ఎటువంటి ఆహారం తీసుకోవాలి ? - అచ్చంగా తెలుగు

ఎటువంటి ఆహారం తీసుకోవాలి ?

Share This
ఎటువంటి ఆహారం తీసుకోవాలి ?
  - ఉషా వినోద్ రాజవరం

మిత్రులకు అభివందనాలు సద్గురు వాక్యం చెప్పుకుందాము :
" లౌకిక రోగాలకు, దైహిక రోగాలకు వైద్యుడు చాలు భవ రోగాలకు మాత్రము గురువే కావాలి ! (స్వామీజీ చిటుకు సాహిత్యం నుండి ) .........................లౌకిక రోగాలు,దైహిక రోగాలు , భవ రోగాలు అని 3 రకాలుగా రోగాలను విడదీసారు లౌకిక రోగాలు అంటే మానవుని లోని ఈర్ష్య అసూయ, మాత్సర్యం మొదలైనవి కాలు నొప్పి, కడుపు నొప్పి, గుండె నొప్పి మొదలైనవి దైహిక రోగాలు మానవ జీవితం లో మనకు తెలియకుండ గనే మనలను బాధించునవి భవ రోగాలు మొదటి రెండు రోగాలకు వైద్యుడు సరిపోతాడు భవ రోగాన్ని తప్పించ గలిగిన వాడు సద్గురువు ఒక్కడే!
............. రుజ్యన్తే అనయా ఇతి రోగ: అని వ్యాకరణం .. అనగా దీని చేత జీవులు బాధ పడునని భావం రోగాలు తమంతట తాము గాక , మనం పిలిస్తేనే దగ్గరకు వస్తాయి త్రాగే నీటి తో తినే ఆహారం తో పీల్చే గాలి తో బాటు మనం రోగాలను ఆహ్వానిస్తాం! వాటిని మనమే బలవంతంగా బయటికి గెంటి వేయాలి ఈ లోకం లో రోగం లేని వాడు ఎవడు? క: అరుక్? అని ఉపనిషత్తు ప్రశ్నించింది హిత భుక్, మిత భుక్, ఋత భుక్ అరుక్ భవతి అని సమాధానం చెప్పింది ఇష్టమైన పదార్ధాన్ని మాత్రమె తినాలి, స్వల్పం గా తినాలి ధర్మ బద్ధమైన ధనం తో సంపాదించిన సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజిస్తే రోగాలు రావని పెద్దలు బోధించారు భవ రోగాలను సద్గురువు మాత్రమే తప్పించ గలరు సంసారం లో దైవికం గా కలిగే ఆపదలు , జన్మాంతర పాప ఫలం గా అనుభవిస్తున్న రోగాలు మొదలైనవి దైవ కృప వల్లనే తొలగుతాయి..
ఎలాంటి ఆహారాన్ని మనిషి తీసుకోవాలి? అనే విషయం పై శ్రీమద్భగవద్గీత  లో శ్రీ కృష్ణ భగవానుడు అర్జునునకు 17 వ అధ్యాయమైన శ్రద్దాత్రయ విభాగ యోగము లో చెప్తారు 
అందులోని 7 వ శ్లోకము నుండి 10 వ శ్లోకము  వరకు ఆహారములు ఎన్ని రకములు గ విభజింప బడి ఉన్నవో వివరించినారు .
ప్రతి వానికిని, వాని స్వభావమును అనుసరించి మూడు రకములగు ఆహారములు.
 ఇష్టమగును రస వంతములు చమురు గలిగినవి, చాల కాలము వరకు ఆకలిని అణచునవి హితమును కలిగించు ఆహారము సాత్వికులకు యిష్టము ఇవి ఆయుష్షు ను బుద్ది బలమును దేహ బలమును ఆరోగ్యమును సుఖ సంతోషములను వృద్ది చయును.
అమితముగా ఉప్పు, పులుపు, కారము, చేదు కలిగినవియు,మిక్కిలి వేడి చేయునవియు ,ఉద్రేకమును కలిగించునవియు, కడుపు మందిన్చునవియు, లేక దాహము పుట్టిన్చునవియు అగు ఆహారము లు రాజసునికి యిష్టము .. ఇవి దు:ఖ శోక రాగ ద్వేషములను  కలిగించును
3 వండి జాము పైగా అయినవి ,పక్వము కానివి యు, రుచి పోయినదియు, పాసి పోయినదియు,చాల కాలము నిలువ చేసినదియు ఎంగిలిది యు, అపవిత్రమైనది యు అగు ఆహారము తామసునకు ప్రీతి కలిగించును ఇవి బహు రోగ కారకములు.. ( ఎంగిలి కూడు నిషిద్ధము అయినను, పూర్వ కాలమందు భర్త భుక్త శేషము భార్య కు ను, తల్లిదండ్రుల ఉచ్చిష్టము బిడ్డలకు , గురువు  ఉచ్చిష్టము శిష్యునికి ప్రసాదము గాను ఎంచబడినది : ఇది తప్ప ఇతరుల ఎంగిలి పనికిరాదు )..
కనుక సాత్వికాలోచనలకు మూలం మనము తీసుకునే ఆహారము వద్ద నుండియే మొదలైనది .. ముందు ఆహారము వద్ద క్రమ శిక్షణ పాటిస్తే మిగతావి సాత్విక గుణములను పెంపొందించు కొనుటకు సులభమైన మార్గము ఏర్పడుతుంది.

No comments:

Post a Comment

Pages