స్వీట్ కార్న్ వడ - అచ్చంగా తెలుగు

స్వీట్ కార్న్ వడ

Share This

స్వీట్ కార్న్ వడ 

- లీలా సౌజన్య

 

అనుకోని అతిధులు వచ్చినప్పుడు ఇట్టే చేసుకోగల స్నాక్ స్వీట్ కార్న్ వడ.
ఇప్పుడు అన్ని షాప్స్ లోనూ ఫ్రోజెన్ కార్న్ దొరుకుతోంది. లేదంటే రెండు మొక్కజొన్న పొత్తులు కొనుక్కుని, గింజలు ఒల్చుకోవాలి.
కావాల్సిన పదార్ధాలు :
మొక్కజొన్న గింజలు  - 200 గ్రా.
పచ్చిమిర్చి - 4/5
అల్లం - చిన్న ముక్క (ఇష్టమైతే వేసుకోవచ్చు )
బియ్యప్పిండి - 50 గ్రా.
జీలకర్ర - 1 స్పూన్
ఉప్పు - ఒకటిన్నర స్పూన్
కరివేపాకు - 3 రెమ్మలు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 2 పాయలు
అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, మొక్కజొన్న గింజలు, అన్నీ మిక్సీ లో వేసి, కచ్చా పచ్చాగా గ్రయిండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుని, బియ్యప్పిండి, ఉప్పు కలిపి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తుంపిన కరివేపాకు వేసి, కలపాలి.
స్టవ్ మీద మూకుడు/బాండి పెట్టి, అందులో నూనె పోసి, బాగా మరగనివ్వాలి. పై మిశ్రమాన్ని చేత్తో తీసుకుని, చిన్న చిన్న ఉండలు చేసి, వడల్లా నొక్కి, నూనెలో వెయ్యాలి. బంగారు రంగు వచ్చేదాకా వేయిస్తే రుచికరమైన కార్న్ వడ రెడీ.

No comments:

Post a Comment

Pages