్తూ సంచరిస్తారు. మీరు అభ్యర్దిస్తే వారు అంగీకరిస్తారు.” అని దారి చూపించారు . ఫలితంగా పెద్ద మనవరాళ్ళు శైవా గారి దగ్గర డాన్స్ నేర్చుకున్నారు.
శ్రీలక్ష్మికి ఊహ తెలిసీ తెలియని వయస్సులోనే నట్టువాంగం మువ్వల శబ్దం చెవులకి పట్టాయి.
ఊహ తెలియడం మొదలెట్టాక అక్కలు నాట్య సాధన చేస్తుంటే సరదా పడేది .వాళ్ళని ఇమిటేట్ చేసేది.
ఇంట్లో నుండి చప్పట్లు విని మురిసిపోయేది. అక్కయ్యలు మేళా ఉత్సవాల్లో పాల్గొంటున్నప్పుడు అందరితో బాటు వెళ్లి చూసేది. తోలేటి వారి అమ్మాయిలు బాగా చేస్తున్నారు, అని అందరు అంటుంటే తననే వారు మెచ్చుకోవట్లేదని ఊడుక్కుంది కూడా, తాను పెద్దయ్యాక పెద్ద డాన్సర్ అవ్వాలనుకుంది.ఆ చిన్నప్పుడే విజయవాడలో “చేనేత సప్తాహం” అనే ఉత్సవాల్లో ఎవరో వాళ్ళు ఎంత గోప్పవాళ్ళో తెలియదు గాని వెంపటి చిన సత్యం,ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి డాన్స్ ప్రోగ్రాం చేసారు.చిన్న శ్రీలక్ష్మి కి వాళ్ళేవళ్ళోతెలియదు గాని బావుందనిపించింది. డాన్స్ నేర్చుకుంటానని పేచి పెట్టింది.
శైవా గారు రావట్లేదు.అక్కయ్యల దగ్గర ‘దిద్దితై’ మొదలుపెట్టింది.
కాని అక్కయ్యలు మాములుగా గారం చెయ్యకుండా గురువుగా గదమాయిస్తుంటే మంచి టీచర్ ని వెతకమంది.
n7శ్రీలక్ష్మి ఆఖరి పిల్ల కదా తీక్షణంగా గురువుల వేట మొదలెట్టారు పెద్దలు ,నర్రా కనకదుర్గ(విజయవాడ మ్యూజిక్ కాలేజీలెక్చరర్)గారి ఆశీస్సులతో డాన్స్ క్లాసులో ప్రవేశించారు.
బాగా చేసింది చేస్తోంది. డిప్లొమా కూడా చేసేసింది. అయితే అసంతృప్తి తను ఇష్టపడిన డాన్స్ కాదది. తేడాగా ఉంది. ఎందుకుండదు?ఆమె కూచిపూడి ఇష్టపడితే భరతనాట్యం ట్రాక్ పై బండి పడింది.
కొంత దూరం నడిచాక రైలు దిగి కొత్త రైలు ఎక్కే ధైర్యం సంతరించుకుంది.
కూచిపూడి నృత్యం కావలనికోరుకుంది.
కొత్తపల్లి పద్మ గారనే వెంపటి వారి శిష్యురాలుకి శిష్యురాలు అయ్యింది.
వరసకి సోదరి అయిన పద్మ తన అనుభవ సారాన్ని అందించి, కూచిపూడి సిద్దేంద్ర కళాక్షేత్రంలో ప్రవేశానికి అర్హురాలుగా తీర్చిదిద్దారు.
కూచిపూడి కళా క్షేత్రం గురించిఇప్పుడు తలచుకొని పులకించి పోతూ అప్పటి వైభవం లేదని కించిత్తుప్తీ కారం వేలుబుచ్చుతారు.
శ్రీలక్ష్మి గారి మాటల్లో...
సిద్ధేంద్ర కళా క్షేత్ర౦ ఒక అద్భుతమైన ప్రయోగం ప్రపంచంలో అక్కడ ఉండే మహా పండితులందరూ గురుత్వం వహిస్తారు. అలా రత్తయ్య శర్మ గారు ,చింతా ఆదినారాయణ గారు ,వేదాంత సత్యనారాయణ శర్మ గారు పసుమర్తి వెంకట శర్మ గారు వేదాంతం రాధేశ్యాం గారు,కేశవ ప్రసాద్ గారు బాల కొండల రావు గారు, ఈ మహానీయులంతా గురు శిష్య పరంపర కొనసాగాలనే సంకల్పంతో సశాస్త్రియమైన ‘నాట్య వేదం’ నేర్పించేవారు .సంస్కృత శ్లోకాలు ,అర్ధాలు వివరణలు చెప్పేవారు .టి.వి.జి.కృష్ణ గారు సంగీత పాఠాలు నేర్పేవారు .సంవత్సరంలో మూడు నెలలు వెంపటి చిన సత్యంగారు మద్రాసు నుండి వచ్చి టీచర్ ట్రైనింగ్ కోర్స్  లు నడిపేవారు .దానికి కళా క్షేత్ర విద్యార్ధులే కాకుండా ఎక్కడెక్కడి ఊళ్ళ నుంచో వచ్చేవారు.ఆ రోజుల్లో సిద్ధేంద్ర కళా క్షేత్ర ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రం.”n2
శ్రీలక్ష్మిగారుకళా క్షేత్రం గురించి చెప్తూ కళ్ళ నీళ్ళు తుడుచుకున్నారు..
నాటి ఆనందానికో నేటి పరిస్థితి మారిందని బెంగో నాకు అర్ధం కాలేదు .
ఆ తర్వాత శ్రీలక్ష్మి మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నారు. విజయవాడలో నాట్య గురువుగా పాదం పెట్టారు.
కొన్నాళ్లకే కధ హైదరాబాద్ వైపు తిరిగింది.( రైల్వే లో కల్చరల్ కోటాలో) ఆమెకి ఉద్యోగం వచ్చింది.
ఆ రైలు బండి లోనే ఉంటూ ఆమెలో నర్తకికి ,గురువులా ఖ్యాతి గాంచే అవకాశం ఉండేది కాదు .అందుకనే ఉద్యోగ బంధం వదిలించుకున్నారు.తను రైల్వే ఉద్యోగాన్ని దిగాక తన బాట స్పష్టమైంది. నాట్య గురువుగా తన స్థానాన్ని బలపరచుకోవటమే లక్ష్యంగా విజయవాడ ‘నాట్యవేద’ కూచిపూడి నృత్యశిక్షణాలయాన్ని నెలకొల్పారు.
తర్వాతే రాజమండ్రికి నాట్యవేద వచ్చింది.

ఇప్పుడు ముఖా ముఖి.    

ప్రస్తుతం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు?
60-70 దాక ఉండేవారు.ఇప్పుడు 30 మంది.
కారణం..
తల్లిదండ్రులు
పెద్ద చదువులకి ఆటంకం అనా ?
అలా అపోహపడి.
మరి కెరియర్ ఓరియెంటెడ్ చదువులు కదా !
డాన్స్ వల్ల ధైర్యంవస్తుంది. సభా పిరికితనం పోతుంది. ఆ సోషల్ మొవెమెంట్ కెరియర్ కి చాలా అవసరం కదా?
నేను అదే నమ్ముతాను .మీరెంత మందికి అరంగేట్రం చేయించారు.
కూచిపూడిలో అరంగేట్రం అనే పదం లేదు .దానిపేరు రంగ ప్రవేశం. హైదరాబాద్ వాళ్ళే ఆ మాటని భరత నాట్యం నుంచి తెచ్చి వాడుతున్నారు.
మేబీ మీరెంత మంది చేత అంటే ఎన్ని లక్షలు సంపాదించానో లేక్కలేయిస్తారు?
నవ్వకండి..అది స్టూడెంట్ కి విద్య ప్రదర్శన వేళ కదా?అయినానేనుఎలాంటి గురు దక్షిణా తీసుకోలేదు. అలాంటి అరంగేట్రం చేయించానూలేదు.డాన్స్ నేర్చుకోవటాన్ని చాలా ఖరీదైన విషయంగా నేను మార్చేయటాన్ని, నేను అంగీకరించలేను.
మీ ఇన్స్టిట్యూట్ లో ఫీజు ఎంత?  
వాళ్ళివ్వగలిగినంత- కొంత మందికి ఫ్రీ గా కూడా చెప్తాను.
కాస్టూమ్స్ ,నగలు బోలెడు ఖరీదు కదా !
నా దగ్గర ఉన్న నగలు ,కాస్టూమ్స్నేను ఇచ్చే ప్రదర్శనలకి సరిపడా ఉన్నాయి. అవి చాలక పోయినా సైజు లు చాలక పోయినా వాళ్ళే తెచ్చుకుంటారు .వాళ్ళే ఇంట్లో దాచుకుంటారు.
పోనీ ఓ ప్రదర్శనకి తీసుకెళ్ళినపుడు ఆ స్టూడెంట్ కి ఎంత వాటా పడుతుంది.
ప్రదర్శన కొచ్చిన పైకం ఉంటుందిగా, వాళ్ళనెందుకు అడగటం? కూచిపూడి నాట్యోద్దరణకి గవర్నమెంట్ చాలా వెచ్చిస్తోంది.ఎలా దీన్ని వినియోగిస్తే మంచిది. ఉచిత వేద పాఠశాల లాగా ఉచిత నాట్య పాఠశాలలు  పెట్టి గురువులకి జీతం ఇవ్వాలనిపిస్తుంది.
పిల్లల దగ్గర డబ్బు తీసుకోరాదని కచ్చిత మైన రూల్ పెడితే బాగుంటుందా ?
మీ సలహా బాగుంది. కొన్ని రూల్స్ ఇంకా పెట్టాలి లెండి .
ఏంటవి?
మీరు ప్రశ్న వేయకూడదు నేను అడగాలి.
సరే.
మీరు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉంటారు?
నేనా?మా నాట్యవేద నా?
మీ ప్రదర్శనలు అడిగితే గుర్తులేదంటారు. నాట్యవేద సంగతులే చెప్పండి.
షుమారుగా ఏడాది కి 40 దాక పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తాం. చిన్నవి అంటే నాన్ ప్రాఫిట్ తో చేస్తుంటాం. 10-15 అలా నాట్యం చేస్తున్నట్టే మేం మా స్కూల్ లో.
కొత్త పాటలేమన్నా కంపొస్  చేసారా?
అన్నమయ్య పై నృత్య రూపకాలు చేసాను, చేస్తున్నాను. పక్కా కూచిపూడి సాంప్రదాయం కి ఒదిగే పాటలెన్నో కంపోస్ చేస్తున్నా – వాటికి రూపకాలుగా  కొంత రాసి .. పోనీ
మీ రైటర్? అంటే నేను మీకు ఒక్క డైలాగ్ కూడా ఇంత వరకు రాయలేదు. ఎవరా అని ?
కాని మీరు రాసిన ‘ అభేరితిల్లానా’ నేనెన్ని ప్రదర్శనలో ఐటెం గా చేశానో
అవున్లెండి అది కాపీ రైట్ లేని కాపీ అయింది అట .చాలా మందే చేస్తున్నారు.
ఇంకెవ్వరు చెయ్యకూడదని చెప్పండి. నేను తప్ప.
ఇదే మాట చాలా మంది అన్నారు నేను తప్ప అని .
ఇంకా ఎంత మంది అడుగుతారో చూసి అప్పుడు అందరి మీద యుద్ధం ప్రకటిద్దాం. సర్లెండి భోంచేద్దాం రండి !
భోజనానికి రైట్స్ కి కనెక్షన్ లేదు కదా !
ముందు కానివ్వండి తర్వాత...
స్పృహ ఉంటె చూద్దామనా ?
ఇక్కడ నుండి మీకు బోర్ కొడుతుంది. లేదా నోరూరుతుంది. మా మెనూ నేను చెప్పను .
రాజమండ్రి లో ఓ లంచ్ టైం , పద్మిని గారి శింజారావం కోసం వినియోగించినందుకు శ్రీమతిశ్రీలక్ష్మి గారికి బోల్డెన్ని బ్రేవ్లతో...

No comments:

Post a Comment

Pages